-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking Cinema Business National and International news across the globe 17th sept 2025 siva
-
Breaking: EVMలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ABN , First Publish Date - Sep 17 , 2025 | 09:55 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 17, 2025 16:52 IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్
వెయ్యి డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
Sep 17, 2025 16:52 IST
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 3 సర్వేలు చేయించింది: కేటీఆర్
3 సర్వేల్లోనూ BRS గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ చేయి గుర్తు తీసేసి.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి: కేటీఆర్
ఫిరాయింపు MLAల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా ఉంది: కేటీఆర్
ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని దుస్థితి: కేటీఆర్
-
Sep 17, 2025 16:42 IST
EVMలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
EVMలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల నుంచి కొత్త నిబంధనలు అమలు
-
Sep 17, 2025 16:41 IST
విశాఖ: గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్
పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు
మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉంది: చంద్రబాబు
విశాఖలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి: చంద్రబాబు
దేశ ఆర్థిక విధానాలను కేంద్రమంత్రి నిర్మల ముందుకు తీసుకెళ్తున్నారు
నిర్మల తెలుగింటి కోడలు కావడం గర్వకారణం: చంద్రబాబు
దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధానులతో కలిసి పనిచేశా
అప్పటి సంస్కరణలు.. ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి: చంద్రబాబు
ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద ఆస్తి: సీఎం చంద్రబాబు
సరైన సమయంలో.. సరైన నాయకుడు.. ప్రధాని మోదీ: చంద్రబాబు
గత నాయకులు టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టలేదు
వాజ్‌పేయి హయాంలో టెలికాం రంగంలో సంస్కరణలు: చంద్రబాబు
మౌలిక సౌకర్యాల రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు: చంద్రబాబు
-
Sep 17, 2025 15:46 IST
విజయవాడలోని గొల్లపూడి ఆలయ భూముల వివాదంలో కీలక తీర్పు
హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన డివిజిన్ బెంచ్
గొల్లపూడి ఆలయ భూముల్లో విజయ
ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని..
నిన్న తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్
-
Sep 17, 2025 15:46 IST
నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు: చంద్రబాబు
కొనుగోలు శక్తి పెరుగుతుంది.. వస్తువుల ధరలు తగ్గుతాయి: చంద్రబాబు
స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రధాని పిలుపు నిచ్చారు: చంద్రబాబు
దేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి: చంద్రబాబు
-
Sep 17, 2025 15:44 IST
స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్
విశాఖలో 'స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమం
పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు
ఉప్పు, పంచదార, ఆయిల్ వాడకం తగ్గించాలి: సీఎం చంద్రబాబు
ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న చిట్కాలు పాటించాలి: సీఎం చంద్రబాబు
మహిళల ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
సంజీవని పేరుతో సరికొత్త పథకానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
కార్పొరేట్ కంపెనీలను కూడా సంజీవనితో భాగస్వామ్యం చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
-
Sep 17, 2025 15:44 IST
తిరుపతి: వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
భూమనకు 41A నోటీసులు ఇచ్చిన అలిపిరి పోలీసులు
రేపు డీఎస్పీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు
వచ్చే మంగళవారం హాజరువుతానని కరుణాకర్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం
అలిపిరిలో విగ్రహంపై అనవసర వివాదం సృష్టించి..
హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరుణాకర్‌పై కేసు
-
Sep 17, 2025 15:43 IST
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానం
టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి
-
Sep 17, 2025 14:23 IST
హైదరాబాద్: ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి
ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనది
ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి
సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టాం
బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు: రేవంత్ రెడ్డి
-
Sep 17, 2025 13:28 IST
గ్రూప్ 1 ఉద్యోగాలపై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ..
గ్రూప్ 1 ఉద్యోగాలపై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ.
Group 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు.
ఈనెల 9న తీర్పు ఇచ్చిన సింగల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు.
రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్.
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ.
-
Sep 17, 2025 12:29 IST
లండన్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన
AP-UK బిజినెస్ ఫోరం రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి లోకేష్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: లోకేష్
APకి 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్
క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో AP రూపురేఖలు మారిపోతాయి
AI అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు
పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలు సవరిస్తున్నాం
విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో పార్టనర్‌షిప్ సమ్మిట్: లోకేష్
గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం కోసం లండన్‌లో లోకేష్
-
Sep 17, 2025 11:22 IST
ఎన్టీఆర్: మాజీమంత్రి జోగి రమేష్ అరెస్టు
NTTPS యాష్‌పాండ్‌కు బయల్దేరిన..
జోగి రమేష్‌ను అరెస్టు చేసిన భవానీపురం పోలీసులు
-
Sep 17, 2025 10:04 IST
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి తుమ్మల.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది.
-
Sep 17, 2025 10:03 IST
పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవం.
జాతీయ జెండా ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.
హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,డీజీపీ జితేందర్,ఇతర ఉన్నతాధికారులు.
-
Sep 17, 2025 10:01 IST
సికింద్రాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం
పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన రక్షణమంత్రి రాజ్‌నాథ్.
సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్‌నాథ్ నివాళులు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజ్‌నాథ్‌సింగ్.
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాజ్‌నాథ్ నివాళులు.
కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించిన రాజ్‌నాథ్.
పాల్గొన్న షెకావత్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్.
-
Sep 17, 2025 09:55 IST
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళులు..
హైదరాబాద్: గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళులు.
కాసేపట్లో పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవం.