-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking Cinema Business National and International news across the globe 18th sept 2025 siva
-
BREAKING: అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్
ABN , First Publish Date - Sep 18 , 2025 | 11:18 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 18, 2025 20:45 IST
అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్
హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాలు లేవన్న సెబీ
సెబీ క్లీన్‌చిట్‌పై హర్షం వ్యక్తం చేసిన గౌతమ్ అదానీ
తప్పుడు నివేదికతో మదుపరులు నష్టపోయారు: గౌతమ్ అదానీ
అవాస్తవాలు వ్యాప్తి చేసినవారు దేశానికి క్షమాపణలు చెప్పాలి: అదానీ
-
Sep 18, 2025 20:45 IST
విద్యా హక్కు చట్టం అమలు చేయాలని టీజీ హైకోర్టులో పిల్
పిల్ దాఖలు చేసిన న్యాయ విద్యార్థి మల్లికార్జున్
ఈ తరహా పిల్స్ ఇంకా ఉన్నాయా అని ప్రశ్నించిన సీజే
రెండు పిల్స్ విచారణ దశలో ఉన్నాయని తెలిపిన జీపీ
అన్ని పిటిషన్లు కలిపి వాదనలు వింటామన్న సీజే
-
Sep 18, 2025 17:26 IST
నిరాశపరిచిన నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రోలో నిరాశపరిచిన నీరజ్ చోప్రా
ప్రపంచ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయిన నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో 8వ స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
10 వ స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయిన పాక్ ఆటగాడు అర్షద్ నదీమ్
-
Sep 18, 2025 17:26 IST
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
విశాఖ నుంచి మ.2:20కు హైదరాబాద్ బయలుదేరిన విమానం
కొంత దూరం వెళ్లాక విమానం రెక్కల్లో ఇరుక్కున్న పక్షి
పక్షి ఇరుక్కోవడంతో దెబ్బతిన్న విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు
విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేసిన పైలట్
ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు
-
Sep 18, 2025 17:26 IST
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
MBBS, BDS అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపుపై..
వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు
ఏపీ సైనిక్ స్కూల్‌లో చదివినా తెలంగాణ కోటా కింద పరిగణించాలని స్పష్టం
సైనిక్ స్కూల్‌లో చదివిన తెలంగాణ విద్యార్థులకు పదేళ్ల వరకు రాయితీ కొనసాగింపు
పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన తెలంగాణ హైకోర్టు
-
Sep 18, 2025 17:18 IST
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై ప్రభుత్వం సీరియస్
ప్రజాపాలన దినోత్సవంలో ప్రొటోకాల్ పాటించని కలెక్టర్
లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రభుత్వం నోటీసులు
ఆగస్ట్ 15న జెండా ఆవిష్కరణలో సమయానికి హాజరుకాకపోవడం,..
విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం
నిన్న సీఎస్, సీఎంఓకు ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్
-
Sep 18, 2025 17:18 IST
హైదరాబాద్: చర్లపల్లి మహిళ హత్యకేసులో పురోగతి
నిందితుడు మృతదేహంతో 38కి.మీ. ట్రావెల్ చేసినట్టు గుర్తింపు
మృతదేహంతో నార్సింగ్ నుంచి చర్లపల్లికి వచ్చిన నిందితుడు
నిందితుడు మృతదేహం మూటను రైల్వేస్టేషన్‌లో వదిలేసి..
వెస్ట్ బెంగాల్ వెళ్లే రైలు ఎక్కినట్టు గుర్తించిన పోలీసులు
-
Sep 18, 2025 16:38 IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి: తిరుపతి ఎస్పీ
గతేడాది బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి సవరించాం: తిరుపతి ఎస్పీ
భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు
తిరుపతిలో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశాం: తిరుపతి ఎస్పీ
తిరుపతి పార్కింగ్ స్థలాల్లో అన్నప్రసాదాలు, నీరు పంపిణీ: తిరుపతి ఎస్పీ
గరుడ సేవ రోజున భక్తులను ప్రజారవాణాలో తరలిస్తాం: తిరుపతి ఎస్పీ
4 వేల సీసీ కెమెరాల ద్వారా బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ: తిరుపతి ఎస్పీ
వీఐపీల భద్రతకు ప్రత్యేక బలగాలను నియమించాం: తిరుపతి ఎస్పీ
-
Sep 18, 2025 16:36 IST
మిథున్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన మిథున్‌రెడ్డి
A4గా ఉన్న మిథున్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి కోరిన సిట్
2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు
ఈ నెల 19, 20 రెండు రోజులు పాటు ఉ.8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు
-
Sep 18, 2025 16:03 IST
హైదరాబాద్: బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
భేటీలో పాల్గొన్న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
తెలంగాణ మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు కామరూన్ అంగీకారం
ఎడ్యుకేషన్, టెక్నాలజీలో సహకారం అందించేందుకు సిద్ధమన్న కామరూన్
బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి చర్చించిన సీఎం
రాష్ట్రంలో తెచ్చే కొత్త విద్యా విధానం డ్రాఫ్ట్ గురించి వివరించిన సీఎం
రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమన్న బ్రిటిష్ హైకమిషనర్
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలన్న సీఎం
జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలన్న సీఎం
సీఎం విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన బ్రిటిష్ హైకమిషనర్
-
Sep 18, 2025 16:03 IST
ప.గో: త్వరలో నర్సాపురం వరకు వందే భారత్ రైలు
చెన్నై విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణమధ్య రైల్వే
రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం స్టేషన్లలో అభివృద్ధి పనులు
నరసాపురంలో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న అమృత్ భారత్ స్టేషన్ నిర్మాణ పనుల పరిశీలన
-
Sep 18, 2025 16:03 IST
నల్లగొండ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రజ్యోతి పేపర్ పేరుతో నాపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ పోస్టర్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి లేదని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు
రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని ఫేక్ ప్రచారం: రాజగోపాల్‌రెడ్డి
-
Sep 18, 2025 15:20 IST
తెలంగాణ ఆర్టీసీపై ఇవాళ కీలక సమావేశం
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సమీక్ష.
