-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today latest news across world 24th october 2025 vreddy
-
LIVE UPDATES: కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - Oct 24 , 2025 | 06:56 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 24, 2025 18:07 IST
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియామకం.
జాయింట్ కలెక్టర్ పదవి రద్దు – కొత్త బాధ్యతలు అదనపు కలెక్టర్లకు.
అడవి భూసర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి.
1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో అమలు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలనీ ఆదేశం.
-
Oct 24, 2025 17:49 IST
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు..
కర్నూలు : కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాదం సంఘటనపై కావేరీ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసులు నమోదు.
పోలీసుల అదుపులో డ్రైవర్ శివ నారాయణ.
పరారీలో మరో డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్య.
ముత్యాల లక్ష్మయ్యపై 125/Aతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు.
బస్సులోని 19 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు.
-
Oct 24, 2025 17:46 IST
కర్నూలులో మరో ప్రమాదం..
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయకచర్యలు
బస్సును పక్కకి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా
ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు తీవ్రగాయాలు
-
Oct 24, 2025 17:40 IST
ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే..
-
Oct 24, 2025 17:34 IST
జగన్ ప్రెస్‌మీట్‌లో చెప్పినవన్నీ అబద్ధాలే: మంత్రి సత్యకుమార్
ప్రజలను తప్పుదోవ పట్టించాలని జగన్ కుట్ర: సత్యకుమార్
బాలకృష్ణ తాగి వచ్చారో.. లేదో జగన్ చూశారా?: సత్యకుమార్
బాలకృష్ణ దగ్గరకు వెళ్లి ఆ మాట చెప్పగలరా జగన్?: సత్యకుమార్
జగన్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేనట్లుంది: మంత్రి సత్యకుమార్
-
Oct 24, 2025 17:33 IST
హైదరాబాద్: రేపటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారహోరు
ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యతలు
ప్రచార బాధ్యతను కేటీఆర్, హరీష్‌రావుకు అప్పగించిన కేసీఆర్
రేపటి నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్
ఉపఎన్నిక పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లోనే ఉండనున్న కేసీఆర్
ఉపఎన్నిక ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షించనున్న కేసీఆర్
బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలకు ప్రచార బాధ్యతలు
-
Oct 24, 2025 16:26 IST
కర్నూలు: బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ మంత్రి జూపల్లి
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగింది: మంత్రి జూపల్లి కృష్ణారావు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం
బాధితులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది: మంత్రి జూపల్లి
-
Oct 24, 2025 16:09 IST
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు.
నామినేషన్ విత్ డ్రా చేసుకున్న 23 మంది అభ్యర్థులు.
పూర్తయిన నామినేషన్ ఉపసంహరణ.
ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్.
కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు.
-
Oct 24, 2025 15:44 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
345 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.
96 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.
-
Oct 24, 2025 15:32 IST
కర్నూలు బస్సు ప్రమాద ఘటన బాధాకరం: హోంమంత్రి అనిత
17 మంది పెద్దవాళ్లు… ఇద్దరు చిన్నారులు మృతి బాధాకరం: అనిత
చనిపోయిన వారిలో ఆరుగురు ఏపీ వాసులు: హోంమంత్రి అనిత
ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు
డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకుని కేసునమోదు చేశాం: హోంమంత్రి అనిత
గుర్తించలేని స్థితిలో డెడ్‌బాడీలు, 10 బృందాలతో DNA టెస్ట్‌లు
అన్ని కోణాల్లో బస్సు ప్రమాద ఘటనను విచారిస్తున్నాం: హోంమంత్రి
బస్సు ప్రమాద ఘటనలపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి...
ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తాం: హోంమంత్రి అనిత
-
Oct 24, 2025 13:13 IST
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన పంజాబ్ మంత్రులు
సీఎంను కలిసిన మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మీత్‌సింగ్
పంజాబ్‌లో జరిగే 350వ 'గురుపూరబ్' ఉత్సవానికి..
