Share News

Clean Gold Jewellery At Home: బంగారు నగలను ఇంట్లోనే ఎలా శుభ్రపరుచుకోవాలంటే..

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:02 AM

నగలు ఎల్లప్పుడూ మిలమిలలాడుతూ ఉండాలంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందుకోసం పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Clean Gold Jewellery At Home: బంగారు నగలను ఇంట్లోనే ఎలా శుభ్రపరుచుకోవాలంటే..
Gold Jewellery shine tips

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా కొన్న బంగారు నగలు మెరిసిపోతుంటాయి. కొన్నాళ్లు గడిచేటప్పటికీ నల్లబడి కాంతివిహీనంగా మారుతాయి. ఇలాంటి నగలను ఇంట్లోనే శుభ్రం చేసి మునుపటివలెనే కాంతులీనేలా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి (gold jewellery shine tips).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, నగలను క్రమం తప్పకుండా ఇంట్లోనే శుభ్రం చేసుకుంటూ ఉంటే అవి నల్లబడవు. సుతిమెత్తని వస్త్రంతో నగలను జాగ్రత్తగా శుభ్రపరిస్తే వెంటనే మునుపటి తళతళలను సంతరించుకుంటాయి. ఇలా చేసేటప్పుడు నగలపై వస్త్రాన్ని గట్టిగా ఒత్తి శుభ్రం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. సున్నితమైన నగలు ఇలా చేస్తే దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు (clean gold at home).

ఇక నగలపై మొండి మరకలను శుభ్రం చేసుకునేందుకు సుతిమెత్తని వస్త్రాన్ని సబ్బు నీళ్లల్లో ముంచి నగలను శుభ్రపరచాలి. ఇందుకోసం మైల్డ్ సోప్స్‌నే ఎంచుకోవాలి. మరక ఉన్న చోట రెండు మూడు సార్లు ఈ వస్త్రంతో జాగ్రత్తగా తుడిస్తే నగలు మునుపటిలా మిలమిలా మెరిసిపోతాయి (polish gold safely).


సాధారణంగా ఇళల్లో ఉండే సబ్బుతో నగలను శుభ్రం చేయొచ్చని కూడా చెబుతున్నారు. అయితే, సున్నితమైన సబ్బులనే ఇందుకోసం ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సబ్బు కలిపిన గోరు వెచ్చని నీటిలో సాధారణ బ్రష్ ముంచి సున్నితంగా నగలను రుద్దితే మొండిమరకలు కూడా వదిలిపోతాయి.

నగలను ఇంట్లో శుభ్రపరుచుకునేందుకు గోరువెచ్చని నీటినే వాడాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, నగలపై మురికిని వదిలించడం సులువవుతుంది. గోరువెచ్చని నీరు ఉన్న గిన్నెలో నగలను పెట్టి పది నిమిషాల తరువాత మెత్తని బ్రష్‌తో శుభ్రపరిస్తే మురికి మొత్తం వదిలిపోతుంది.

ఇంట్లో నగలను శుభ్రం చేసేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో అమోనియా లేదా బ్లీచ్ వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం సున్నితమైన ఖనిజమని, బంగారు నగలపై గట్టిగా రుద్దితే వాటి ఉపరితలంపై గీతలు పడి దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నగలను శుభ్రం చేసేందుకు మృదువైన లినెన్ వస్త్రాలను మాత్రమే వాడాలి. కళ్లద్దాలను శుభ్రపరిచే వస్త్రాలను కూడా ఎంచుకోవచ్చు. ఇక నగలపై తేమ ప్రభావం ఎక్కువ కాబట్టి, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న చోట్ల బంగారు నగలను భద్రతపరచకూడదు. తేమ వాతావరణంలో నగలు త్వరగా నల్లబడిపోతాయన్న విషయం మర్చిపోకూడదు. ఈ జాగ్రత్తలను తూచాతప్పకుండా పాటిస్తే నగలు ఎల్లప్పుడూ మిలమిలలాడుతూ ఉంటాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.


ఇవీ చదవండి:

స్మార్ట్ ఫోన్ వ్యసనం వదుల్చుకునేందుకు పాటించాల్సిన టిప్స్

భారత్‌కు వచ్చి తప్పు చేశా.. లైఫ్ దిగజారుతోంది.. టెకీ ఆవేదన

Read Latest and Lifestyle News

Updated Date - Sep 16 , 2025 | 11:39 AM