-
-
Home » Mukhyaamshalu » ABN andhrajyothy latest telugu news and breaking news on 10th August 2025 V REDDY
-
BREAKING: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
ABN , First Publish Date - Aug 10 , 2025 | 06:19 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 10, 2025 20:27 IST
శివశంకర్ రాజకీయ విలువలు పాటించారు: మంత్రి జూపల్లి
భవిష్యత్ తరాల కోసం తపనతో పనిచేసిన వ్యక్తి శివశంకర్
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు: జూపల్లి
కేంద్ర పదవుల్లో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు: జూపల్లి
-
Aug 10, 2025 20:27 IST
దేవాదుల నిర్మాణం చేసిందే కాంగ్రెస్: మంత్రి సీతక్క
చెంతనే గోదావరి ఉన్నా ములుగు వాసుల తాగునీటి కష్టాలు తీరడం లేదు: సీతక్క
చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలి: మంత్రి సీతక్క
చిన్న చిన్న చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి: మంత్రి సీతక్క
తుపాకులగూడెం బ్యారేజ్‌లో భూములు కోల్పోయిన...
రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: మంత్రి సీతక్క
-
Aug 10, 2025 20:27 IST
దేవాదుల అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్: మంత్రి ఉత్తమ్
మా హయంలోనే దేవాదుల పనులు పూర్తిచేస్తాం: ఉత్తమ్
కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ చూసి నిర్ఘాంతపోయాం: ఉత్తమ్
కాళేశ్వరం డిజైన్ చేసింది వారే.. కూలింది వారి హయంలోనే
కాళేశ్వరంపై విచారణకు కమిషన్‌ను ఆదేశిస్తే గత పాలకుల అవినీతి, అసమర్ధతే కారణమని తేలింది: ఉత్తమ్
నేను కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ రిపోర్ట్ ఇవ్వలేదు: ఉత్తమ్
ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు: మంత్రి ఉత్తమ్
-
Aug 10, 2025 20:27 IST
దేవాదుల అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్: భట్టి విక్రమార్క
17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు: భట్టి విక్రమార్క
ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్ బిల్లుల వెంటనే మంజూరు: భట్టి
-
Aug 10, 2025 20:27 IST
ములుగు జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన
పర్యటనలో భట్టి, ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి
తుపాకులగూడెంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ సందర్శన
అనంతరం దేవాదుల ప్రాజెక్ట్ పంపుహౌస్ సందర్శన
ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రుల సమీక్ష
-
Aug 10, 2025 18:54 IST
అమరావతి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
దక్షిణ కోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
చెట్ల కింద, శిథిలావస్థ భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచన
బుధవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో వర్షాలు: విపత్తుల నిర్వహణ సంస్థ
-
Aug 10, 2025 18:54 IST
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ED చార్జ్‌షీట్
గురుగ్రామ్ భూ వ్యవహారం కేసులో వాద్రాపై చార్జ్‌షీట
అక్రమ మార్గాల్లో రాబర్ట్ వాద్రాకు రూ.58 కోట్లు: ED
బ్లూబ్రీజ్ సంస్థ నుంచి వాద్రాకు రూ.5 కోట్లు: ED
స్కైలైట్ హాస్పిటాలిటీ నుంచి వాద్రాకు రూ.53 కోట్లు: ED
-
Aug 10, 2025 18:53 IST
'ఆడుదాం ఆంధ్రా' అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి
రేపు ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విజిలెన్స్
'ఆడుదాం ఆంధ్రా'లో దాదాపు రూ.40 కోట్ల నిధులు..
దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించిన విజిలెన్స్
వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరిట వందల కోట్లు ఖర్చు
గతంలో 'ఆడుదాం ఆంధ్రా'కు రూ.125 కోట్లు కేటాయింపు
'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో..
కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లు తేల్చిన విజిలెన్స్
విజేతలుగా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తింపు
2023 డిసెంబర్‌లో ప్రారంభమైన 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు
పబ్లిసిటీ కోసం 'ఆడుదాం ఆంధ్రా' కిట్లపై వైసీపీ స్టిక్కర్లు
క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తింపు
శాప్ నూతన చైర్మన్ బాధ్యతలు తీసుకునేలోపే..
