Bus Travel Safety Tips: బస్సు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి?
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:22 PM
ప్రతిరోజూ వేలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇది సౌకర్యవంతమైనదే అయినా, కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ వేలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇది సౌకర్యవంతమైనదే అయినా, కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి బస్సు ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం. బస్సు ఎక్కే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం..

బస్సు ఎక్కే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అధికారికంగా అనుమతి పొందిన బస్సులను మాత్రమే ఎంచుకోండి.
ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రిజిస్ట్రేషన్, లైసెన్స్ వివరాలు చెక్ చేయండి.
డ్రైవర్ స్థితిని గమనించండి. మత్తులో ఉన్నట్లు లేదా అలసటగా కనిపిస్తే ఆ బస్సులో ప్రయాణం చేయకండి.
సీటు బెల్ట్ ఉంటే తప్పక పెట్టుకోండి.
ముఖ్యంగా లాంగ్ రూట్ బస్సుల్లో సేఫ్టీ బెల్ట్ ఉపయోగించడం చాలా అవసరం.
ప్రమాదకర వస్తువులు గ్యాస్ సిలిండర్లు, కెమికల్స్ మొదలైనవి ఎట్టి పరిస్థితిలోనూ తీసుకెళ్లకండి.
బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే దాని వైపు వెళ్లండి. కదులుతున్న బస్సు ఎక్కడానికి అస్సలు ప్రయత్నించవద్దు.

ప్రయాణ సమయంలో జాగ్రత్తలు:
అత్యవసర ద్వారం (Emergency Exit) ఎక్కడుందో ముందుగా తెలుసుకోండి.
చాలా వేగంగా లేదా నిలబడి ప్రయాణం చేయవద్దు.
రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి నిద్రపోవద్దు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితిలో స్పందించడానికి కష్టమవుతుంది.
బిగ్గరగా సెల్ ఫోన్‌లలో సంగీతం పెట్టుకోవడం లేదా పెద్దగా మాట్లాడటం వంటివి చేయకండి. ఎందుకంటే, డ్రైవర్ దృష్టి మరలే అవకాశం ఉంటుంది.
మీ తల, చేతులను కిటికీ వెలుపలకి చాచకండి.
మీ వస్తువులను ఇతరుల సీట్లపై ఉంచకండి. సహ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా వారి వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి.

ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి?
ఉన్నట్టుండి బస్సులో ప్రమాదం జరగడం లేదా మంటలు చెలరేగితే వెంటనే బట్టతో ముఖం కప్పుకోండి. ఇలా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
ఎమర్జెన్సీ విండో లేదా కిటికీ ద్వారా బయటకు వెళ్లడానికి ట్రై చేయండి.
వీలైతే ఇతర ప్రయాణికులకు సహాయం చేయండి.
పోలీసులకు, 108 అంబులెన్స్ సేవలకు తక్షణమే సమాచారమివ్వండి.

Also Read:
తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు..
అదే తేలితే చర్యలు తప్పవు.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు సీఎం వార్నింగ్
For More Latest News