Ancient Indian Monuments: ఈ అద్భుతమైన పురాతనమైన భవనాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి..
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:33 PM
భారతదేశంలో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశం పురాతన వాస్తుశిల్పం, వారసత్వానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో 1,000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక చారిత్రక కట్టడాలు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా అంతే అద్భుతంగా అలానే ఉన్నాయి. ఈ భవనాలు మన పూర్వీకుల కళ, వాస్తుశిల్పం, సంస్కృతిని గుర్తుచేస్తున్నాయి. నేటికీ అందంగా ఉన్న అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాంచి స్థూపం
3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన సాంచి స్థూపం ప్రపంచంలోనే పురాతన, ప్రసిద్ధ బౌద్ధ స్మారకాల్లో ఒకటి. ఇందులో బుద్ధుని అవశేషాలు ఉన్నాయని చెబుతారు. నాలుగు వైపులా ఉన్న అందమైన రాతి శిల్పాలు, తోరణాలు ఈ స్థూపాన్ని ఇంకా ఆకర్షణీయంగా మారుస్తాయి.

మహాబలిపురం టెంపుల్
తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవ రాజు నరసింహవర్మన్ 8వ శతాబ్దంలో నిర్మించాడు. సముద్ర తీరాన ఉన్న ఈ దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ.
కైలాస ఆలయం
ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు. ఒకే రాతిని పై నుంచి కిందికి చెక్కి నిర్మించిన ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. దాని శిల్పకళ, నిర్మాణ శైలి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది.

కోణార్క్ సూర్య దేవాలయం
1250 ADలో రాజు నరసింహ దేవ I నిర్మించిన ఈ దేవాలయం ఒక భారీ రథం ఆకారంలో ఉంటుంది. 7 గుర్రాలు, 24 చక్రాలతో నిర్మించిన ఈ రథం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది.

Also Read:
ఈ సమస్యలతో బాధపడేవారు బాదం తినకపోవడం బెటర్
బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో ఈ పండు తింటే అద్భుతమైన ఫలితాలు.. !
For More Latest News