-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across the GLOBE 6Th oct 2025 vreddy
-
BREAKING: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
ABN , First Publish Date - Oct 06 , 2025 | 06:32 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 06, 2025 20:24 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ బీసీకి వచ్చే అవకాశం: మహేష్‌గౌడ్
రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేస్తాం: మహేష్‌గౌడ్
రేపు సీఎం రేవంత్‌తో చర్చించాక AICCకి అభ్యర్థుల జాబితా
ఇంచార్జి మంత్రుల నివేదిక ఆధారంగా అభ్యర్థి ఎంపిక: మహేష్‌గౌడ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం: మహేష్‌గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కడతారు
డిసెంబర్ ఆఖరు నాటికి పార్టీ పదవులన్నీ పూర్తి చేస్తాం: మహేష్‌గౌడ్
త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Oct 06, 2025 20:24 IST
వేలానికి అనూహ్య స్పందన
హైదరాబాద్: TGIIC భూముల వేలానికి అనూహ్య స్పందన
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర వేలంలో రికార్డుస్థాయిలో ఎకరం రూ.177 కోట్లు
7.67 ఎకరాలను రూ.1,356 కోట్లకు దక్కించుకున్న MSN రియల్ ఎస్టేట్ సంస్థ
-
Oct 06, 2025 20:24 IST
అమరావతి: నకిలీ మద్యం వ్యవహారంలో కొత్త కోణం
సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన జనార్దన్
మొలకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం అంశాలను..
సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా: జనార్దన్
నా పేరు మొదటి ముద్దాయిగా చేర్చినట్లు తెలుసుకున్నా: జనార్దన్
ఈ కేసుతో తంబళ్లపల్లె టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదు: జనార్దన్
కేవలం లబ్ధి కోసమే ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు: జనార్దన్
అనారోగ్య కారణాలతో నేను విదేశాల్లో చికిత్స పొందుతున్నా: జనార్దన్
-
Oct 06, 2025 16:56 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎప్పుడంటే..
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్, 14న కౌంటింగ్
హైదరాబాద్‌లో అమల్లోకి ఎన్నికల కోడ్
ఈనెల 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్
నామినేషన్లకు ఈనెల 13 నుంచి 21 వరకు గడువు, 22న పరిశీలన
-
Oct 06, 2025 16:23 IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాం: సీఈసీ
ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించాం: సీఈసీ
బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు: సీఈసీ
ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం: సీఈసీ
నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా..
ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చు: సీఈసీ
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: సీఈసీ
ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నాం: సీఈసీ
బిహార్ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు: సీఈసీ
ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్: సీఈసీ
85 ఏళ్ల పైబడిన ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం: సీఈసీ
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు: సీఈసీ
బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు తీసుకొస్తున్నాం
ఈ సంస్కరణలను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలుచేస్తాం: సీఈసీ
-
Oct 06, 2025 15:28 IST
కాకినాడ: పిఠాపురం మహారాజు వారసుడు రామరత్నారావు ఆవేదన
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ..
కన్నీటిపర్యంతమైన పిఠాపురం మహారాజా వారసుడు రామరత్నారావు
2 ఎకరాలు లీజుకు అనిచెప్పి నాలుగు ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణ
మూడేళ్ల లీజును 30 ఏళ్లకు ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారని ఆరోపణ
పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన
-
Oct 06, 2025 15:28 IST
విశాఖ చేరుకున్న గ్యాస్ క్యారియర్ నౌక
శివాలిక్ నౌకకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి సర్బానంద
తొలి ప్రయాణంలో గల్ఫ్ నుంచి LPG తీసుకొచ్చిన నౌక
సముద్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయనున్న శివాలిక్
-
Oct 06, 2025 15:28 IST
తిరుపతి ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి బాంబు బెదిరింపు
వర్సిటీ దగ్గర సీఎం చంద్రబాబు పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాటు
హెలిప్యాడ్ దగ్గర ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్
హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్, పోలీసుల తనిఖీలు
-
Oct 06, 2025 15:26 IST
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్
మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచికు నోబెల్
రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్
-
Oct 06, 2025 13:06 IST
సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నం
సనాతన ధర్మాన్ని అమానించారంటూ బూటుతో దాడికి లాయర్ యత్నం
అడ్డుకున్న తోటి లాయర్లు
ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న సీజేఐ గవాయ్
-
Oct 06, 2025 13:05 IST
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారు?
తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా?
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారించలేమన్న ధర్మాసనం
పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం
-
Oct 06, 2025 12:47 IST
టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన
రైతులకు ఎటువంటి నష్టం ఉండదని అచ్చెన్నాయుడు హామీ
రైతులకు ప్రభుత్వం అండగాఉంటుంది: అచెన్నాయుడు
-
Oct 06, 2025 12:47 IST
గుంటూరు: నకిలీ మద్యం తయారీతో తెనాలికి లింకులు
ఏ12 కొడాలి శ్రీనివాసరావు కోసం తెనాలిలో గాలింపు
కొన్నేళ్లుగా తెనాలి ఐతానగర్‌లో నివాసముంటున్న కొడాలి శ్రీనివాసరావు
వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు
-
Oct 06, 2025 12:31 IST
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్
జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఎదుట విచారణ
-
Oct 06, 2025 12:30 IST
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు
బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు
పిటిషన్లు దాఖలు చేసిన వీహెచ్, R.కృష్ణయ్య, రిటైర్డ్ IAS చిరంజీవులు
-
Oct 06, 2025 12:30 IST
మావోయిస్టు పార్టీ క్యాండర్‌కు మల్లోజుల వేణుగోపాల్ లేఖ
సాయుధ పోరాట విరమణపై క్యాడర్‌కు మావోయిస్టు నేత మల్లోజుల లేఖ
పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు మల్లోజుల వేణు కౌంటర్
అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలి,..
పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం: మల్లోజుల
పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చూశాం: మల్లోజుల
ఉద్యమం ఓటమిపాలు కాకుండా కాపాడలేకపోయాం: మల్లోజుల
వర్తమాన ఫాసిస్టు పరిస్థితుల్లో మన లక్ష్యాన్ని అందుకోలేము
పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలి, అనవసర త్యాగాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి
సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: మల్లోజుల వేణుగోపాల్
-
Oct 06, 2025 12:22 IST
బీసీ రిజర్వేషన్‌లపై దాఖలైన పిటిషన్‌లపై ఇంప్లీడ్ పిటిషన్‌లు
ఇంప్లీడ్ పిటిషన్‌లు దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య, చిరంజీవులు
-
Oct 06, 2025 11:58 IST
లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టుకు నిందితులు
న్యాయాధికారి ఎదుట హాజరుపరిచిన సిట్
నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్
-
Oct 06, 2025 11:58 IST
సంక్షేమ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
హాజరైన మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూఖ్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులు
సూపర్ సిక్స్ సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమానికి అందుతున్న పథకాలపై చర్చ
వెనుకబడిన వర్గాల సాధికారిత లక్ష్యంగా శాఖలు పనిచేయాలని సీఎం దిశా నిర్దేశం.