పంజాబ్ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
-
Oct 24, 2025 12:34 IST
కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం: మంత్రి పొన్నం
-
Oct 24, 2025 12:25 IST
కర్నూల్ బస్సు ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుభూతి
-
Oct 24, 2025 12:06 IST
articleText
-
Oct 24, 2025 12:05 IST
అగ్నిప్రమాదం ఘటన తీవ్రంగా కలచివేసింది: పవన్ కళ్యాణ్
-
Oct 24, 2025 12:04 IST
కర్నూల్ బస్సు ప్రమాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్
-
Oct 24, 2025 12:02 IST
విజయవాడ: ముగిసిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల రిమాండ్
నిందితులను ACB కోర్టులో హాజరుపర్చిన సిట్ అధికారులు
నిందితుల బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం తీర్పు ఇవ్వనున్న ACB కోర్టు
-
Oct 24, 2025 12:01 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో అగ్నిప్రమాదం
హార్ట్ కప్ కేఫ్ పబ్‌లో చెలరేగిన మంటలు
ఇటీవల మూసివేసిన హార్ట్ కప్ కేఫ్ పబ్
పబ్‌లో మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
-
Oct 24, 2025 12:01 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీలో రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
DCC అధ్యక్షుల నియామకంపై కీలక చర్చ
రేపు మ.3 గంటలకు AICC ఆఫీస్‌లో TPCC నేతల భేటీ
ఈ నెలాఖరుకు DCC అధ్యక్షులను ప్రకటించనున్న AICC
-
Oct 24, 2025 12:00 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్
రేపటినుంచి జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేయాలని ఆదేశం
ప్రతీ డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యత
ప్రతి మంత్రికి సహాయకులుగా నలుగురు ఎమ్మెల్యేలు,..
ఇద్దరు ఎంపీలు, 6 మంది కార్పొరేషన్ చైర్మన్లు
ప్రతి బూత్ బాధ్యతను జిల్లా స్థాయి నేతకు అప్పగించిన TPCC చీఫ్
ప్రతిరోజూ తాము చేసిన ప్రచార కార్యక్రమాలను..
గాంధీ భవన్ వార్ రూమ్‌కు పంపాలని ఆదేశం
-
Oct 24, 2025 11:38 IST
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసుపై కోర్టు విచారణ పూర్తి
ఐదుగురు ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని కోర్టు స్పష్టం
దోషులకు ఈనెల 27న శిక్ష ఖరారు చేయనున్న ప్రత్యేక మహిళా కోర్టు
ఐదుగురిని అదుపులోకి తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులకు ఆదేశం
-
Oct 24, 2025 11:03 IST
కర్నూలు బస్సు ప్రమాదం కలచివేసింది: సీఎం సిద్దరామయ్య
బాధిత కుటుంబాలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రగాఢ సానుభూతి
-
Oct 24, 2025 11:01 IST
ఢిల్లీ: కర్నూలు ప్రమాద ఘటనపై రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రాహుల్‌గాంధీ సంతాపం
తరచూ ప్రమాదాలతో ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి: రాహుల్
ప్రమాదాలకు బాధ్యులెవరో వారిని జవాబుదారీ చేయాలి: రాహుల్‌గాంధీ
-
Oct 24, 2025 10:36 IST
UPDATE: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
ప్రమాదంలో బైకర్ శివశంకర్(కర్నూలు) కూడా మృతి
ప్రమాద సమయంలో బస్సులో 43 మంది
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 23 మంది
11 మంది ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రుల్లో చికిత్స
-
Oct 24, 2025 10:35 IST
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో చికిత్స పొందుతున్న ఆరుగురు డిశ్చార్జ్
మరో ఐదుగురికి కొనసాగుతున్న చికిత్స
డిశ్చార్జ్ అయినవారు నవీన్‌కుమార్, సత్యనారాయణ, సూర్య, హారిక, శ్రీహర్ష
-
Oct 24, 2025 10:35 IST
కర్నూలు: బస్సు నుంచి 20 మృతదేహాలను వెలికితీసిన ఫోరెన్సిక్ టీం
మృతదేహాలకు పంచనామా చేస్తున్న ఫోరెన్సిక్ బృందం
-
Oct 24, 2025 10:31 IST
సంగారెడ్డి: కర్నూలు బస్సు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఇద్దరు మృతి
మృతులు ఫీల్‌మన్ బేబీ (65), ఆమె కుమారుడు కిశోర్‌కుమార్ (43)
పటాన్‌చెరులో తమ బంధువుల ఇంటికి వచ్చిన మృతులు
-
Oct 24, 2025 10:30 IST
కర్నూలులో ప్రమాదానికి గురైన వి కావేరి బస్సుపై 16 చలాన్లు పెండింగ్
-
Oct 24, 2025 10:13 IST
ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది: ఏపీ రవాణా శాఖ
బస్సుకు 31-03-2027 వరకు ఫిట్‌నెస్, 20-04-2026 వరకు బీమా
బస్సుకు 2030 ఏప్రిల్ 30వరకు టూరిస్ట్ పర్మిట్: ఏపీ రవాణా శాఖ
బైక్‌ను బలంగా ఢీకొనడంవల్లే బస్సులో మంటలు: ఏపీ రవాణా శాఖ
ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం: ఏపీ రవాణా శాఖ
-
Oct 24, 2025 10:13 IST
ప్రమాదానికి గురైన బస్సు DD01N9490తో రిజిస్టర్ అయింది: ఏపీ రవాణా శాఖ
వి కావేరీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది: ఏపీ రవాణా శాఖ
వి కావేరీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు: ఏపీ రవాణా శాఖ
2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు: ఏపీ రవాణా శాఖ
2030 ఏప్రిల్ 30వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది: ఏపీ రవాణా శాఖ
-
Oct 24, 2025 09:51 IST
ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు
హత్య నేరం కింద కేసులు పెడతాం.. లోపలేస్తాం: మంత్రి పొన్నం
స్పీడ్ నిబంధనలు పాటించాలి.. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారు: పొన్నం
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదు
ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది: పొన్నం
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తాం
బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటాం: మంత్రి పొన్నం
-
Oct 24, 2025 09:49 IST
కర్నూలు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్‌లైన్ ఏర్పాటు
హెల్ప్‌లైన్ పర్యవేక్షణకు ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ నియామకం
ఎం. శ్రీరామచంద్ర, సహాయ కార్యదర్శి నెం.99129 19545
ఇ. చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్ నెం.94408 54433
బాధితులకు సహాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
Oct 24, 2025 09:43 IST
కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్.
బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసింది.
బస్సు ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డికే శివకుమార్.
బాధితులకు అండగా నిలుస్తామన్న డికే శివకుమార్.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: డికే శివకుమార్.
-
Oct 24, 2025 09:43 IST
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
కర్నూలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెం.08518-277305
కర్నూలు ప్రభుత్వాపత్రి కంట్రోల్ రూమ్ నెం.91211 01059
ఘటనా స్థలి దగ్గర కంట్రోల్ రూమ్ నెం.91211 01061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నెం.91211 01075
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నెంబర్లు: 94946 09814, 90529 51010
-
Oct 24, 2025 09:29 IST
కర్నూలు: ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ టీం
మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్న అధికారుల బృందం
DNA పరీక్ష నిర్వహించి బంధువులకు మృతదేహాలు అప్పగించనున్న అధికారులు
ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో చర్చిస్తున్న ఫోరెన్సిక్ బృందం
-
Oct 24, 2025 09:28 IST
కర్నూలులో బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో సీఎం రేవంత్ భేటీ
తక్షణమే ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం
తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచన
జెన్‌కో సీఎండీ హరీష్ తక్షణమే ప్రమాదస్థలికి వెళ్లాలని సీఎం ఆదేశం
గద్వాల కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలిలో అందుబాటులో ఉండాలని ఆదేశం
మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు వైద్యసాయం..
అందించే చర్యలు ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
Oct 24, 2025 09:28 IST
కర్నూలు బస్సు ప్రమాదం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి: కేసీఆర్
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: కేసీఆర్
మృతుల కుటుంబాలకు BRS అధినేత కేసీఆర్ ప్రగాఢ సానుభూతి
-
Oct 24, 2025 09:27 IST
అమరావతి: కాసేపట్లో కర్నూలుకు హోం మంత్రి అనిత, డీజీపీ
గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న హోం మంత్రి అనిత
సహాయ చర్యలు పర్యవేక్షించాలని దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు ఆదేశం
-
Oct 24, 2025 09:27 IST
నవీముంబై: ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లోకి భారత్ జట్టు
న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో భారత్ ఉమెన్స్ టీం విక్టరీ
స్కోర్లు: భారత్ ఉమెన్: 340/3, న్యూజిలాండ్ 271/8
ఈ నెల 29, 30న ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్ సెమీస్
-
Oct 24, 2025 09:27 IST
H1-Bవీసా.. అమెరికన్ల వేతనాలు తగ్గిస్తున్నాయి: వైట్‌హౌస్
H1-Bవీసా వ్యవస్థల్లో మోసాలు: వైట్‌హౌస్ ప్రతినిధి కరోలినా
H1-Bవీసా పిటిషన్లపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం: వైట్‌హౌస్
-
Oct 24, 2025 09:26 IST
రష్యాకు ట్రంప్ మరో హెచ్చరిక
6 నెలల్లో ఆంక్షల తీవ్రత ఏంటో తెలుస్తుంది: ట్రంప్
అమెరికా ఆంక్షల ఒత్తిడికి తగ్గేదిలేదని స్పష్టంచేసిన పుతిన్
-
Oct 24, 2025 08:57 IST
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం: ప్రధాని మోదీ
-
Oct 24, 2025 08:38 IST
ప్రమాదస్థలానికి ఎఫ్ఎస్ఎల్ టీమ్ చేరుకుంది: ఎస్పీ విక్రాంత్
బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టింది: ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఎమర్జెన్సీ డోర్స్ పగలగొట్టి కొందరు బయటపడ్డారు: ఎస్పీ
కొంతమంది బయటపడ్డా.. మరికొంత మంది రాలేకపోయారు
మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి: ఎస్పీ
రెండో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేదు: ఎస్పీ
-
Oct 24, 2025 08:29 IST
బస్సు ప్రమాద ఘటనాస్థలిలో సహాయ చర్యలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం: మంత్రి సత్యకుమార్
మృతులను గుర్తించేందుకు FSL బృందం DNA నమూనాలు సేకరిస్తోంది
చాలా మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉన్నాయి: మంత్రి సత్యకుమార్
స్పాట్‌లోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు: సత్యకుమార్
ఫోరెన్సిక్ బృందాలను కూడా స్పాట్‌కు పంపాం: మంత్రి సత్యకుమార్
-
Oct 24, 2025 08:29 IST
ప్రయాణికుల్లో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు: DIG కోయ ప్రవీణ్
