Share News

Metro Stations: బీ కేర్ ఫుల్.. ఈ మెట్రో స్టేషన్లలో ప్రత్యేక నిబంధనలు..

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:49 PM

ఢిల్లీ మెట్రో దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక మెట్రో నెట్‌వర్క్. ఇది మీకు సౌకర్యవంతమైన, ఆర్థిక ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ..

Metro Stations: బీ కేర్ ఫుల్.. ఈ మెట్రో స్టేషన్లలో ప్రత్యేక నిబంధనలు..
Delhi Metro

ఇంటర్నెట్ డెస్క్‌: ఢిల్లీ మెట్రో దేశంలోనే అతిపెద్ద, ఆధునిక మెట్రో నెట్‌వర్క్. ఇది వాహనాల రద్దీ లేకుండా, చల్లగా, సురక్షితంగా ప్రయాణించాలనుకునే వారికి మంచి ఎంపిక. అయితే, ఇందులో కొన్ని మెట్రో స్టేషన్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని శంకర్ విహార్, సదర్ బజార్ కాంట్ అనే రెండు స్టేషన్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ స్టేషన్లు సైనిక ప్రాంతాల్లో (కాంటోన్‌మెంట్) వస్తాయి. అందుకే ఇక్కడ దిగాలంటే ప్రత్యేక గుర్తింపు కార్డు (ID Proof) తప్పనిసరిగా ఉండాలి.


ID లేకపోతే ఏమవుతుంది?

మీ వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు లేకుండా ఈ స్టేషన్లలో దిగితే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మీరు ఎవరో తెలుసుకోవడానికి ID అడుగుతారు. అది చూపించలేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రోలోని శంకర్ విహార్, సదర్ బజార్ కాంట్ అనే రెండు స్టేషన్లు రక్షణ, సైనిక ప్రాంతాల్లో ఉన్నందున, భద్రతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నిబంధనలు పెట్టారు. మిగతా మెట్రో స్టేషన్లలో మాత్రం ఎలాంటి పరిమితులు లేవు.


ప్రత్యేక స్టేషన్ల వివరాలు:

  • శంకర్ విహార్ మెట్రో స్టేషన్ – మెజెంటా లైన్‌లో ఉంది

  • సదర్ బజార్ కాంట్ మెట్రో స్టేషన్ – రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది

మీరు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేటప్పుడు ఈ రెండు స్టేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే, మీ దగ్గర గుర్తింపు కార్డు ఉంటేనే అక్కడ దిగాలని గుర్తుంచుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.


Also Read:

పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్.. మహాదేవ్ పర్వతాల్లో మూసాను ఎలా మట్టుబెట్టారంటే..

వినే ధైర్యం లేకుంటే ఆ పదవికి అర్హులు కారు.. మోదీపై ఖర్గే విమర్శలు

For More National News

Updated Date - Jul 29 , 2025 | 06:51 PM