Share News

Breaking: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - Aug 07 , 2025 | 08:37 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Live News & Update

  • Aug 07, 2025 21:05 IST

    సీఎం చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ లేఖ

    • రెవెన్యూ భూముల ఆరోపణలపై విచారణ చేయాలి: బొత్స

    • మాజీ సర్వీస్‌మెన్‌ భూములు, ఫ్రీహోల్డ్ ల్యాండ్స్‌ వివాదంపై లేఖ

    • మీడియా వార్తల క్లిప్పింగ్స్‌ను లేఖకు జత చేసిన బొత్స

    • భూముల వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలి: బొత్స

  • Aug 07, 2025 20:46 IST

    భారీవర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

    • తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన: సీఎం రేవంత్‌

    • హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన: సీఎం రేవంత్‌

    • GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులు సహా..

    • కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి: సీఎం రేవంత్‌

    • అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్‌

    • లోతట్టుప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి: రేవంత్‌

    • అవసరమైతేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలి: సీఎం రేవంత్‌

    • ట్రాఫిక్‌, విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలి: సీఎం రేవంత్‌

    • అధికారులంతా అందుబాటులో ఉండాలి: సీఎం రేవంత్‌

    • వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలి: రేవంత్‌

    • ఎక్కడా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌

    • GHMC, హైడ్రా, జలమండలి అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్‌

  • Aug 07, 2025 20:14 IST

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

    • అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు

    • జిల్లాల్లో అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌

    • అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశం

    • GHMCతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా అధికారులు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశం

    • లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం సూచన

  • Aug 07, 2025 19:33 IST

    హైదరాబాద్‌: ఈనెల 10న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

    • క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం

    • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధాన చర్చ

    • ఇప్పటివరకు ఫిర్యాదులు, పెండింగ్ అంశాలపై చర్చించనున్న కమిటీ

  • Aug 07, 2025 18:07 IST

    కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి, చర్లపల్లి జైలుకి తేడా ఏముంది?: సీఎం రేవంత్‌

    • ఫామ్‌హౌస్‌లో పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది.. జైలులో ప్రహరీ ఉంటుంది

    • జైలుకు విజిటర్స్‌ వచ్చినట్లే.. ఫామ్‌హౌస్‌కు విజిటర్స్‌ వెళ్లొస్తున్నారు

    • కేసీఆర్‌ను నేనెందుకు జైలులో వేస్తా..

    • ఆయనంతట ఆయనే జైలులో ఉన్నట్లు ఫామ్‌హౌస్‌లో ఉన్నారు: రేవంత్‌

    • కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష: సీఎం రేవంత్‌

    • నేను విద్వేష రాజకీయాలు చేసే వ్యక్తిని కాను: సీఎం రేవంత్‌

    • కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు రెండోసారి గెలిపిస్తారు: సీఎం రేవంత్‌

    • ఇతరుల ఇళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే..

    • అధికారం దానంతట అదే వస్తుంది: సీఎం రేవంత్‌

    • బిహార్‌ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వస్తుంది: సీఎం రేవంత్‌

    • నైతికతపై బీఆర్‌ఎస్‌ నేతలకు మాట్లాడే అర్హత లేదు: సీఎం రేవంత్‌

  • Aug 07, 2025 18:00 IST

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

    • మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండలో వర్షం

    • అత్తాపూర్, లంగర్‌హౌస్, రాజేంద్రనగర్‌లో వర్షం

    • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్..

    • మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, నాంపల్లిలో వర్షం

    • రోడ్లపై నిలిచిన వర్షపునీరు, వాహనదారుల ఇబ్బందులు

  • Aug 07, 2025 17:59 IST

    ఏపీ లిక్కర్‌ కేసులో A8 చాణక్య బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌

    • కేసు దర్యాప్తు దశలో ఉండటంతో బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు

    • మరోసారి బెయిల్ పిటిషన్‌ వేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

  • Aug 07, 2025 17:28 IST

    హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

    • ఫోన్‌ ట్యాపింగ్‌ను జాతీయ అంశంగా పరిగణిస్తున్న BJP

    • హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంశాఖ అధికారులు

    • ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారులతో బండి సంజయ్‌ చర్చ

    • భేటీకి హాజరైన ఏపీ, తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు

    • SIB, సిట్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో చర్చలు

    • గతంలో BRS ప్రభుత్వం బండి సంజయ్‌ ఫోన్‌ను..

    • ఎక్కువసార్లు ట్యాప్‌ చేసినట్లు గుర్తించిన సిట్‌ అధికారులు

    • రేపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణకు హాజరుకానున్న బండి సంజయ్‌

  • Aug 07, 2025 17:23 IST

    హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో 32 మంది మెడికోలు

    • 32 మంది మెడిసిటీ కాలేజ్‌ మెడికోలకు గంజాయి పాజిటివ్‌

    • పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇద్దరు మహిళా మెడికోలు

    • మెడికో అర్ఫాత్‌ఖాన్‌ నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం

    • మెడికోలకు తల్లిదండ్రుల సమక్షంలో ఈగల్‌ టీమ్‌ కౌన్సెలింగ్‌

  • Aug 07, 2025 17:04 IST

    ఢిల్లీ: జేపీ నడ్డా చాంబర్‌లో ఎన్డీఏ నేతల సమావేశం

    • ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను..

    • ప్రధాని మోదీ, జేపీ నడ్డా తీసుకోవాలని NDA నేతల నిర్ణయం

    • మోదీ, నడ్డాకు ఆథరైజేషన్‌ ఇస్తూ NDA పక్ష నేతల తీర్మానం

  • Aug 07, 2025 16:58 IST

    ప్రజలు అసహ్యించుకున్నా.. వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు: లోకేష్

    • గతంలో దళితులపై దాడులు చేశారు: మంత్రి లోకేష్‌

    • తిరుపతిలో దళిత యువకుడిపై దాడిని ఖండించిన లోకేష్‌

    • ఇటువంటి దాడులకు ఏపీలో చోటు లేదు: లోకేష్‌

  • Aug 07, 2025 16:47 IST

    బండి సంజయ్‌తో కేంద్ర హోంశాఖ అధికారుల సమావేశం

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై చర్చ

    • రేపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణకు హాజరుకానున్న బండి సంజయ్‌

  • Aug 07, 2025 16:19 IST

    హైదరాబాద్ : నగర వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షం.

    • మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, అత్తాపూర్, లంగర్ హౌస్, రాజేంద్రనగర్ లో వర్షం.

    • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాసబ్ ట్యాంక్, లకిడికాపూల్, నాంపల్లిలో వర్షం.

    • రోడ్లపై నిలిచిపోయిన వర్షపునీరు.

    • ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారుల ఇక్కట్లు.

  • Aug 07, 2025 16:12 IST

    బీజేపీలో BRS విలీనమంటూ దుష్ప్రచారం చేస్తున్నారు: కేటీఆర్

    • తెలంగాణ ఉన్నంతకాలం BRS ఉంటుంది: కేటీఆర్

    • కాంగ్రెస్‌, బీజేపీకి మూడుచెరువుల నీళ్లు తాగిస్తాం: కేటీఆర్‌

    • BRSను అధికారంలోకి తీసుకొస్తాం: కేటీఆర్‌

    • కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటాం: కేటీఆర్‌

  • Aug 07, 2025 16:09 IST

    భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్.

    • వెల్లడించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్.

    • పర్యటన తేదీలు కూడా దాదాపు ఖరారు అయ్యాయన్న దోబాల్.

    • రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ సెర్గి షోఐగు కు చెప్పిన దోబాల్

  • Aug 07, 2025 15:51 IST

    తురకా కిషోర్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

    • కిషోర్ అరెస్ట్‌లో నిబంధనలు ఉల్లంఘించారన్న హైకోర్టు

    • కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌కు ఆదేశం

  • Aug 07, 2025 15:40 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్

    • కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: రేవంత్‌రెడ్డి

    • కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు: రేవంత్‌రెడ్డి

    • బీసీ-ఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయి: రేవంత్

    • కొత్తగా 10శాతం రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి?: రేవంత్‌రెడ్డి

  • Aug 07, 2025 15:31 IST

    చేనేత కుటుంబాలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

    • చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు

    • చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటన

    • కొత్త పథకంపై జాతీయ చేనేత దినోత్సవంలో ప్రకటించిన చంద్రబాబు

  • Aug 07, 2025 15:21 IST

    కడప: జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్‌ వివేక కుమార్తె సునీత

    • వివేకా హత్య తర్వాత ఆదినారాయణరెడ్డి, సతీష్‌రెడ్డి, బిటెక్ రవి హత్య చేశారని..