బస్సులో నుంచి 11 మృతదేహాలు వెలికితీశాం: DIG కోయ ప్రవీణ్
బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉన్నాడు: DIG కోయ ప్రవీణ్
మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం : DIG కోయ ప్రవీణ్
బైక్ ఢీకొని మంటలు చెలరేగడంతోనే ప్రమాదం: కోయ ప్రవీణ్
-
Oct 24, 2025 07:49 IST
నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని బంద్‌కు పిలుపు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హైఅలర్ట్
మల్లోజుల, తక్కెళ్లపల్లిపై ప్రతీకారంతో మావోయిస్టులు
మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో భారీగా కూంబింగ్
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జల్లెడపడుతున్న భద్రతా బలగాలు
-
Oct 24, 2025 07:48 IST
కర్నూలు బస్సు ప్రమాదస్థలిని పరిశీలించిన కలెక్టర్ సిరి
బైక్ బైస్సు కిందకు వెళ్లడంతో డోర్ తెరుచుకునే కేబుల్ తెగిపోయింది
బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికితీశాం: కలెక్టర్
ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు: కలెక్టర్
-
Oct 24, 2025 07:48 IST
బస్సు ప్రయాణికుల జాబితా: పిల్వామిన్ బేబి(64), అశ్విన్‌రెడ్డి(36), జి.ధాత్రి(27), కీర్తి(30),..
పంకజ్(28), యువన్ శంకర్‌రాజా(22), తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు(48)
గుణ సాయి(33), గణేష్(30), జైవంత్ కుష్వాహా(27), కిషోర్ కుమార్(41)
రమేష్(30)తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు
అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్(24), సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం,..
ప్రశాంత్, ఆర్గ బందోపాథ్యాయ్, నవీన్‌కుమార్, గుండా వేణు, శ్రీహర్ష, శివ, గ్లోరియా,..
మేఘనాథ్, రామారెడ్డి, అమృత్‌కుమార్, చందన, సూర్య, ఉమాపతి, చరిత్, హారిక, వేణుగోపాల్‌రెడ్డి
-
Oct 24, 2025 07:09 IST
ప్రమాదస్థలానికి ఎఫ్ఎస్ఎల్ టీమ్ చేరుకుంది: ఎస్పీ విక్రాంత్
బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టింది: ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఎమర్జెన్సీ డోర్స్ పగలగొట్టి కొందరు బయటపడ్డారు: ఎస్పీ
కొంతమంది బయటపడ్డా.. మరికొంత మంది రాలేకపోయారు
మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి: ఎస్పీ
రెండో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేదు: ఎస్పీ
-
Oct 24, 2025 07:08 IST
ప్రమాదం నుంచి బయటపడ్డ నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా,..
రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి,..
వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి
-
Oct 24, 2025 07:01 IST
UPDATE: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
20 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం
బస్సును బైకు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం
20 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మరో 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్న అధికారులు
ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD09 N9490
ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు
కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
-
Oct 24, 2025 07:00 IST
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం
ఉన్నతస్థాయి యంత్రాంగం ఘటన స్థలానికి వెళ్లి సహాయచర్యల్లో పాల్గొనాలని ఆదేశం
-
Oct 24, 2025 06:59 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యాయస్థానం అనుమతి లేకుండా మైనర్ల ఆస్తుల విక్రయాలు చెల్లవు
-
Oct 24, 2025 06:58 IST
ఢిల్లీ: బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక మార్పులు
నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు
-
Oct 24, 2025 06:56 IST
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
పూర్తిగా దగ్ధమైన బస్సు, 25 మందికి పైగా మృతి?
బస్సును బైకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ప్రైవేట్ బస్సు ముందు భాగంలో చేలరేగిన మంటలు
కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన
అత్యవసర ద్వారం పగలగొట్టి బయటపడిన 10 మందికి పైగా ప్రయాణికులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది క్షతగాత్రులు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
ఘటన స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్, కర్నూలులో భారీ వర్షం