Vinayaka Chavithi 2025 Wishes: వినాయక చవితి స్పెషల్.. సోషల్ మీడియాలో మీ ప్రేమను ఇలా వ్యక్తపరచండి!
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:55 PM
ఈ డిజిటల్ యుగంలో మన బంధువులు, మిత్రులు ఎంత దూరంలో ఉన్నా సోషల్ మీడియాలో ద్వారా వారికి విష్ చేయవచ్చు. సో.. మీ కోసం కొన్ని ప్రత్యేకమైన వినాయక చవితి విషెష్‌ను అందిస్తున్నాం..
ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి హిందువుల ఆధ్యాత్మికతకు నిలిచే పవిత్రమైన పండుగ. ప్రతి ఏడాది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో మన బంధువులు, మిత్రులు ఎంత దూరంలో ఉన్నా, మన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా చెప్పవచ్చు. మీ కోసం కొన్ని ప్రత్యేకమైన వినాయక చవితి విషెష్‌ను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని మీరు మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేసి విష్ చేయవచ్చు.
వినాయక చవితి విషెష్
వినాయక చవితి శుభాకాంక్షలు 2025 (Happy Vinayaka Chavithi)
మీరు చేసే ప్రతి పని విజయవంతంగా సాగాలని.. ప్రతి అడుగూ గణేశుడి ఆశీర్వాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ.. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయకుడు మీ విఘ్నాలను తొలగించాలని.. జ్ఞానం, శ్రేయస్సు ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ గణపతి ఆశీస్సులతో మీరు అంచలంచలుగా ఎదగాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.
మీ ఇంట్లో ఆయురారోగ్యాలు, ఆనందం వెల్లివిరియాలని, మీ పిల్లలు చదువులో విజయం సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి.
మీ వ్యాపారాలు వృద్ధి చెందాలని... గణేశుని ఆశీస్సులతో అన్నీ విజయాలే లభించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ పండుగ మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ఈ వినాయక చవితి మీ జీవితంలో శుభారంభం కావాలని కోరుకుంటూ.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
సోషల్ మీడియాలో ఇలా షేర్ చేయండి:
వాట్సాప్ స్టేటస్‌గా ఈ మెసేజ్‌లు పెట్టవచ్చు.
ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టా పోస్ట్, స్టోరీస్, రీల్స్, వీడియో మెసేజ్‌లలో క్యాప్షన్‌గా వాడుకోవచ్చు.
Also Read:
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..
For More Devotional News