Share News

International Yoga Day : ఫస్ట్ టైం యోగా చేస్తున్నారా? అయితే, ఈ విషయాల్లో జాగ్రత్త..!

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:20 PM

Yoga Guide for Beginners: మీరు మొదటిసారి యోగా చేస్తున్నట్లయితే యోగా నిపుణులు చెప్తున్న ఈ సలహాలను పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా తప్పుగా చేస్తే అది మంచి కంటే చెడే ఎక్కువ కలిగిస్తుంది. కాబట్టి, యోగా ప్రారంభించే ముందు ఈ కింది విషయాల్లో ముందుగానే సిద్ధమవ్వాలి.

International Yoga Day : ఫస్ట్ టైం యోగా చేస్తున్నారా? అయితే, ఈ విషయాల్లో జాగ్రత్త..!
Yoga guide for beginners

Yoga Basics for Beginners: ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో యోగా క్రమం తప్పకుండా చేసేవారు ఎందరో. అలాంటి వాళ్లను చూశాక తామూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని యోగా చేయాలని భావిస్తారు కొందరు. మనసులో ఎంత దృఢంగా సంకల్పించుకున్నా మొదటిసారి యోగా చేయాలంటే కాస్త భయం ఉండటం సహజం. ఎందుకంటే ఎలా చేయాలి? చేసినా ప్రయోజనం లేకపోతే? ఇలా వివిధ ప్రశ్నలు మనస్సులో తలెత్తుతాయి. కానీ యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోగా ప్రారంభించే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ చిట్కాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి . అలాగే, ఈ చిట్కాలు క్రమశిక్షణతో యోగా చేయడానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి యోగా ప్రారంభించే ముందు మనం ఎలా సిద్ధమవ్వాలో చూద్దాం.


ఖాళీ కడుపుతో యోగా

యోగా ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో చేయాలని యోగా నిపుణులు అంటున్నారు. అయితే, యోగా చేయడానికి అరగంట ముందు నీరు తాగవచ్చు. కానీ మీ కడుపులో ఆహారం ఉండకుండా చూసుకోవాలి. మీరు ఉదయాన్నే యోగా చేయలేకపోతే అల్పాహారం తీసుకున్న కనీసం 3 గంటల తర్వాత యోగా చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం లేదా భోజనం చేసిన వెంటనే యోగా చేయకూడదు.


ఆసనాలను సరిగ్గా వేయండి

యోగా సాధన చేసేటప్పుడు సరైన భంగిమలో చేయండి. ఇది అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే యోగా తప్పుగా చేస్తే అది ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగిస్తుంది. ప్రతి యోగా భంగిమను ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు శారీరక నొప్పి లేదా అనారోగ్యం నుండి ఉపశమనం పొందడానికి యోగా చేస్తుంటే నిపుణుడిని సంప్రదించి దానికి తగిన యోగా భంగిమలను సాధన చేయండి. తప్పు యోగా భంగిమలను ఎంచుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే తాజా గాలిలో యోగా సాధన చేయడం మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.


దుస్తుల ఎంపిక

యోగా చేయడానికి సరైన దుస్తులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా సరైన లోదుస్తులను ఎంపిక చేసుకోవడం అవసరం. మీ శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులనే ఎంచుకోండి మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోండి. గాలి పీల్చుకునేందుకు సౌకర్యవంతంగా ఉన్న బట్టలనే ధరించండి. వాతావరణానికి తగిన దుస్తులను ఎంచుకోండి. తద్వారా మీరు సులభంగా యోగా సాధన చేయవచ్చు.


యోగా మ్యాట్

యోగా చేసే ముందు మీ మ్యాట్ సౌకర్యవంతంగా ఉందో లేదో తనిఖీ చేయండి. యోగా మ్యాట్ సౌకర్యవంతంగా లేకపోతే మీరు యోగా చేస్తున్నప్పుడు అది అనేక సమస్యలను కలిగిస్తుంది. మ్యాట్ జారేలా ఉండకూడదు. ఎందుకంటే యోగా చేస్తున్నప్పుడు జారిపడే ప్రమాదముంది. అందువల్ల మ్యాట్ ఎంపిక చాలా ముఖ్యం. దానితో పాటు మ్యాట్ శుభ్రతపై కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది.


ఇవి కూడా చదవండి:

అమ్మాయి ప్రేమ నిజమో? అబద్ధమో? ఈ లక్షణాలతో కనిపెట్టయొచ్చు తెల్సా..!

ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 01:32 PM