హాజరుకానున్న మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నాతాధికారులు.
ఆర్టీసీకి ఆర్థిక సహాయం, మహాలక్ష్మి పథకం అమలు, బకాయిల చెల్లింపులపై చర్చ.
-
Sep 18, 2025 15:05 IST
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత
కొండాపురం దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.
5 కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం.
హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్న పోలీసులు.
పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం.
-
Sep 18, 2025 15:01 IST
నల్లగొండ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రజ్యోతి పేపర్ పేరుతో నాపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి.
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ పోస్టర్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి లేదని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు.
రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని ఫేక్ ప్రచారం: రాజగోపాల్‌రెడ్డి.
-
Sep 18, 2025 14:31 IST
చెన్నై, హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
మార్గ్ గ్రూప్ కంపెనీల్లో సోదాలు.
శశికళ బినామీగా ఆరోపణలున్న జీఆర్‌కే రెడ్డి ఇళ్లలో సోదాలు.
రూ.200 కోట్ల బ్యాంకు మోసం కేసులో కొనసాగుతున్న తనిఖీలు.
గతంలో సీబీఐ నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ సోదాలు.
-
Sep 18, 2025 13:57 IST
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన ఈడీ సోదాలు
వెస్ట్‌మారేడ్‌పల్లిలో వ్యాపారవేత్త బూరుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్..
నివాసాల్లో 7 గంటలపాటు ఈడీ తనిఖీలు
సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో షెల్ కంపెనీలకు నగదు వెళ్లినట్లు గుర్తింపు
-
Sep 18, 2025 13:07 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
పైలా దిలీప్, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప సహా..
8 మంది నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్ పొడిగింపు
-
Sep 18, 2025 12:16 IST
విజయవాడ ఏసీబీ కోర్టుకు లిక్కర్ స్కాం కేసు నిందితులు
ఎనిమిది మంది నిందితులను కోర్టుకు తరలించిన పోలీసులు.
కోర్టుకు దిలీప్, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప.
కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు.
-
Sep 18, 2025 12:15 IST
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
పెట్టుబడుల కోసం పలు సంస్థల ప్రతినిధులతో భేటీకానున్న సీఎం రేవంత్.
ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్న సీఎం రేవంత్.
పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్.
రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులతో భేటీకానున్న సీఎం రేవంత్.
-
Sep 18, 2025 12:09 IST
కేటీఆర్‌కు ఒళ్లంతా విషమే: మంత్రి పొంగులేటి
రెండున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే మాట్లాడుతున్నారు
కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చూడు: పొంగులేటి
జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత BRS స్థానం ఏంటో చూసుకో: పొంగులేటి
-
Sep 18, 2025 11:29 IST
అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?: రాహుల్
కర్ణాటక అలంద్‌లో గోదాబాయి పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారు: రాహుల్
సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయి: రాహుల్
కర్ణాటకలో ఓట్ల తొలగింపుపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది: రాహుల్
ఓట్ల తొలగింపు వివరాలను కర్ణాటక సీఐడీ కోరినా ఈసీ స్పందించలేదు: రాహుల్
మహారాష్ట్ర రాజురా అసెంబ్లీ స్థానంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు: రాహుల్
-
Sep 18, 2025 11:28 IST
ఓట్ల తొలగింపునకు ఎవరు అప్పీల్ చేశారు?: రాహుల్
సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తున్నారు: రాహుల్
ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు: రాహుల్
మాకు ఓట్ల తొలగింపు ఐడీలు, OTP వివరాలు ఇవ్వాలి: రాహుల్
కర్ణాటక ఈసీ.. ప్రస్తుతం ఢిల్లీలోని సీఈసీలో ఉన్నారు: రాహుల్
-
Sep 18, 2025 11:18 IST
ఓట్ చోరీపై మరోసారి రాహుల్ గాంధీ విమర్శలు
త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది: రాహుల్
సీఈసీపై మరోసారి రాహుల్ ఆరోపణలు: రాహుల్
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారిని ఈసీ కాపాడుతోంది
కాంగ్రెస్‌కు అనుకూలంగాలచోట ఓట్ల తొలగించారు: రాహుల్
నకిలీ లాగిన్స్, సాఫ్ట్‌వేర్‌తో ఓటర్లను తొలగించారు: రాహుల్
కర్ణాటకలో కొన్నిచోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం: రాహుల్
కాంగ్రెస్ బూత్‌లను టార్గెట్ చేశారు: రాహుల్
ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఓటర్లను తొలగించారు: రాహుల్
నకిలీ ఓట్లకు లింక్ చేసినవన్నీ ఫేక్ ఫోన్ నెంబర్లు: రాహుల్
ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే పనిచేయడం లేదు: రాహుల్
కాంగ్రెస్‌కు బలం ఉన్న చోట ఓట్లు తొలగించారు: రాహుల్
నేను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదు.. వాస్తవాలు: రాహుల్
చాలాచోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారు: రాహుల్