-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana national and International latest breaking news and live updates on 19th Dec 2025 vreddy
-
BREAKING: నర్సంపేటలోని గిరిజన పాఠశాల, కళాశాలలో ఘర్షణ
ABN , First Publish Date - Dec 19 , 2025 | 08:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 19, 2025 13:32 IST
గుంటూరు: తాడేపల్లి పీఎస్‌కు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పీఎస్‌కు వచ్చిన గోరంట్ల
గోరంట్ల మాధవ్‌కు 41ఏ నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు
-
Dec 19, 2025 13:20 IST
ఢిల్లీ: కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
40 నిమిషాలు ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు
సంక్షేమ పథకాలతో జగన్‌కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి: సీఎం
మెడికల్ కాలేజీల PPP అంశం మాత్రమే వాళ్లకి దొరికింది: చంద్రబాబు
PPP అంశంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదు
కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూస్తే అదీ విఫలం: చంద్రబాబు
-
Dec 19, 2025 13:20 IST
మేడ్చల్: ఘన్పూర్ మెడిసిటీ ఆస్పత్రిలో దారుణం
మహిళకు అపరేషన్ చేస్తూ మధ్యలో వదిలేసిన వైద్యులు
సరైన పరికరాలు లేవని చేతులెత్తేసిన డాక్టర్లు
మహిళను మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని ఒత్తిడి
ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగిన మహిళ బంధువులు
హెర్నియా సమస్యతో బాధపడుతున్న మహిళ పుష్పలత
-
Dec 19, 2025 12:55 IST
జమ్మూకశ్మీర్: రాజౌరీలో ఉగ్ర కదలికలు
భారీగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు
-
Dec 19, 2025 12:50 IST
సీఎం రేవంత్‌ను కేటీఆర్ విమర్శిస్తే నాలుక కోస్తాం: బీర్ల ఐలయ్య
తండ్రి చాటుగా వచ్చి కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు
సొంతంగా పోటీ చేసి గెలిచే దమ్ము కేటీఆర్‌కు లేదు: బీర్ల ఐలయ్య
కేటీఆర్‌కు దమ్ముంటే నల్లగొండ జిల్లాలో పోటీ చేసి గెలవాలి
BRSలో గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్‌లో చేర్చుకోం: బీర్ల ఐలయ్య
-
Dec 19, 2025 12:49 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
జనవరి 2వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ ACB కోర్టు
-
Dec 19, 2025 12:00 IST
గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేసిన ట్రంప్
బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన వ్యక్తి..
గ్రీన్‌కార్డ్ ద్వారానే అమెరికాలోకి రావడంతో చర్యలు
నేచురలైజ్డ్ అమెరికన్ పౌరసత్వాలను రద్దు చేసే యోచనలో ట్రంప్
-
Dec 19, 2025 11:43 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టడీ మరో వారం పొడిగింపు
ఈనెల 26న కస్టడీ నుంచి ప్రభాకర్‌రావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు అందజేసిన సిట్
తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు
దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించిన సుప్రీంకోర్టు
-
Dec 19, 2025 11:06 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్, మావోయిస్టు మృతి
ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన
-
Dec 19, 2025 11:06 IST
ఢిల్లీ: మ.2గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Dec 19, 2025 11:05 IST
జల్‌జీవన్ మిషన్ అమలుకు ఏపీకి అదనంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
జల్‌జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు
కేంద్ర వాటా నిధులను విడుదల చేయాలని కోరిన సీఎం చంద్రబాబు
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద..
చెరువులు, కాలువల పునరుద్ధరణకు ఏపీ ప్రతిపాదనలు సిద్ధం: చంద్రబాబు
కేంద్రం వాటా నిధులు విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో..
సాగునీటి సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం: చంద్రబాబు
-
Dec 19, 2025 11:05 IST
ఢిల్లీ: కేంద్ర మంత్రి CR పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, వివిధ పథకాలకు నిధులపై చర్చ
ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి: చంద్రబాబు
ఏపీకి నీటి భద్రత అత్యంత కీలక అంశం: చంద్రబాబు
ఏపీ సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని..
కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి
ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత అవసరం: చంద్రబాబు
-
Dec 19, 2025 09:57 IST
ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు
ఈ నెల 24న LVM 03 M6 రాకెట్ ప్రయోగం
అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ శాటిలైట్‌ను పంపనున్న శాస్త్రవేత్తలు
-
Dec 19, 2025 08:29 IST
నంద్యాల: నందికొట్కూరులో చాక్లెట్ల కలకలం
ప్రభుత్వ పాఠశాలలో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత
స్కూల్లో చాక్లెట్లు పంపిణీ చేయాలని ఏడో తరగతి విద్యార్థినికి ప్యాకెట్ ఇచ్చిన అగంతకుడు
పీఈటీ టీచర్‌తో పాటు పలువురు విద్యార్ధినిలకు చాక్లెట్లు పంపిణీ
కనురెప్పలు నల్లగా మారడం, కడుపు నొప్పి, వాంతులు ఇబ్బంది పడుతున్న విద్యార్థినీలు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన, కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Dec 19, 2025 08:27 IST
ఆదిలాబాద్: చలి తీవ్రతతో స్కూళ్ల సమయాల్లో మార్పులు
40 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకోనున్న స్కూళ్లు
ఉ.9:40 నుంచి సా.4:30 వరకు పాఠశాలలు
-
Dec 19, 2025 08:27 IST
వరంగల్: నర్సంపేటలోని గిరిజన పాఠశాల, కళాశాలలో ఘర్షణ
9వ తరగతి విద్యార్థులను చితకబాదిన ఫస్టియర్ స్టూడెంట్స్
ఒకరి పరిస్థితి విషమం, మరో ఇద్దరి పరిస్థితి విషమం