CM Chandrababu Warning: అదే తేలితే చర్యలు తప్పవు.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు సీఎం వార్నింగ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:08 AM
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ , పర్మిట్ తనిఖీలకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
అమరావతి, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ , పర్మిట్ తనిఖీలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని జిల్లాల్లో బస్సుల్లో సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆర్డర్స్ పాస్ చేశారు సీఎం. ప్రమాదానికి కారణం.. నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు తప్పవని ట్రావెల్స్ బస్సు యాజమాన్యానికి సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని సీఎంకు తెలియజేశారు మంత్రి. అలాగే ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రజల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
Read Latest AP News And Telugu News