IRCTC Thailand Package: థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ ఆఫర్..
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:24 PM
మీరు థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC మీకు స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. కేవలం అతి తక్కవ ఖర్చుతో మీరు థాయిలాండ్ ట్రిప్ ఎంజాయి చేసే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలం.. పైగా దసరా సెలవులు.. ఈ సీజన్‌లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది, వాన చినుకులతో పచ్చదనం పెరుగుతుంది, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తాయి, పరిసరాలు చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఈ సమయంలో థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తే సూపర్‌గా ఉంటుంది.
అందమైన ద్వీపాలు, తెల్లని ఇసుక బీచ్‌లు, పచ్చని అడవులు, ఎత్తైన పర్వతాలు, అద్భుతమైన బౌద్ధ దేవాలయాలు, ప్రత్యేకమైన సంస్కృతి, రుచికరమైన ఆహారం చాలా బాగుంటుంది. మీరు కూడా థాయిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే, IRCTC (Indian Railway Catering and Tourism Corporation) తక్కువ బడ్జెట్‌తో థాయిలాండ్‌ను చూసే అవకాశం కల్పిస్తోంది. సో లేట్ చేయకుండా IRCTC అందిస్తున్న ఆ స్పెషల్ ప్యాకేజీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
థాయిలాండ్ టూర్ ప్యాకేజీ వివరాలు:
ప్రయాణ విధానం : విమానం
విమాన గమ్యస్థానం: చెన్నై టూ బ్యాంకాక్
ప్రయాణ తేదీ: 1-10-2025
తిరిగి వచ్చే తేదీ: 4.10.2025
వ్యవధి: 4 రోజులు / 3 రాత్రులు
వసతి: హోటల్‌లో ఉచితంగా ఉండే సదుపాయం
ఆహారం: డైలీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్
సైట్ సీయింగ్: బ్యాంకాక్, పట్టాయా లాంటి ప్రముఖ నగరాల్లో సందర్శన
దరఖాస్తు ధర: ఒక వ్యక్తికి రూ. 49,500 (గ్రూప్ బుకింగ్ అయితే ధర తగ్గుతుంది)
ఈ ప్యాకేజీ ద్వారా మీరు థాయిలాండ్‌కు సులభంగా, తక్కువ ఖర్చుతో, స్ట్రెస్ లేకుండా ట్రావెల్ చేయవచ్చు. ఫ్లైట్, హోటల్, భోజనం, అన్నీ కలిపి ఒకే ప్యాకేజీలో ఆల్ ఇన్ వన్‌గా IRCTC మీకు థాయిలాండ్ ట్రిప్ అవకాశం కల్పిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఫ్రెండ్స్‌తో థాయిలాండ్‌కు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకోండి.
ఎలా బుక్ చేసుకోవాలి?
థాయిలాండ్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి, మీరు irctc.tourism.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
Also Read:
ఉత్తరప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నాం: ప్రధాని మోదీ
For More Latest News