Share News

Dogs-Health Risks: పెంపుడు కుక్కలను మీ బెడ్‌పై పడుకోనిస్తే డేంజర్‌ను ఆహ్వానించినట్టే..

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:34 PM

పెంపుడు జంతువులను తమ బెడ్స్‌పై పడుకోబెట్టుకునే వారికి నిద్రాభంగం కావడంతో పాటు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

Dogs-Health Risks: పెంపుడు కుక్కలను మీ బెడ్‌పై పడుకోనిస్తే డేంజర్‌ను ఆహ్వానించినట్టే..
Dog Sleeping In Bed Risks

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి పెంపుడు కుక్కలంటే అలవిమాలిన ప్రేమ. వాటిని ఏకంగా తమతో పాటు బెడ్‌పై పడుకోనిస్తారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైన విధానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రోగాల బారిన పడే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు (dog sleeping in bed risks).

మనుషులు నిద్రించే బెడ్స్‌పైకి పెంపుడు కుక్కలు, పిల్లులను ఆహ్వానిస్తే వాటి ఒంటిపై ఉండే పేలు, ఇతర పురుగులు పరుపుపైకి చేరతాయి. అరుదైన సందర్భాల్లో ఏకంగా బ్యాక్టీరియా, రింగ్ వార్మ్, టేప్ వార్మ్ వంటి పరాన్న జీవులు కూడా బెడ్‌పైకి చేరతాయి. జంతువుల మలమూత్రాల నుంచి ఇవి పరుపులు, బెడ్ షీట్స్‌పైకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ అనారోగ్యాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు (pet sleep hygiene).


జంతువుల నిద్ర సమయాలు, మనుషుల నిద్ర సమయాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి, జంతువులను మంచాలపైకి ఆహ్వానిస్తే మనుషుల నిద్ర చెదిరిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రంతా మెల్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, జంతువుల నిద్ర పాలీఫేసిక్ విధానంలో సాగుతుంది. అంటే, రాత్రి వేళల్లో వాటి నిద్ర పలు దశల్లో సాగుతుంది. మనుషుల్లాగా ఒకేసారి ఏడెనిమిది గంటల పాటు నిద్రపోకుండా అవి రాత్రిళ్లు పలుమార్లు మేల్కొని మళ్లీ కునుకులోకి జారుకుంటూ ఉంటాయి. ఫలితంగా జంతువుల వల్ల మనుషులకు నిద్రాభంగం కలిగే అవకాశం ఉంటుంది (zoonotic disease pets).

కాబట్టి, పెంపుడు జంతువులను తమ వద్దే పెట్టుకోవాలని అనుకునే వారు వాటి కోసం తమ పడకగదుల్లో మరో చిన్న పరుపు లాంటిది ఏర్పాటు చేయాలని జంతు నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే, ఒకటికి మించి పెంపుడు కుక్కలను పెంచుకునే వారికి రాత్రిళ్లు నిద్ర తక్కువ అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులు ఉన్న వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే అనవసర సమస్యలు దరి చేరవని సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

స్మార్ట్ ఫోన్ వ్యసనం వదుల్చుకునేందుకు పాటించాల్సిన టిప్స్

బంగారు నగలను ఇంట్లోనే ఎలా శుభ్రపరుచుకోవాలంటే..

Read Latest and Lifestyle News

Updated Date - Sep 25 , 2025 | 03:35 PM