Beautiful Places in Nepal: నేపాల్‌లోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను మీరు చూశారా?
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:35 PM
నేపాల్ ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన దేశం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సేదతీరే ఈ దేశం ప్రతి సంవత్సరం వేలాది దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన దేశం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సేదతీరే ఈ దేశం ప్రతి సంవత్సరం వేలాది దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్వతాలు, దేవాలయాలు, సరస్సులు, అడవులు.. ఇవన్నీ నేపాల్ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. ఇక్కడి సహజ సౌందర్యం, సాంస్కృతిక సంపద ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మీరు కూడా నేపాల్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే కచ్చితంగా ఈ అందమైన ప్రాంతాలను చూసేయండి..
కాఠ్మండూ
నేపాల్ రాజధాని కాఠ్మండూ తన చారిత్రక దేవాలయాలు, బౌద్ధ స్తూపాలు, సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి. పశుపతినాథ్ ఆలయం, స్వయంభునాథ్ స్తూపం వంటి ప్రదేశాలు ప్రతి సందర్శకుడు తప్పక చూడాల్సినవి.
పోఖరా
పోఖరా నేపాల్‌లోని అతి అందమైన నగరాలలో ఒకటి. అన్నపూర్ణ పర్వత శ్రేణి దృశ్యం, ఫేవా సరస్సులో బోటు యాత్ర, సూర్యాస్తమయం సమయంలో కనిపించే సుందర దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

లుంబిని
బుద్ధుడు జన్మించిన స్థలం లుంబిని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులకు పవిత్ర స్థలం. ఇక్కడి మఠాలు, విగ్రహాలు, మ్యూజియాలు చారిత్రక ప్రాధాన్యతను చూపిస్తాయి.
చిత్వాన్ నేషనల్ పార్క్
ప్రకృతిని ప్రేమించే వారికి చిత్వాన్ నేషనల్ పార్క్ బాగా నచ్చుతుంది. ఇక్కడ ఏనుగులు, పులులు, పక్షులు వంటి అనేక వన్యప్రాణులను చూడవచ్చు.

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రతి అడ్వెంచర్ ప్రియుడు చూడాలనుకుంటాడు. హైకింగ్, ట్రెక్కింగ్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ఫ్లేస్. నేపాల్ పర్యటన ఒక ప్రత్యేక అనుభవం. ఆధ్యాత్మికత, సాహసం, సహజసౌందర్యం ప్రపంచ పర్యాటకులకు ఎప్పుడూ ఆహ్వాన పూర్వకంగా ఉంటుంది.
Also Read:
పండ్లు తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదో తెలుసా?
ఒంటరిగా ఉన్నప్పుడు ఈ నాలుగు పనులు చేయడం మంచిది
For More Latest News