-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today latest news across globe20 october 2025 vreddy
-
BREAKING: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన
ABN , First Publish Date - Oct 20 , 2025 | 06:54 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 20, 2025 20:14 IST
వరంగల్‌లో దీపావళి సందడి
ఊరువాడ టపాసులు కాల్చి సంబరాలు
ఓరుగల్లు గల్లీగల్లీలో బాణాసంచా మోత
టపాసులు కాల్చి ప్రజల సంబరాలు
-
Oct 20, 2025 17:07 IST
అనకాపల్లి: కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజుపై గిరిజనుల దాడి
రోలుగుంట మం. పెద్దపేటలో గిరిజన రైతుల దాడిలో నూకరాజు మృతి
నూకరాజు, గిరిజనుల మధ్య పదేళ్లుగా 10 ఎకరాల భూవివాదం
-
Oct 20, 2025 15:09 IST
జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫిర్యాదు
కాంగ్రెస్ నేతలు చెబితే పనులు చేయరా? అంటూ మండిపాటు
పార్టీ ఫిరాయించినోళ్లకే ప్రాధాన్యం ఇస్తారా?: జీవన్‌రెడ్డి
-
Oct 20, 2025 13:10 IST
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్‌కౌంటర్
పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి
కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు రియాజ్ యత్నం
పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి
రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
నిన్న రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్‌కు గాయాలు
కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన రియాజ్
-
Oct 20, 2025 12:47 IST
నిజామాబాద్: కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు మృతి
నిన్న రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్‌కు గాయాలు
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిందితుడు రియాజ్ మృతి
-
Oct 20, 2025 12:11 IST
యెమెన్ తీరంలో భారీ అగ్నిప్రమాదం, 23 మందిని కాపాడిన దళాలు
ఈ నెల 18న ఒమన్ నుంచి కామెరూన్ బయల్దేరిన ఓడ
అడెన్ తీరం దగ్గర LPG ఓడలో చెలరేగిన మంటలు
ఓడలోని సిబ్బందిని రక్షించిన ఈయూ నేషనల్ ఫోర్స్
-
Oct 20, 2025 11:52 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన ఆర్జేడీ
143 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన ఆర్జేడీ
రాగోపూర్ అసెంబ్లీ బరిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
-
Oct 20, 2025 11:51 IST
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల
ఒక డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
పెంచిన 3.64 శాతం డీఏ జనవరి 1 నుంచి అమలు
కొత్త డీఏతో పాటు బకాయిలు కూడా త్వరలో విడుదల
-
Oct 20, 2025 11:50 IST
చెన్నైలో నిన్నటినుంచి భారీ వర్షం
చెన్నైలో నీటమునిగిన పలు లోతట్టు ప్రాంతాలు
దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు
చెన్నై, పుదుచ్చేరి, తంజావూరులో అతి భారీ వర్షాలు
24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం
వాయుగుండంగా మారి చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం
ఈ నెల 23న తమిళనాడులో అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
Oct 20, 2025 10:25 IST
మంచిర్యాల: నస్పూర్ సమీపంలో బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసిన భర్త
తీవ్రగాయాలతో అక్కడికక్కడే భార్య రజిత మృతి
నిందితుడు కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Oct 20, 2025 10:15 IST
సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యం
విధుశేఖర స్వామి పూజలతో భక్తులకు దర్శనాలు నిలిపివేత
ముందస్తు సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం
కనీసం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతపై భక్తులు మండిపాటు
-
Oct 20, 2025 10:04 IST
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
స్వదేశీ వస్తువులను కొనాలంటూ ప్రధాని పిలుపు
భారతీయుల హార్డ్‌వర్క్, క్రియేటివిటి, ఆవిష్కరణలకు..
తోడ్పాటును అందించాలని కోరిన ప్రధాని మోదీ
-
Oct 20, 2025 09:43 IST
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు
బొగ్గు గనిపై దాడి చేసిన రష్యా దళాలు
బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 192 మంది కార్మికులు
కార్మికులను సురక్షితంగా రక్షించిన ఉక్రెయిన్
-
Oct 20, 2025 09:42 IST
భారత్ వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య గణాంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్థ భాగంలో..
