-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across globe 8Th oct 2025 vreddy
-
BREAKING: లెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - Oct 08 , 2025 | 06:22 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 08, 2025 20:46 IST
ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
శ్రీశైలం జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని మోదీ
ఓర్వకల్లులో జీఎస్‌టీ సంస్కరణల ఉత్సవ్, పాల్గొననున్న ప్రధాని మోదీ
అలాగే మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మరో సమావేశం
కల్తీ లిక్కర్ తయారీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ అంతటా నకిలీ మద్యం అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం: చంద్రబాబు
మద్యం మరణాల ఆరోపణలపై దర్యాప్తు జరిపి వాస్తవాలు బయటపెట్టాలి
రాజకీయ కుట్రతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: సీఎం చంద్రబాబు
వైసీపీ నేతల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు
-
Oct 08, 2025 19:14 IST
విశాఖ: అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
స్థానికుల వ్యతిరేకతతో వాయిదా వేసిన పెదగంట్యాడ అధికారులు
ప్రజాభిప్రాయ సేకరణకు మరో తేదీ నిర్ణయిస్తాం: తహసీల్దార్ అమల
పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ: పెదగండ్యాడ తహసీల్దార్ అమల
ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపుతాం: తహసీల్దార్ అమల
-
Oct 08, 2025 19:14 IST
హైదరాబాద్: కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై చర్చ
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్లు
నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ కీలక సూచనలు
-
Oct 08, 2025 19:14 IST
హైదరాబాద్: AGతో మంత్రులు పొన్నం, శ్రీహరి, సురేఖ సమావేశం
రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడటంతో భేటీ
రేపు హైకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరించాల్సిన అంశాలపై చర్చ
కాసేపట్లో సీఎం రేవంత్‌ను కలవనున్న మంత్రులు, మహేష్‌గౌడ్
హైకోర్టులో వాదనలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించనున్న నేతలు
బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు తెలంగాణ హైకోర్టు విచారణ సందర్భంగా..
పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Oct 08, 2025 19:07 IST
రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
5 దశల్లో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు
అక్టోబర్ 23, 27న MPTC, ZPTC ఎన్నికలు, నవంబర్ 11న ఫలితాలు
అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు, సర్పంచ్ ఎన్నికలు
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్
తెలంగాణ హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ,..
27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు వాయిదా
రేపటి నామినేషన్లకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్
నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు వేయాలని నిర్ణయం
డీసీసీలను అలర్ట్ చేసిన టీపీసీసీ
-
Oct 08, 2025 19:07 IST
కోనసీమ పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
బాణసంచా పేలుడు ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: మోదీ
-
Oct 08, 2025 19:07 IST
కోనసీమ పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత
పేలుడు ఘటన దురదృష్టకరం: హోంమంత్రి అనిత
బాణసంచా తయారీ కేంద్రానికి 2026 వరకు అనుమతి ఉంది: హోంమంత్రి అనిత
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం: హోంమంత్రి అనిత
లైసెన్స్ లేని కంపెనీలపై చట్టపరమైన చర్యలు: అనిత
మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం ప్రకటిస్తాం: హోంమంత్రి అనిత
బాణసంచా కార్మికులకు బీమా కల్పించేలా చూస్తాం: అనిత
-
Oct 08, 2025 19:07 IST
ఆర్టీసీపై BRS నేతలు రాజకీయం చేస్తున్నారు: మంత్రి పొన్నం
ఛలో బస్ భవన్ పెట్టేవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి: పొన్నం
ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మే చేస్తే.. కేసీఆర్ కనీసం పట్టించుకోలేదు
గత ప్రభుత్వ బకాయిలను మేం కడుతున్నాం: మంత్రి పొన్నం
ఆర్టీసీ పరిరక్షణ కోసమే ఛార్జీలు కొంతవరకు పెంచాం: పొన్నం
-
Oct 08, 2025 19:07 IST
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేదు: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆమోదింపజేస్తామంటేనే అసెంబ్లీలో మద్దతిచ్చాం
తెలంగాణను కాంగ్రెస్ ప్రయోగశాలగా మార్చింది: శ్రీనివాస్‌గౌడ్
బీసీలు, ఓసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: శ్రీనివాస్‌గౌడ్
-
Oct 08, 2025 19:07 IST
కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం: మహేష్‌గౌడ్
మా వాదనలో బలం ఉంది కాబట్టే.. కోర్టు స్టే ఇవ్వలేదు: మహేష్‌గౌడ్
బీసీ రిజర్వేషనర్ల పెంపు.. మా పేటెంట్ హక్కు: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, BRS నాటకాలు ఆడుతున్నాయి
రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు: మహేష్‌గౌడ్
స్థానిక ఎన్నికల్లో 90శాతం స్థానాలు గెలుస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Oct 08, 2025 16:20 IST