    • లెటర్ తీసుకువచ్చి సంతకం పెట్టామన్నారు..నేను పెట్టలేదు: సునీత

    • అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు: వైఎస్‌ సునీత

    • నా మీద, నా భర్త మీద కేసులు పెడుతున్నారు: వైఎస్‌ సునీత

    • బెదిరిస్తే భయపడే పరిస్థితి వుండదు..

    • న్యాయం జరిగే వరకు పోరాడుతూనే వుంటా: వైఎస్‌ సునీత

    • న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీని పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి: వైఎస్‌ సునీత

    • వివేకా హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారు: వైఎస్‌ సునీత

    • వివేకా హత్య నేను, రాజశేఖర్‌రెడ్డి చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నా రు: వైఎస్‌ సునీత

    • టీడీపీ నేతలు చంపారని నమ్మ పలికారు: వైఎస్‌ సునీత

  • Aug 07, 2025 14:13 IST

    ఢిల్లీ: ఎన్నికల సంఘంపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

    • అంచనాలకు మించి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి: రాహుల్‌గాంధీ

    • హర్యానా, ఎంపీలోనూ ఇదే విధంగా ఫలితాలు వచ్చాయి: రాహుల్‌

    • మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయి: రాహుల్‌

    • ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు: రాహుల్‌

    • ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేశాం: రాహుల్‌

    • పరిశోధనలో మా అనుమానాలు నిజమయ్యాయి: రాహుల్‌

    • ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోంది: రాహుల్‌

  • Aug 07, 2025 12:19 IST

    పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం

    • లోకసభ తొలుత 12గం.ల వరకు వాయిదా.

    • అనంతరం మధ్యాహ్నం 2గం.ల వరకు వాయిదా

    • రాజ్యసభ మధ్యాహ్నం 2గం.ల వరకు వాయిదా

  • Aug 07, 2025 11:03 IST

    పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

  • Aug 07, 2025 11:02 IST

    అమెరికా సుంకాలపై స్పందించిన ప్రధాని మోదీ

    • సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాలని తెలుసు

    • రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధం: మోదీ

    • రైతుల ప్రయోజనాలను కాపాడతాం: మోదీ

    • గ్రామీణ ప్రాంతాల రక్షణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

  • Aug 07, 2025 10:53 IST

    జస్టిస్ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

    • నోట్ల కట్టల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ నియామకం సబబేనన్న సుప్రీం

    • జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను..

    • పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు

  • Aug 07, 2025 09:53 IST

    ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం..

    • కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం.

    • రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించిన జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టుపై న్యాయనిపుణులతో కవిత సుదీర్ఘ చర్చలు.

    • దేశంలోని పలు రాష్ట్రాల్లో గతంలో వేసిన జ్యుడీషియల్ కమిషన్లు, ఆయా నివేదికలు, కేసులపై చర్చ.

    • క్యాబినెట్ కలెక్టివ్ డెసిషన్స్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడినే బాధ్యుడిని చేశారంటోన్న కవిత.

    • న్యాయ పోరాటం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయం.

  • Aug 07, 2025 09:50 IST

    ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు షెడ్యూల్ విడుదల.

    • రానున్న మూడు నెలల్లో సెమినార్లు వర్క్ షాపులు నిర్వహణ.

    • వివరాలను విడుదల చేసిన వైస్ ఛాన్స్‌లర్ జిపి రాజశేఖర్.

    • ఈ ఏడాది ఏప్రిల్ లో ఉత్సవాలు ప్రారంభం.

    • ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం.

  • Aug 07, 2025 09:49 IST

    మజ్లిస్ కనుసన్నల్లో కాంగ్రెస్ పని చేస్తోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • ఇది ఇలాగే కొనసాగితే ఒవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు.

    • రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కన్వర్టెడ్ బీసీ అంటున్నారు.

    • మరి మేము సీఎం రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ కాంగ్రెస్ అని అనాలా?

    • ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బిసి అంటారా ? రేపు లంబాడాలను కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?

    • రేవంత్ ఎగిరి ఎగిరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

    • వచ్చేఎన్నికల్లో రేవంత్ ఓటమి ఖాయం.

