Cheapest Countries to Visit: భారతీయులకు బెస్ట్ బడ్జెట్ దేశాలు ఇవే!
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:33 PM
ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు కొన్ని ఉన్నాయి. భారతీయులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలు ఇప్పుడు బడ్జెట్ ట్రావెల్ డెస్టినేషన్స్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి, సరైన ప్లానింగ్ ఉంటే 20 వేల నుంచి 70 వేల రూపాయల లోపే ఒక వారం పాటు విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా భారతీయులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలు ఇప్పుడు బడ్జెట్ ట్రావెల్ డెస్టినేషన్స్‌గా మారాయి. అవేంటో, ఒక్కో దేశానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
వియత్నాం
ఇటీవల కాలంలో వియత్నాం విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. హోటల్స్, ఫుడ్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అన్నీ కూడా తక్కువ ధరకే లభిస్తాయి. వియత్నాంలో ఒక వారం గడపాలంటే సుమారు రూ. 45,000 – 70,000 సరిపోతాయి.

నేపాల్
భారతీయులకు అత్యంత సులభంగా వెళ్లగల విదేశీ దేశాల్లో నేపాల్ ముందుంటుంది. ఇక్కడికి వెళ్లేందుకు పాస్‌పోర్ట్, వీసా అవసరం లేదు. ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలతో నేపాల్ యాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఒక వారం పాటు నేపాల్‌లో తిరగడానికి రూ. 20,000 – 30,000 మధ్యలోనే ఖర్చవుతుంది.
శ్రీలంక
భారతదేశానికి అతి సమీపంలో ఉన్న శ్రీలంక కూడా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. విమాన టికెట్లు, లోకల్ ట్రావెల్ తక్కువ ఖర్చుతోనే లభిస్తాయి. కొలంబో, గాలే, క్యాండీ వంటి పర్యాటక ప్రాంతాలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. శ్రీలంకలో ఒక వారం పర్యటనకు సుమారు రూ. 35,000 – 55,000 ఖర్చవుతుంది.

మయన్మార్
ప్రాచీన దేవాలయాలు, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్‌తో మయన్మార్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ జీవన వ్యయం తక్కువగా ఉండటం వల్ల, బడ్జెట్ ట్రావెలర్స్‌కు ఇది అద్భుతమైన గమ్యస్థానం. మయన్మార్‌లో ఒక వారం తిరగడానికి సుమారు రూ. 40,000 – 55,000 సరిపోతాయి.
భూటాన్
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా భూటాన్‌ను పేర్కొంటారు. సహజ అందాలు, ప్రశాంత వాతావరణం ఈ దేశానికి ప్రత్యేకత. ఇక్కడికి భారతీయులకు వీసా అవసరం లేదు, అందుకే ఖర్చు మరింత తగ్గుతుంది. రూ. 40,000 – 65,000 లోపే ఖర్చు అవుతుంది.
NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News