అమరావతి: SIPB భేటీలో రూ.1.14లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరో స్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆమోదం
30కి పైగా ప్రాజెక్టుల ద్వారా 67వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా
రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టే రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో FDI రాలేదంటున్న ప్రభుత్వ వర్గాలు
పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న సీఎం చంద్రబాబు
భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం
కంపెనీలు త్వరగా వచ్చేలా బాధ్యత తీసుకోనున్న ప్రత్యేక అధికారులు
ఇప్పటివరకు 11 SIPBల ద్వారా రూ.7.07లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆయా కంపెనీల ద్వారా 6.2లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం
-
Oct 08, 2025 13:26 IST
భారతీయుల ఆశల వారధి ప్రధాని మోదీ: లోకేష్
భారతీయ భవిష్యత్‌ను మారుస్తారని భావిస్తున్నా: లోకేష్
మోదీ 25 ఏళ్ల పాలనపై ఎక్స్‌లో స్పందించిన లోకేష్
-
Oct 08, 2025 13:22 IST
కోనసీమ: రాయవరంలో భారీ అగ్నిప్రమాదం, ఆరుగురు మృతి
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
బాణసంచా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
-
Oct 08, 2025 13:21 IST
పోలీసులు సూచించిన కొత్త రూట్‌ను మేము అంగీకరిస్తున్నాం
జగన్ పర్యటనకు 18 కండీషన్లు పెట్టారు: మాజీ మంత్రి అమర్నాథ్
ఇన్ని నిబంధనలపై పోలీసులు సమీక్షించుకోవాలని కోరుతున్నాం
నర్సీపట్నం వెళ్లే మార్గంలో..
స్టీల్ ప్లాంట్ కార్మికులు రావాల్సిందిగా కోరుతున్నాం: అమర్నాథ్
-
Oct 08, 2025 12:36 IST
విశాఖ: పెదగంట్యాడలో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ
స్థానికుల ఆందోళనలతో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు
-
Oct 08, 2025 12:21 IST
అసోం: సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు
పోలీసుల అదుపులో జుబిన్ బంధువు సందీపన్ గార్గ్
-
Oct 08, 2025 12:21 IST
మంత్రుల వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది: మహేష్ గౌడ్
అడ్లూరికి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పారు: మహేష్ గౌడ్
మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలి: మహేష్ గౌడ్
ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దని నేతలకు సూచన
-
Oct 08, 2025 11:57 IST
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య ముగిసిన వివాదం
మంత్రి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పిన పొన్నం ప్రభాకర్
లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న
లక్ష్మణ్ గారికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న
కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగా
-
Oct 08, 2025 11:56 IST
విశాఖ: జగన్ వారాంతపు రాజకీయాలు చేస్తున్నారు: గంటా శ్రీనివాసరావు
పర్యటన పేరుతో రాజకీయ హడావుడి చేయాలనుకుంటున్నారు
వైసీపీ పాలనలో మా ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారు: గంటా
జగన్ పరామర్శలకు మా ప్రభుత్వం అనుమతిచ్చింది: గంటా
సత్తెనపల్లి, గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, నెల్లూరు పర్యటనలకు అనుమతిచ్చారు: గంటా
విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకోవడానికే వైసీపీ కుట్ర: గంటా
నర్సీపట్నం పర్యటనకు భారీగా జనసమీకరణ చేయాలని కుట్ర: గంటా
విశాఖలో రేపు మహిళల వన్డే మ్యాచ్ జరుగుతోంది: గంటా
వైసీపీ నేతలు ఇష్టానుసారం చేస్తామంటే ఊరుకోం: గంటా శ్రీనివాసరావు
-
Oct 08, 2025 11:42 IST
గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద కవిత నిరసన
నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నా
-
Oct 08, 2025 11:10 IST
హైదరాబాద్: మహేష్‌గౌడ్ నివాసానికి చేరుకున్న మంత్రులు అడ్లూరి, పొన్నం
మహేష్‌గౌడ్‌తో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ భేటీ
పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
నేను పార్టీ లైన్ దాటి ప్రవర్తించను: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమే: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
-
Oct 08, 2025 11:09 IST
బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా
విచారణ మ.12.30కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించిన హైకోర్టు
అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామన్న తెలంగాణ హైకోర్టు
సుప్రీంకోర్టులో కేసు వివరాలు అడిగి తెలుసుకున్న సీజే
హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పిటిషన్లు డిస్మిస్ చేసిందన్న ఏజీ
ప్రభుత్వం తరపున హైకోర్టులో అభిషేక్ సింఘ్వీ వాదనలు
-
Oct 08, 2025 10:48 IST
రేపు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తెలుసుకోనున్న పవన్
సముద్ర జలాల కాలుష్యం అవుతున్నాయంటున్న మత్స్యకారులు
సముద్రంలో ప్రయాణించి పరిశీలించనున్న పవన్ కల్యాణ్
ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించనున్న పవన్
పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు పవన్ శంకుస్థాపన
-
Oct 08, 2025 09:55 IST
షరతులతో కూడిన అనుమతి: విశాఖ నగర్ పోలీస్ కమిషనర్.
