-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana national and International latest breaking news and live updates on 20th Dec 2025 vreddy
-
BREAKING: ఎప్‌స్టీన్ ఫైల్స్ మొదటి బ్యాచ్ విడుదల
ABN , First Publish Date - Dec 20 , 2025 | 08:23 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 20, 2025 10:07 IST
రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్
రేపు కేసీఆర్ అధ్యక్షతన BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం
నదీ జలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం
సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై కేసీఆర్ దిశానిర్దేశం
BRS LP సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం
-
Dec 20, 2025 09:16 IST
అసోంలో ఏనుగులను ఢీకొన్న రైలు.. పట్టాలు తప్పిన బోగీలు
ప్రమాదంలో 8 ఏనుగులు మృతి
ప్రమాదానికి గురైన సైరాంగ్-ఆనంద్‌విహార్ రాజధాని ఎక్స్‌ప్రెస్
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్‌తో పాటు 5 బోగీలు
-
Dec 20, 2025 08:55 IST
అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉ.11:15కి తాళ్లపాలెంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరించనున్న చంద్రబాబు
ఉ.11:30 గంటలకు గురుకులం విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి
స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
మ.12:40 గంటలకు బంగారయ్యపేటలో ప్రజా వేదిక
మ.3 గంటలకు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
సాయంత్రం అనకాపల్లి త్రీ జంక్షన్ దగ్గర వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
-
Dec 20, 2025 08:53 IST
హైదరాబాద్: పెన్షన్ కోసం మాజీ హైకోర్టు జడ్జి న్యాయపోరాటం
రిటైర్డ్ అయ్యి మూడేళ్లు అవుతున్నా..
తనకు పూర్తి పెన్షన్ మంజూరు చేయడం లేదని పిటిషన్
పూర్తి పెన్షన్ మంజూరును ప్రారంభించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణలోపు వివారాలు తెలియజేయాలని స్పష్టం చేసిన హైకోర్టు
-
Dec 20, 2025 08:53 IST
GHMC డీలిమిటేషన్‌పై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం
24గంటల్లో 300 వార్డుల మ్యాప్, జనాభా వివరాలను..
పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సింగిల్ బెంచ్ ఆదేశం
సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పిటిషన్ వేసిన 104, 134 వార్డుల వివరాలను మాత్రమే..
రేపు ఉ.10గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశం
-
Dec 20, 2025 08:35 IST
మేడిగడ్డ నిర్మాణ సంస్థ L&Tపై క్రిమినల్ కేసుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలకు సన్నద్ధం
క్రిమినల్ కేసు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యాయశాఖ
మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత L&Tదే అని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం
ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని..
సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్, విజిలెన్స్ విభాగం
-
Dec 20, 2025 08:27 IST
నేడు, రేపు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల సదస్సుకు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి
రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్ల సదస్సు
రేపు కన్హా శాంతివనాన్ని సందర్శించనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
కన్హా శాంతివనంలో 'వరల్డ్ మెడిటేషన్ డే'కు హాజరుకానున్న సి.పి.రాధాకృష్ణన్
-
Dec 20, 2025 08:26 IST
ఉత్తర భారతాన్ని కప్పేసిన పొగమంచు
ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌లో పొగమంచు
ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్
-
Dec 20, 2025 08:26 IST
నేడు అసోంలోని గౌహతిలో ప్రధాని మోదీ పర్యటన
ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవానికి హాజ
-
Dec 20, 2025 08:25 IST
నరసరావుపేట చోర్ గ్యాంగ్ కేసు విచారణ, 12 కార్లు స్వాధీనం
చోర్ గ్యాంగ్ నుంచి పోలీసు అధికారులు కార్లు కొన్నట్లు గుర్తింపు
ఓ పోలీసు అధికారి స్వచ్చందంగా కారు విచారణ అధికారికి అప్పగింత
నరసరావుపేట రూరల్ స్టేషన్‌లో కార్ల చోరీ కేసు విచారణ
చోర్ గ్యాంగ్ కస్టడీ విచారణలో వెలుగులోకి వాస్తవాలు
-
Dec 20, 2025 08:24 IST
నేడు టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎంపిక
ఎంపిక చేయనున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ
భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్
-
Dec 20, 2025 08:24 IST
హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్
గోల్కండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్‌ను సందర్శించనున్న జ్ఞానేష్‌కుమార్
-
Dec 20, 2025 08:24 IST
తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణలో పలు జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు
నేడు, రేపు చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక
-
Dec 20, 2025 08:23 IST
ఎప్‌స్టీన్ ఫైల్స్ మొదటి బ్యాచ్ విడుదల
వివరాలు విడుదల చేసిన అమెరికా న్యాయ శాఖ
ఫొటోల్లో బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్ సహా పలువురు ప్రముఖులు
ఫైళ్లలో ట్రంప్ పేరు పెద్దగా ప్రస్తావించని అమెరికా న్యాయ శాఖ