24 దేశాలకు ఎగుమతులు పెరిగాయి: కేంద్ర వాణిజ్య శాఖ
-
Oct 20, 2025 09:42 IST
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
కావలిలో పార్టీ బలోపేతానికి కృషిచేసిన సుబ్బానాయుడు: సీఎం చంద్రబాబు
-
Oct 20, 2025 09:21 IST
హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై జారిన విమానం
ఎయిర్‌పోర్ట్ పక్కనున్న సముద్రంలో పడిన కార్గో విమానం
విమానం ఢీకొని గ్రౌండ్ వాహనంలో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి
-
Oct 20, 2025 08:36 IST
ఆస్ట్రేలియాలో రెండో రోజు ప్రారంభమైన మంత్రి నారా లోకేష్ పర్యటన
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించిన మంత్రి లోకేష్
ఏపీ వర్సిటీలతో కలసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ లు ప్రారంభించండి
స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి
రెన్యువబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలసి పనిచేయండి
అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో భేటీ
-
Oct 20, 2025 08:31 IST
జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం
రెండో భార్య ఇంట్లో నుంచి తన తండ్రి కనిపించడం లేదని మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు
ఇద్దరు భార్యల తర్వాత మరో మహిళతో హనుమంతు వివాహేతర సంబంధం
నెలరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో హనుమంతు ఇంటి దగ్గర మహిళ హల్‌చల్
అప్పటి నుంచి అదృశ్యమైన హనుమంతు
రెండ్రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు మొదటి భార్య కుమారుడు దత్తు ఫిర్యాదు
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 20, 2025 07:41 IST
నెల్లూరు: ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి
బ్రెయిన్ స్ట్రోక్‌తో గత 10రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుబ్బానాయుడు మృతి
టీడీపీలో సీనియర్ నేతగా జిల్లాలో గుర్తింపు పొందిన మాలేపాటి సుబ్బానాయుడు
-
Oct 20, 2025 06:57 IST
భారత్‌తో వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ప్రణాళిక ప్రకటించిన బ్రెజిల్
బ్రెజిల్ వైస్‌ప్రెసిడెంట్ భారత్ టూర్ తర్వాత ఉపాధ్యక్షుడు ఎక్స్‌లో పోస్టు
వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలు డిసిల్వా
భారత్‌కు అసాధారణ మార్కెట్ ఉంది: బ్రెజిల్ అధ్యక్షుడు
రాజకీయ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో భారత్‌తో భాగస్వాములు అవుతాం: బ్రెజిల్
-
Oct 20, 2025 06:56 IST
తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషీ పేరుతో భారీ మోసం
మంత్రి పేషీని అడ్డాగా చేసుకుని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ రూ.1.77 కోట్లు తీసుకుని మోసం
మియాపూర్ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేసిన వైనం
మంత్రి OSD లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలతో మోసం
బాధితుడి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు, విచారణ CCSకు బదిలీ
-
Oct 20, 2025 06:56 IST
నవంబర్ 3 నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల బంద్
ఈ నెల 22న సర్కార్‌కు నోటీసు ఇవ్వాలని ప్రైవేట్ కాలేజీలు నిర్ణయం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంద్
తెలంగాణలో ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీలు బంద్
-
Oct 20, 2025 06:56 IST
అయోధ్యలో కన్నుల పండువగా దీపోత్సవం
అయోధ్య దీపోత్సవానికి 2 ప్రపంచ రికార్డులు
సరయూ నదీ తీరంలో 26.17 లక్షల దీపాలతో రికార్డు కైవసం
ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహణతో మరో రికార్డు
అయోధ్యలో నేడు కూడా దీపోత్సవ వేడుక
-
Oct 20, 2025 06:55 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు
-
Oct 20, 2025 06:55 IST
ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్: నేడు శ్రీలంక Vs బంగ్లాదేశ్
మ.3 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్
-
Oct 20, 2025 06:54 IST
రైల్వే శాఖపై ఫేక్ వీడియోస్‌తో ప్రచారం చేస్తే కఠిన చర్యలు: అశ్విని వైష్ణవ్
-
Oct 20, 2025 06:54 IST
మహారాష్ట్ర, కర్ణాటకకు వరద సాయం విడుదల చేసిన కేంద్రం
సాయం కింద రూ.1,950 కోట్ల విడుదలకు అమిత్ షా ఆమోదం
-
Oct 20, 2025 06:54 IST
వచ్చే వారంలో కౌలాలంపూర్ వెళ్లనున్న ప్రధాని మోదీ
ఈ నెల 26 నుంచి 28 వరకు మలేషియాలో ప్రధాని టూర్
ఏషియన్ దేశాల భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ
ఏషియన్ దేశాల భేటీకి హాజరుకానున్న ట్రంప్, జిన్‌పింగ్
ఏషియన్ సమిట్‌కు హాజరుకానున్న క్వాడ్, బ్రిక్స్ దేశాలు