'ఆడుదాం ఆంధ్రా' వివరాలు డిలీట్ చేసినట్లు గుర్తించిన విజిలెన్స్
'ఆడుదాం ఆంధ్రా'లో మాజీమంత్రి రోజా అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు
రోజా సోదరుడి పాత్రపైనా ఏపీ ప్రభుత్వానికి పలువురు ఎమ్మెల్యేల ఫిర్యాదులు
గత అసెంబ్లీ సమావేశాల్లో 'ఆడుదాం ఆంధ్రా' స్కాంపై చర్చ
'ఆడుదాం ఆంధ్రా'లో అవకతవకలపై విచారణ జరపాలని గత అసెంబ్లీ సమావేశాల్లో కోరిన పలువురు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల ఫిర్యాదులతో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
విజిలెన్స్ నివేదిక పరిశీలన తర్వాత ACBకి కేసు అప్పగించే అవకాశం
-
Aug 10, 2025 17:07 IST
హైదరాబాద్‌లో వర్షాలపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం రివ్యూ
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి పొన్నం
వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి: పొన్నం
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: మంత్రి పొన్నం
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి: పొన్నం
-
Aug 10, 2025 17:06 IST
కడప: జడ్పీటీసీ ఉపఎన్నికలకు ముగిసిన ప్రచారం
ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలు
పులివెందులలో 11, ఒంటిమిట్టలో 11 మంది పోటీ
హోరాహోరీగా సాగిన జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం
తెరవెనుక వ్యవహారాలపై నేతల దృష్టి
పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, 10,631 మంది ఓటర్లు
ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, 24,606 ఓటర్లు
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు, ఈనెల 14న ఫలితాలు
జడ్పీటీసీ ఉపఎన్నికలకు 1400 మంది పోలీసులతో భద్రత
-
Aug 10, 2025 16:23 IST
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు
భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు
ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
అమీర్‌పేట్ గంగూబాయి బస్తీ, బుద్ధనగర్ సీఎం రేవంత్ తనిఖీలు
బల్కంపేట్ ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్
బస్తీ వాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీం రేవంత్
డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా..
ఇతర అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్
ముంపు సమస్య రాకుండా యుద్ధప్రాతిపదికన..
చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
-
Aug 10, 2025 15:42 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్‌లో వర్షం
పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వర్షం
హైదరాబాద్‌లో సా.6 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు: GHMC
-
Aug 10, 2025 15:42 IST
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
తెలంగాణలో 8 జిల్లాలకు ఆరెంజ్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు భారీ వర్షసూచన
-
Aug 10, 2025 12:20 IST
బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ
3 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
Aug 10, 2025 12:19 IST
జగిత్యాల: మెట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
సివిల్ సప్లయ్ గోదాములో చెలరేగిన మంటలు
గోదాములో నిల్వ ఉంచిన 9లక్షల గన్ని సంచులు
రెండు పైరింజన్లతో మంటలార్పుతు ఫైర్ సిబ్బంది
గోదాం నుంచి గన్ని సంచులను బయటకు తీస్తున్న యువకులు
-
Aug 10, 2025 11:33 IST
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కీలక వ్యాఖ్యలు
నిర్మాత విశ్వప్రసాద్ నోటీస్ ఎందుకు పంపారో తెలియదు
విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటాం: అనిల్
విశ్వప్రసాద్ షూటింగ్స్‌లో ఇక పాల్గొనబోం: అనిల్
రేపు షూటింగ్స్ పూర్తిగా నలిపివేస్తాం: ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్
షెడ్యూల్ ఉన్నవారితోనూ మాట్లాడి షూటింగ్స్ నిలిపివేస్తాం
ఈరోజు చర్చలు చూసి సంపూర్ణ బంద్ ప్రకటిస్తాం
కడుపు కాలితే షూటింగ్స్‌కు వస్తారని అంటున్నారు
రోజూ కలిసి పనిచేసేవాళ్లం.. ఇలా మాట్లాడటం సరికాదు
చిరంజీవి మాతో టచ్‌లో ఉన్నారు: ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్
ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు: అనిల్
-
Aug 10, 2025 11:10 IST
ఢిల్లీలో కారు బీభత్సం, ఒకరు మృతి
ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Aug 10, 2025 10:53 IST
HCA ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీపై సీఐడీకి ఫిర్యాదు
దల్జీత్‌సింగ్, బసవరాజుపై అంబుడ్స్‌మన్, సీఐడీకి..