-
Oct 06, 2025 11:44 IST
హైదరాబాద్: LB నగర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
పండగ ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటున్న ప్రజలు
ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు పెరిగిన రద్దీ
-
Oct 06, 2025 11:06 IST
ఈ రోజు మధ్యాహ్నం బెంగుళూరు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ని పరామర్శించనున్న సీఎం రేవంత్
అనారోగ్యంతో ఉన్న ఖర్గే
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఖర్గేతో చర్చించనున్న సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం, కోర్టుల విచారణ అంశాన్ని ఖర్గేకి వివరించనున్న రేవంత్
-
Oct 06, 2025 10:35 IST
కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
అమెరికన్ ఫార్మా కంపెనీ 'ఎలీ లిల్లీ' ప్రతినిధులతో భేటీ
-
Oct 06, 2025 10:29 IST
నల్లగొండ: మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయిన ఫలక్‌నుమా
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మరో ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారుల ప్రయత్నాలు
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
-
Oct 06, 2025 10:20 IST
హైదరాబాద్: జంట జలాశయాలకు మరోసారి వరద
ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు, హిమాయత్‌సాగర్ 3 గేట్లు ఎత్తివేత
జంట జలాశయాల నుంచి మూసీలోకి భారీగా వరద
గ్రేటర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన GHMC
-
Oct 06, 2025 10:15 IST
రేపు పార్టీ నాయకులతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం
-
Oct 06, 2025 10:09 IST
విజయవాడలోని ఎనికేపాడులో అగ్నిప్రమాదం
ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో మంటలు
రూ.5 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా
-
Oct 06, 2025 10:09 IST
నేడు ముంబైలో మంత్రి లోకేష్ పర్యటన
ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల లక్ష్యంగా లోకేష్ పర్యటన
30వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొననున్న లోకేష్
విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు..
పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న మంత్రి లోకేష్
-
Oct 06, 2025 09:56 IST
ఢిల్లీ: సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
నవంబర్ 22తో ముగియనున్న బిహార్ అసెంబ్లీ గడువు
-
Oct 06, 2025 09:32 IST
యాదాద్రి: విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ దగ్గర భారీగా నిలిచిన వాహనాలు
చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణంతో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
-
Oct 06, 2025 09:32 IST
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు
9 ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసిన రష్యా, పలువురు మృతి
-
Oct 06, 2025 09:11 IST
నేడు కర్ణాటకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బెంగుళూరుకు జనసేనాని
సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలో పాల్గొననున్న పవన్
చింతామణి గ్రామంలో బహిరంగసభకు ముఖ్య అతిథి గా డిప్యూటీ సిఎం పవన్
సాయంత్రం బెంగుళూరులో గోపాల్ గౌడ వ్రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించినన్ను డిప్యూటీ సీఎం పవన్
-
Oct 06, 2025 07:09 IST
మద్యం కుంభకోణం లో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్
నేడు ఎసిబి కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు.
ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా, ఐదుగురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులు
-
Oct 06, 2025 06:50 IST
తొలిసారిగా నేడు విశాఖ పోర్టుకు వీఎల్‌జీసీ శివాలిక్ నౌక
శివాలిక్ నౌకకు నేడు స్వాగతం పలకనున్న కేంద్రమంత్రి సర్భానంద
ఎల్పీజీ సరకును నేడు విశాఖ పోర్టుకు తీసుకురానున్న శివాలిక్ నౌక
-
Oct 06, 2025 06:34 IST
మహిళల వన్డే ప్రపంచకప్: నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్
-
Oct 06, 2025 06:34 IST
రంగారెడ్డి: మొయినాబాద్ పెద్దమంగళారంలో ఫాంహౌస్‌పై పోలీసుల దాడి
చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ చేసుకున్న మైనర్లు
50 మంది మైనర్లు మందు, డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు గుర్తింపు
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్‌హౌస్ 9MM పేజ్‌లో పరిచయమైన మైనర్లు
8 విదేశీ మద్యం సీసాలు స్వాధీనం, ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్
రాజేంద్రనగర్ SOT పోలీసుల అదుపులో ఆరుగురు నిర్వాహకులు
-
Oct 06, 2025 06:34 IST
అమరావతి: నేడు స్వచ్ఛత అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
21 కేటగిరీల్లో మున్సిపాలిటీ, పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు
-
Oct 06, 2025 06:32 IST
బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్
జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఎదుట విచారణ
-
Oct 06, 2025 06:32 IST
నేడు, రేపు కనువిందు చేయనున్న సూపర్ మూన్
భూమి చుట్టూ తిరుగుతూ కొన్ని సార్లు దగ్గరకు రానున్న చంద్రుడు
పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్ సైజు
వెలుగు. నేడు 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా కనిపించనున్న చంద్రుడు
నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్