Share News

Daily Mouthwash Use: రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!

ABN , Publish Date - Nov 14 , 2025 | 07:42 AM

ప్రతిరోజూ మౌత్ వాష్‌ వాడటం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Daily Mouthwash Use: రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!
Daily Mouthwash Use

ఇంటర్నెట్ డెస్క్: మౌత్ వాష్ అనేది నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే ద్రవం. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, ఫ్లోరైడ్ లేదా ఫ్రెషనింగ్ ఆయిల్స్ వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. మౌత్ వాష్ బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కావిటీ ప్రొటెక్షన్ ఫ్లోరైడ్ మౌత్ వాష్‌లు కావిటీస్‌ను నివారించడంలో సహాయపడతాయి. అయితే, ప్రతిరోజూ మౌత్ వాష్‌ వాడటం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ విషయాలు తెలుసుకోండి

  • కొన్ని మౌత్ వాష్ లలో ఆల్కహాల్ ఉంటుంది, ఇది లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తుంది. నోటిని పొడిబారిస్తుంది

  • మన నోటిలో మంచి, చెడు బ్యాక్టీరియా రెండు కూడా ఉంటాయి. రోజూ మౌత్ వాష్ వాడటం వల్ల మంచి బ్యాక్టీరియా నశించే అవకాశం ఉంది.

  • మౌత్ వాష్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. అసలు సమస్య చిగుళ్ళు లేదా దంత సమస్య కావచ్చు.

  • మౌత్ వాష్‌ని అదే పనిగా ఉపయోగించడం వల్ల కొంత మందికి అలెర్జీ రావచ్చు.


ఎలా ఉపయోగించాలి?

  • డాక్టర్ సూచించిన సమయానికి మాత్రమే మౌత్ వాష్ వాడండి.

  • కేవలం 20 నుండి 30 సెకన్ల పాటు మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోండి. పోరపాటున కూడా దానిని మింగకండి.

  • చిన్న పిల్లలకు మౌత్ వాష్ ఇవ్వకండి.

  • ఆల్కహాల్ లేని మౌత్ వాష్ వాడటం మంచిది.


ఈ వార్తలు కూడా చదవండి..

శీతాకాలంలో ఈ పండ్లు తింటే చాలు

శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!

For More Health News

Updated Date - Nov 14 , 2025 | 07:50 AM