Best Christmas markets 2025: ప్రపంచంలోనే టాప్ క్రిస్మస్ షాపింగ్ డెస్టినేషన్స్ ఇవే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:29 AM
క్రిస్మస్ మార్కెట్లను లక్షలాది మంది సందర్శిస్తారు. విండో షాపింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రిస్మస్ మార్కెట్లు ఏవో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ పండుగ దగ్గర పడుతోంది. డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంబరాలు చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, కరోల్స్, పండుగ భోజనాలంటూ అందరూ ఈ పండుగను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా క్రిస్మస్ మార్కెట్లు కూడా ఉంటాయి.
క్రిస్మస్ అలంకరణ వస్తువులు, బహుమతులు, ఆహారం, వేడి పానీయాలు అమ్ముతారు. ఇవి పండుగ వాతావరణాన్ని అందిస్తాయి. భారతదేశంలోని ఢిల్లీ, ముంబైతో సహా ప్రపంచవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా యూరప్‌లో క్రిస్మస్ మార్కెట్లు చాలా ప్రసిద్ధి చెందాయి. క్రిస్మస్ మార్కెట్లను లక్షలాది మంది సందర్శిస్తారు. మీరు కూడా ఈ క్రిస్మస్‌కి విండో షాపింగ్ చేయాలనుకుంటే, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రిస్మస్ మార్కెట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూయార్క్:
క్రిస్మస్ సమయంలో న్యూయార్క్ నగరం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫిఫ్త్ అవెన్యూలోని మెరిసే విండో డిస్‌ప్లేలు, రాక్‌ఫెల్లర్ సెంటర్ ట్రీ, బ్రయంట్ పార్క్ వింటర్ విలేజ్, సెంట్రల్ పార్క్ స్కేటింగ్ వంటివి చూసి ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో మునిగిపోతారు. నగరం అంతటా పండుగ అలంకరణలు, ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఇది ఒక మ్యాజికల్ అనుభూతినిస్తుంది.

ఫ్రాంక్‌ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్
ఫ్రాంక్‌ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్ (Frankfurter Weihnachtsmarkt) జర్మనీలోని అతి పురాతనమైన, అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్‌లలో ఒకటి. ఇది నవంబర్ చివరి నుండి డిసెంబర్ 22 వరకు రోమెర్‌బర్గ్ (Römerberg) వంటి నగరంలోని ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. ఇక్కడ అలంకరించబడిన చెట్లు, చేతివృత్తుల వస్తువులు, సాంప్రదాయ ఆహారాలు లభిస్తాయి. ఇది మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.

రోవానీమి
రోవానీమి (Rovaniemi) ఫిన్లాండ్‌లోని లాప్లాండ్ ప్రాంతానికి రాజధాని. ఇది ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఒక మాయా నగరం. శాంటా క్లాజ్ అధికారిక నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సంవత్సరం పొడవునా శాంటా క్లాజ్ విలేజ్‌ను సందర్శించవచ్చు. అలాగే నార్తర్న్ లైట్స్ చూడటం, స్నోమొబైల్, రెయిన్‌డీర్ స్లెడ్ రైడ్స్ వంటి ఆర్కిటిక్ అడ్వెంచర్‌లను ఆస్వాదించవచ్చు.

(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News