    • బీసీలకు 34 శాతం నుంచి 27 శాతం రిజర్వేషన్ తగ్గించారు కేసీఆర్.

    • మజ్లిస్ కనుసైగలతో కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు.

    • కాంగ్రెస్ తెచ్చిన బిల్లుతో బీసీలకు కేవలం 32 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి.

    • ఇది బీసీలను మోసం చేయడమే.

    • మత రిజర్వేషన్లతో దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది.

    • బిసిలకు వెన్నుపోటు పొడవడంలో తెలంగాణ రోల్ మోడల్.

    • కేసీఆర్ వల్ల జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిసి సీట్లలో నాన్ బిసిలు గెలిచారు.

    • రాజ్యాంగ సమస్యల వల్లే గవర్నర్ రాష్ట్రపతికి బిసి బిల్లు పంపారు.

    • బీసీలను మోసం చేయడంలో, అక్రమాలు చేయడంలో మేము నిరక్షరాస్యులం.

    • రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు.

    • దీనిపై సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి.

    • ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే నేను బీసీ రిజర్వేషన్ కోసం బాధ్యత తీసుకుంటాను.

    • రాష్ట్రపతి, ప్రధానమంత్రితో మాట్లాడుతాను.

    • గతంలో తెలంగాణ హైకోర్టు మతపరమైన రిజర్వేషన్లను తప్పుపట్టింది.

  • Aug 07, 2025 09:49 IST

    ప్రకాశం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కామెంట్స్..

    • వైసిపి మద్యం విధానం అత్యంత లోప భూయిష్టమైన వ్యవస్థ.

    • తీగ లాగితే డొంక కదిలినట్టు మద్యం కేసులో ఒక్కొక్కరు బయటపడుతున్నారు.

    • మద్యం కేసులో పెద్దపెద్ద తిమింగలాలు బయటపడుతున్నాయి.

    • ప్రత్యక్షంగా పరోక్షంగా కేసులో ఉన్న నిందితులందరికీ కారాగారం తప్పదు.

    • మద్యం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

    • వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రేటు పెంచి మద్యం అమ్మి దోచుకోవడాన్ని ఖండిస్తున్నాం.

    • మద్యం కేసులో నిందితులందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నాం.

    • 11 సీట్లు రావడంతో జగన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.

    • 151 సీట్లు రావడంతో జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించారు.

    • జగన్ అధికారులను బెదిరించడం చట్ట వ్యతిరేకం.

    • తోలుకు వచ్చిన జనంతో జగన్ రాష్ట్రంలో హడావుడి చేస్తున్నాడు.

    • ఒక దళిత కార్యకర్త చనిపోయినా పట్టించుకోకుండా వెళ్లిన తీరు జగన్ అరాచకానికి నిదర్శనం.

    • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

    • నామినేటెడ్ పదవులు రాలేదని టిడిపి, జనసేన, బిజెపి శ్రేణుల్లో అసంతృప్తి ఉంటుంది.

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పని చేసి అద్భుత విజయం సాధిస్తాం.

  • Aug 07, 2025 08:57 IST

    నేడు BRS బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం

    • కరీంనగర్ సభపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం

    • రాఖీ పౌర్ణమి, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో..

    • సభను వాయిదా వేసే యోచనలో BRS అధిష్టానం

  • Aug 07, 2025 08:56 IST

    వరంగల్: ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థినులకు వేధింపులు

    • అసభ్య మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న సైకియాట్రీ వైద్యుడు

    • కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణికి ఫిర్యాదు, విచారణకు ఆదేశం

  • Aug 07, 2025 08:37 IST

    Breaking: నేడు మంగళగిరిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

    • నేడు మంగళగిరిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

    • 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు

    • మూడు పథకాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు

    • నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్న సీఎం

    • మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్

    • జీఎస్టీ మినహాయింపు, త్రిఫ్ట్ నిధులు మంజూరు చేయనున్న చంద్రబాబు

    • వీవర్స్ శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను పరిశీలించనున్న చంద్రబాబు

    • వీవర్స్ శాలలో చేనేత కళాకారులతో సీఎం చంద్రబాబు సంభాషణ

    • లోకేష్ సహకారంతో గతంలో ఏర్పాటైన ‘వీవర్‌ శాల’ సందర్శన

    • చేనేత ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు