-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy FAST Breaking news across globe 27th sept 2025 vreddy
-
BREAKING: ఘోరం.. తొక్కిసలాటలో 29 మంది మృతి
ABN , First Publish Date - Sep 27 , 2025 | 06:31 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 27, 2025 20:47 IST
తమిళనాడులో తీవ్ర విషాదం
TVK అధినేత విజయ్ మీటింగ్‌లో తొక్కిసలాట
తొక్కిసలాటలో 29 మంది మృతి
మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 10 మంది మహిళలు
మరో 20 మందికి పైగా తీవ్రగాయాలు
కరూర్ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
తక్షణ సహాయచర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశం
-
Sep 27, 2025 19:58 IST
అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో సమసిన వివాదం
అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో పాటు..
ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలనూ రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించినట్లు జనసేన MLAలకు సమాచారం
-
Sep 27, 2025 19:58 IST
విజయవాడ: నూతన టూరిజం పాలసీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
పర్యావరణ, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ టూరిజం అభివృద్ధి
దేశ ఆర్థిక అభివృద్ధిని శాసించే స్థాయికి టూరిజం వచ్చింది: చంద్రబాబు
టూరిజంలోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి: సీఎం చంద్రబాబు
ఏపీలో టూరిజాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఏపీలో టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ పెద్ద గేమ్‌ఛేంజర్: సీఎం చంద్రబాబు
ఏపీ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలి
ఏపీలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
నతన టూరిజం పాలసీపై అందరూ అవగాహన పెంచుకోవాలి: చంద్రబాబు
-
Sep 27, 2025 17:46 IST
హైకోర్టు విచారణ..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభం
రిజర్వేషన్ల జీవో కొట్టేయాలన్న పిటిషన్‌పై విచారణ
-
Sep 27, 2025 17:45 IST
రాకియా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు
నిమ్మగడ్డ ప్రసాద్‌పై రాకియా పిటిషన్‌ను త్వరగా తేల్చాలని హైకోర్టు ఆదేశం
రాకియా పిటిషన్‌పై కమర్షియల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
వాన్‌పిక్ వ్యవహారంలో రూ.600 కోట్లు చెల్లించాలని గతంలో రస్ అల్ ఖైమా కోర్టు తీర్పు
రస్ అల్ ఖైమా కోర్టు డిక్రీ అమలు చేయాలని 2023లో రాకియా పిటిషన్
2023లో హైదరాబాద్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాకియా
విచారణలో జాప్యంపై హైకోర్టును ఆశ్రయించిన రాకియా
నిమ్మగడ్డ ఆస్తులు బదిలీ చేస్తున్నందున డిక్రీ త్వరగా అమలు చేయాలన్న రాకియా
-
Sep 27, 2025 17:45 IST
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన 100 శాతం నిజం: ఆర్.నారాయణమూర్తి
జగన్ ప్రభుత్వం ఎవర్నీ అవమానించలేదు: ఆర్.నారాయణ మూర్తి
చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్‌ని కలసినప్పుడు ఎంతో గౌరవం ఇచ్చారు: ఆర్.నారాయణ మూర్తి
సినీపరిశ్రమ పెద్దగా చిరంజీవి జగన్‌తో మాట్లాడారు : ఆర్.నారాయణమూర్తి
చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారమైంది: ఆర్.నారాయణమూర్తి
సినిమా టికెట్ ధరలు పెంచితే ప్రజలు ఇబ్బందులు పడతారు: ఆర్.నారాయణ మూర్తి
బాలకృష్ణ వ్యాఖ్యలపై నేను మాట్లాడదల్చుకోలేదు: ఆర్.నారాయణమూర్తి
సామాన్యుడికి వినోదం పంచేది కేవలం సినిమా మాత్రమే: ఆర్.నారాయణమూర్తి
-
Sep 27, 2025 17:29 IST
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
8 రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు
23 బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం: స్పీకర్ అయ్యన్న
అసెంబ్లీలో 6 అంశాలపై లఘుచర్చ: స్పీకర్ అయ్యన్న
-
Sep 27, 2025 16:44 IST
అక్టోబర్ 4న వాహనమిత్ర ద్వారా ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున అందజేస్తాం: సీఎం చంద్రబాబు
అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌ను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
సూపర్ సిక్స్.. సూపర్ హిట్: సీఎం చంద్రబాబు
ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం చంద్రబాబు
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది: చంద్రబాబు
కూటమి ప్రభుత్వం అందరిదీ.. అందరి బాగోగులు చూస్తాం: చంద్రబాబు
63.5 లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
ప్రతినెలా ఒకటోతేదీనే పెన్షన్లు అందజేస్తున్నాం: సీఎం చంద్రబాబు
పెన్షన్లు ఎక్కువ ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం చంద్రబాబు
పెన్షన్ల కోసం ఏటా రూ.32,143 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్నాం: సీఎం చంద్రబాబు
స్త్రీశక్తి ద్వారా మహిళలకు అండగా నిలిచాం: సీఎం చంద్రబాబు
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికివందనం: చంద్రబాబు
-
Sep 27, 2025 16:44 IST
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ధ్వంసం చేసిన బలగాలు
సుక్మా జిల్లా మెట్టగూడ అటవీప్రాంతంలో ఆయుధ ఫ్యాక్టరీ ధ్వంసం
ఫ్యాక్టరీ నుంచి భారీఎత్తున పేలుడు పదార్థాలు, యంత్రాలు స్వాధీనం
ఆపరేషన్లు కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు..
అతిపెద్ద BGL లాంచర్ తయారీలో నిమగ్నమై ఉన్నట్లు పోలీసులు వెల్లడి
-
Sep 27, 2025 16:44 IST
DGP పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తా: ABNతో శివధర్‌రెడ్డి
తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది: ABNతో నూతన DGP శివధర్‌రెడ్డి
పోలీసులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి: ABNతో శివధర్‌రెడ్డి
డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలాచర్యలు తీసుకుంది..
ఈగల్ టీం కూడా స్ట్రాంగ్‌గా పనిచేస్తోంది: ABNతో నూతన DGP శివధర్‌రెడ్డి
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల సహకారం కూడా అవసరం: శివధర్‌రెడ్డి
సైబర్ సెక్యూరిటీతో చాలావరకు నేరాలు అరికడుతున్నాం: శివధర్‌రెడ్డి
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: ABNతో నూతన DGP శివధర్‌రెడ్డి
అన్నిశాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు కృషి: శివధర్‌రెడ్డి
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాం: ABNతో నూతన DGP శివధర్‌రెడ్డి
-
Sep 27, 2025 16:42 IST
చరిత్రలో తొలిసారి MGBS బస్‌స్టేషన్ మునిగింది: కేటీఆర్
వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది: కేటీఆర్
అలర్ట్ చేసినా చెరువుల్లో నీటిని ఖాళీ చేయలేదు: కేటీఆర్
జంట జలాశయాలకు ఒకేసారి గేట్లు ఎత్తారు: కేటీఆర్
నగరంలోని అనేక ప్రాంతాలు మునగడానికి కారణమయ్యారు
మూసీ ప్రాజెక్ట్ వద్దన్నందుకే ఈ కుట్ర చేశారు: కేటీఆర్
పేదల ఇళ్లను ముంచాలని చూశారు: కేటీఆర్
-
Sep 27, 2025 13:02 IST
తెలంగాణలోని 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
Sep 27, 2025 12:34 IST
అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ
మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించిన లోకేష్
జీఎస్టీ సంస్కరణల పై కర్నూల్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు
కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న మోదీ
శ్రీశైలం లో మల్లన్న దర్శనం చేసుకోనున్న మోదీ
కర్నూల్ లో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో
-
Sep 27, 2025 11:56 IST
-
Sep 27, 2025 11:30 IST
మూసీ ఉధృతికి గోల్నాకలో నీట మునిగిన అంబేద్కర్ నగర్
వరదలో చిక్కుకున్న 20కి పైగా కుటుంబాలు
నిన్న రాత్రి నుంచి సహాయం కోసం ఎదురుచూపులు
బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్న DRF బృందాలు
-
Sep 27, 2025 11:30 IST
హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కీలక సమావేశం
పాల్గొన్న సీఎస్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సహా ఉన్నతాధికారులు
ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, భద్రత బందోబస్తు, రిజర్వేషన్లపై చర్చ
-
Sep 27, 2025 11:08 IST
పల్నాడు: మాచర్ల రూరల్ పీఎస్‌కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
విచారణ హాజరైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి
గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా పిన్నెల్లి సోదరులు
ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
-
Sep 27, 2025 10:50 IST
శాసనమండలి లో కాఫీ రగడ
మండలి లో ఇచ్చే కాఫీకి, అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందన్న మండలి ఛైర్మన్
శాసనసభ లో, మండలిలో ఒకే రకమైన కాఫీ భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యుల ఆందోళన
అలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వివరణ
ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ
చర్చకు పట్టుబట్టి సభను స్తంభింప చేసిన వైసీపీ
సభను కొద్దిసేపు వాయిదా వేసిన ఛైర్మన్
-
Sep 27, 2025 10:19 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారిమళ్లింపు
ప్రతికూల వాతావరణంతో పలు విమానాలు మళ్లింపు
-
Sep 27, 2025 09:52 IST
హైదరాబాద్: జంట జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల
మూసీ వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు, GHMC హెచ్చరికలు
పురానాపూల్-జియాగూడ 100 ఫీట్ రోడ్ తాత్కాలికంగా మూసివేత
నీటమునిగిన చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు
ముసారాంబాగ్ దగ్గర నిర్మాణంలో వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం
వరద నీటిలో కొట్టుకుపోయిన నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామగ్రి
చాదర్‌ఘాట్ ఓల్డ్ బ్రిడ్జిపై 6 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద
ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద
దిల్‌సుఖ్‌నగర్-అంబర్‌పేట్ మధ్య రాకపోకలు బంద్
గోల్నాక బ్రిడ్జి పైనుంచి వాహనాల మళ్లింపు
మూసీ పరివాహక బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు
-
Sep 27, 2025 08:52 IST
తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్
ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు
సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు
గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్
పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర
ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్
హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు
హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్
వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్
నారాయణపేట ఎస్పీగా వినీత్,
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత
స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా
-
Sep 27, 2025 08:47 IST
నేడు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
మధ్యాహ్నం నుంచి సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం
-
Sep 27, 2025 08:35 IST
హైదరాబాద్: మూసీ నదికి భారీ వరదపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
వరద పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్
లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
MGBSకు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలి
ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలి: రేవంత్‌రెడ్డి
పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, GHMC అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నీళ్లు నిలిచే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 27, 2025 08:32 IST
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
ఏపీలోని 7 జిల్లాలకు భారీ వర్షసూచన
మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
-
Sep 27, 2025 06:38 IST
యాదాద్రి జిల్లాలో మూసి నది ఉధృతి
జూలూరు-రుద్రవెల్లి దగ్గర మూసీ ఉగ్రరూపం
బ్రిడ్జి పైనుంచి భారీగా ప్రవహిస్తున్న మూసీ వరద
పోచంపల్లి-బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు
వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వా దగ్గర..
లోలెవన్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది
చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్
మూసీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Sep 27, 2025 06:38 IST
పల్నాడు: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసుల నోటీసులు
జంటహత్యల కేసులో నేడు విచారణకు రావాలని..
పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు
-
Sep 27, 2025 06:37 IST
నేడు చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మరోవైపు మండలిలో కొనసాగుతున్న ఎస్సీ చైర్మన్ వివాదం
-
Sep 27, 2025 06:36 IST
హైదరాబాద్: జలదిగ్భందంలో ఎంజీబీఎస్ బస్టాండ్
పూర్తిగా నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో పెరిగిన వరద
MGBS బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునక
ప్రయాణికులను సురక్షితంగా బయటకు తెచ్చిన అధికారులు
-
Sep 27, 2025 06:35 IST
హైదరాబాద్: భారీ వర్షాలకు ఉప్పొంగిన మూసీ నది
నీటమునిగిన ముసారాంగ్ బ్రిడ్జి, పరిసర కాలనీలు
ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసేసిన అధికారులు
-
Sep 27, 2025 06:34 IST
ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన టీజీ ప్రభుత్వం
రేపు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 27, 2025 06:34 IST
విశాఖ: నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
VMRDA ఆధ్వర్యంలో పలు పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం
VMRDA పార్క్, కైలాసగిరి, సెంట్రల్ పార్క్, తెలుగు మ్యూజియం..
సబ్ మెరైన్ మ్యూజియం, ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం..
సీ-హారియర్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియాలకు ఉచిత ప్రవేశం
-
Sep 27, 2025 06:31 IST
ఇవాళ ఉదయం తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం
CS, DGP, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీకానున్న SEC
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్న SEC