-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana national and International latest breaking news and live updates on 18th Dec 2025 vreddy
-
BREAKING: రెండోరోజు ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటన
ABN , First Publish Date - Dec 18 , 2025 | 08:04 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 18, 2025 12:46 IST
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళ భక్తుల అత్యుత్సాహం
ఆలయం ఎదుట అన్నాడీఎంకే పోస్టర్లు ప్రదర్శిస్తూ వీడియో
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తమిళ భక్తుల వీడియో
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు ప్రదర్శించారని ఆరోపణలు
-
Dec 18, 2025 12:33 IST
హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు
మ.2గంటలకు కోర్టు పేలిపోతుందని మెయిల్ పంపిన ఆగంతకులు
అందరినీ బయటకు పంపిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
-
Dec 18, 2025 12:20 IST
'బిజినెస్ రీ ఫార్మర్ ఆఫ్ ద ఇయర్'గా సీఎం చంద్రబాబుకు అవార్డు
అవార్డు ప్రకటించిన ఎకనామిక్ టైమ్స్ సంస్థ
బిజినెస్ రీ ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏపీకి గర్వకారణం: లోకేష్
దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లిన..
అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ ప్రశంసించింది: లోకేష్
-
Dec 18, 2025 11:46 IST
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన
ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
పాల్గొన్న ఖర్గే, సోనియాగాంధీ, కనిమొళి, పలువురు ఎంపీలు
-
Dec 18, 2025 09:17 IST
ఢిల్లీలో వాలుకాలుష్యం తీవ్రతపై నేడు లోక్‌సభలో చర్చ
విపక్షాల నుంచి చర్చ ప్రారంభించనున్న ప్రియాంక, డింపుల్ యాదవ్
బీజేపీ తరఫున చర్చలో పాల్గొననున్న నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్
-
Dec 18, 2025 08:08 IST
మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ తీర్పు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌పై తీర్పు ఇవ్వనున్న స్పీకర్
దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై పూర్తికాని విచారణ
స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కోరిన కడియం, దానం
-
Dec 18, 2025 08:08 IST
రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
రెవెన్యూ, ఆదాయార్జన శాఖ, శాంతిభద్రతలపై చర్చ
సాయంత్రం ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ సమావేశం
ఏపీలో లా అండ్ ఆర్డర్, ఇతర అంశాలపై చర్చ
-
Dec 18, 2025 08:07 IST
అమరావతి: నేడు లోక్‌భవన్‌కు జగన్, వైసీపీ నేతలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
కోటి సంతకాల ప్రతులను అందజేయనున్న వైసీపీ నేతలు
-
Dec 18, 2025 08:07 IST
హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా
2,246 స్థానాల్లో కాంగ్రెస్, 1,162 స్థానాల్లో BRS మద్దతుదారుల విజయం
246 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు, 491 స్థానాల్లో ఇతరులు గెలుపు
-
Dec 18, 2025 08:06 IST
హైదరాబాద్: ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ
నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి
నేటి నుంచి రవిని విచారించనున్న పోలీసులు
ఒక్కోకేసులో 3 రోజులు విచారించాలన్న నాంపల్లి కోర్టు
-
Dec 18, 2025 08:05 IST
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
మొదటి, రెండో విడతల్లో 56 శాతం స్థానాల్లో కాంగ్రెస్ విజయం
మూడోవిడతలోనూ పైచేయి సాధించిన కాంగ్రెస్
4,159 స్థానాల్లో 2,286 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులు
1,142 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ మద్దతుదారులు
31 జిల్లాల్లోని 12,733 సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు
12,733 సర్పంచ్ పదవుల్లో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
3,502 సర్పంచ్ స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం
చివరివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85.77శాతం పోలింగ్
మొత్తం మూడు విడతలు కలిపి 85.30 శాతం పోలింగ్
12,728 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 దశల్లో ఎన్నికలు
ఈనెల 22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సర్పంచ్‌లు
-
Dec 18, 2025 08:04 IST
రెండోరోజు ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటన
నేడు ఒమన్‌లో పలు అంశాలపై అగ్రనేతలతో మోదీ చర్చలు
ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై ప్రధాని చర్చలు
ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం
ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