వైఎస్ జగన్ కి రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి..
విమానాశ్రయం నుండి NAD, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా, మాకవరపాలెం కి అనుమతి
రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదు
జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి 10 వాహనాలకు అనుమతి
నిబంధనలు, పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడం, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తాం
ఏదైనా గాయం, ప్రాణనష్టం లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలి
-
Oct 08, 2025 09:49 IST
పీసీసీ చీఫ్ నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
ఇద్దరు మంత్రులను తన ఇంటికే ఆహ్వానించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కాసేపట్లో మహేష్ గౌడ్ నివాసానికి రానున్న పొన్నం, అడ్లూరి
మంత్రుల వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయనున్న పీసీసీ చీఫ్
మంత్రుల అంశంపై ఆరా తీసిన ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్
వివాదాన్ని పరిష్కరించాలని మహేష్ గౌడ్ కి సూచించిన సీఎం రేవంత్
పొన్నం తనకి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు పట్టిన మంత్రి అడ్లూరి
తాను అడ్లూరిని అనలేదని చెప్తున్న మంత్రి పొన్నం
మంత్రులిద్దరూ సమన్వయంతో పనిచేయాలని సూచించనున్న పీసీసీ చీఫ్
-
Oct 08, 2025 09:44 IST
కామారెడ్డి: నేడు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం
-
Oct 08, 2025 09:28 IST
నటుడు పృథ్వీరాజ్ నివాసంలోనూ ఈడీ బృందాల సోదాలు
తమిళనాడు, కేరళలో ఈడీ అధికారుల దాడులు
లగ్జరీ కార్ల కేసులో ఈడీ అధికారుల సోదాలు
భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని..
దుల్కర్ సల్మాన్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు
ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఈడీ అధికారుల దాడులు
-
Oct 08, 2025 09:02 IST
జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టింది: మంత్రి లోకేష్
అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్ని..
వైసీపీ అడ్డంగా దొరికిపోయింది: మంత్రి లోకేష్
దోషులెవరూ తప్పించుకోలేరు: మంత్రి లోకేష్
ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారు
ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు సాగవు: లోకేష్
వాస్తవమిదీ.. అసత్యమిదీ అంటూ వీడియో విడుదల చేసిన లోకేష్
-
Oct 08, 2025 09:01 IST
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంపు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యల పై దళిత సంఘాల ఆగ్రహం
అడ్లూరి కి క్షమాపణ చెప్పకపోతే.. పొన్నం ఇంటిని ముట్టడిస్టామన్న దళిత సంఘాలు
పొన్నం ఇంటి ముట్టడి పిలుపు నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు
పొన్నం ఇంటి ముందు బారికేడ్స్ ఏర్పాటు
-
Oct 08, 2025 07:59 IST
ఏపీ లిక్కర్ కేసు నిందితుడు కొడాలి శ్రీనివాసరావు లొంగుబాటు?
ఎక్సైజ్ అధికారులకు లొంగిపోయినట్లు సమాచారం
నకిలీ మద్యం కేసులో ఏ12గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు
వైసీపీ నేతల సహకారంతో ఎక్సైజ్ అధికారుల దగ్గర సరండర్ అయినట్లు ప్రచారం
-
Oct 08, 2025 07:59 IST
బెంగళూరు: కన్నడ బిగ్‌బాస్ హౌస్ సీజ్
బిగ్‌బాస్ హౌస్ నిర్వహణకు సరైన అనుమతులు లేవంటూ నోటీసులు
నోటీసులకు స్పందించని బిగ్‌బాస్ నిర్వాహకులు
నోటీసులకు స్వందించకపోవడంతో బిగ్‌బాస్ హౌస్ సీజ్
-
Oct 08, 2025 07:58 IST
మంత్రుల మనస్పర్థలపై పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఫోకస్
అడ్లూరి లక్ష్మణ్, పొన్నంతో ఫోన్‌లో మాట్లాడిన మహేష్ గౌడ్
నేడు మహేష్‌గౌడ్‌ను కలవనున్న మంత్రులు అడ్లూరి, పొన్నం
-
Oct 08, 2025 07:57 IST
బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై నేడు టీజీ హైకోర్టులో విచారణ
BC రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు
అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న తెలంగాణ హైకోర్టు
-
Oct 08, 2025 07:56 IST
నాగార్జున సాగర్‌కు పెరిగిన వరద, 22 గేట్లు ఎత్తివేత
పులిచింతల ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత
మూసీ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తివేత
-
Oct 08, 2025 07:55 IST
హైదరాబాద్: ఈనెల 10 బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం
త్రిసభ్య కమిటీ నివేదికపై చర్చించనున్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్
కమిటీ ఖరారు చేసిన 3 పేర్లను హైకమాండ్‌కు పంపనున్న రాంచందర్‌రావు
ఈనెల 13న జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం
-
Oct 08, 2025 06:44 IST
అమరావతి: జూబ్లీ హిల్స్ ఉప్ప ఎన్నికల్లో ఓటుకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం
పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం
-
Oct 08, 2025 06:27 IST
డెమోక్రాట్లతో చర్చలకు ట్రంప్ ఆమోదం
హెల్త్‌కేర్‌పై ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్
ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు పలకాలని షరతు
-
Oct 08, 2025 06:27 IST
అమెరికాకు 44% తగ్గిన భారతీయ విద్యార్థి వీసాలు
ట్రంప్ నిర్ణయాలే కారణమన్న అంతర్జాతీయ వాణిజ్య కమిషన్
-
Oct 08, 2025 06:26 IST
ఈ నెల 17 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తులం మాస పూజలు నిర్వహించనున్న పూజారులు
అక్టోబర్ 22న మూతపడనున్న శబరిమల ఆలయం
-
Oct 08, 2025 06:26 IST
ముంబై: నటి శిల్పాశెట్టిని ప్రశ్నించిన పోలీసులు
వ్యాపారిని రూ.60 కోట్ల వరకు మోసం చేసినట్లు ఆరోపణలు
బ్యాంక్ లావాదేవీల గురించి ఆరా తీసిన పోలీసులు
-
Oct 08, 2025 06:26 IST
గాజా యుద్ధానికి రెండేళ్లు పూర్తి
తీవ్రంగా నష్టపోయిన ఇజ్రాయెల్, గాజా
గాజాలో ఇప్పటివరకు 67 వేల మంది పాలస్తీనియన్లు మృతి
1.70 లక్షల మందికి గాయాలు, లక్షకుపైగా భవనాలు నేలమట్టం
-
Oct 08, 2025 06:25 IST
చెన్నై: కరూర్ ప్రమాద బాధితులను కలవడానికి విజయ్ విజ్ఞప్తి
కరూర్ తొక్కిసలాట ఘటన బాధితులను కలిసేందుకు ప్రభుత్వానికి వినతి
తమిళనాడు పోలీస్ డీజీపీ మెయిల్ ద్వారా పిటిషన్ సమర్పణ
-
Oct 08, 2025 06:25 IST
ప్రభుత్వాధినేతగా మోదీకి పాతికేళ్లు
గుజరాత్‌లో 3 సార్లు, కేంద్రంలో 3 సార్లు బీజేపీ విజయసారథిగా నిలిచిన మోదీ
-
Oct 08, 2025 06:24 IST
తెలంగాణ: స్థానికంపై నేడు స్పష్టత
బీసీ రిజర్వేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీకి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్
హైకోర్టులో వాదనలు వినిపించాలని అభిషేక్ సింఘ్వీని కోరిన సీఎం రేవంత్
-
Oct 08, 2025 06:24 IST
రాజస్థాన్: జైపూర్‌లో గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టిన మరో లారీ
గ్యాస్ సిలిండర్ల పేలుడుతో 2 లారీలు దగ్ధం, పలు వాహనాలు ధ్వంసం
వరుసగా సిలిండర్లు పేలడంతో జైపూర్-అజ్మీర్ హైవే మూసివేత
సావర్దా పులియా శివారులో ఘటన, 7 కి.మీ. వరకు ట్రాఫిక్ జామ్
ప్రమాద ఘటనపై ఆరా తీసిన రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ
బాధితులకు సాయం అందించాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశాలు
ఘటనాస్థలాన్ని పరిశీలించిన రాజస్థాన్ డిప్యూటీ సీఎం
-
Oct 08, 2025 06:23 IST
విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై సిట్ కౌంటర్ దాఖలు
పాస్‌పోర్ట్ ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మిథున్‌రెడ్డి పిటిషన్
నేడు విచారణ చేపట్టనున్న విజయవాడ ఏసీబీ కోర్టు
-
Oct 08, 2025 06:23 IST
ప.గో.: నేడు పెదఅమిరంలో మాజీ సీఎం జగన్ పర్యటన
వైసీపీ నేత ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరు
-
Oct 08, 2025 06:23 IST
నేడు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-
Oct 08, 2025 06:22 IST
పల్నాడు: పిన్నెల్లి సోదరులకు మరోసారి నోటీసులు
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంటహత్యల కేసులో..
నేడు విచారణకు రావాలని మాచర్ల రూరల్ పోలీసుల నోటీసులు