ఫిర్యాదు చేసిన HCA మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్
చిట్టి శ్రీధర్ నుంచి సమాచారం సేకరించిన సీఐడీ
అక్రమంగా ఎన్నికైన HCA కార్యవర్గాన్ని రద్దు చేసి..
తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చిట్టి శ్రీధర్ డిమాండ్
-
Aug 10, 2025 10:51 IST
జమ్మూకశ్మీర్: కిష్త్వోర్ జిల్లా దుల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
-
Aug 10, 2025 10:08 IST
నిజామాబాద్: శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద
ఇన్‌ఫ్లో 21వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8,500 క్యూసెక్కులు
పూర్తి నీటిమట్టం 1,091అడుగులు, ప్రస్తుతం 1,078 అడుగులు
పూర్తి నీటినిల్వ 80 టీఎంసీలు, ప్రస్తుతం 41 టీఎంసీలు
-
Aug 10, 2025 08:43 IST
సూర్యాపేట: సీఎంఆర్ఎఫ్‌లో భారీ కుంభకోణం
బాధితుల పేర్లు మార్చి CMRF డబ్బులు నొక్కేసిన ముఠా
గతంలో ఓ మాజీమంత్రి దగ్గర పనిచేసిన పలువురు ముఠాగా ఏర్పాడి..
కోదాడ నియోజకవర్గంలో CMRF డబ్బులు కొట్టేసిన వైనం
2020-21 నుంచి అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం
బాధితుల ఇంటి పేర్లు పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్లకు డబ్బులు బదిలీ
ముఠాకు సహకరించిన గతంలో సచివాలయంలో పనిచేసిన ఉద్యోగి
నడిగూడెం బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
ముఠాలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 10, 2025 08:10 IST
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు
-
Aug 10, 2025 07:50 IST
నేడు బీజేపీలోకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సమక్షంలో చేరనున్న గువ్వల
ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు
-
Aug 10, 2025 07:24 IST
హైదరాబాద్‌లో నిన్న నమోదైన వర్షపాతం వివరాలు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షపాతం
బేగంబజార్‌లో 12.4సెం.మీ. వర్షపాతం నమోదు
చార్మినార్ 11.2, ఖైరతాబాద్ 11.9, నాంపల్లి 10.1సెం.మీ. వర్షపాతం
ఆసిఫ్‌నగర్ 9.7, హయత్‌నగర్ 9.1 సెం.మీ. వర్షపాతం
అమీర్‌పేట్ 7.6, షేక్‌పేట్ 6.9 సెం.మీ. వర్షపాతం నమోదు
-
Aug 10, 2025 06:57 IST
ఏపీలో నేటి నుంచి బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలు
మండల, జిల్లా స్థాయిల్లో తిరంగా యాత్రలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం
-
Aug 10, 2025 06:57 IST
అమరావతి: నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
కమిటీలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం
-
Aug 10, 2025 06:56 IST
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ
వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీపై చర్చ
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగే అవకాశం
-
Aug 10, 2025 06:40 IST
ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు
ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పోలింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ
-
Aug 10, 2025 06:20 IST
ఇవాళ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
13 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షలు
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు
నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం
-
Aug 10, 2025 06:20 IST
కర్ణాటక: నేడు బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి కేఎస్‌ఆర్ రైల్వేస్టేషన్ చేరుకోనున్న ప్రధాని
3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
-
Aug 10, 2025 06:19 IST
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం
మరోసారి తెరుచుకున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు
రెండు గేట్లు ఎత్తి నీటి దిగువకు విడుదల
2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ స్పిల్ వే ద్వారా 16,200 క్యసెక్కుల నీరు విడుదల
గరిష్టస్థాయికి చేరుకున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం
నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం