Rain Driving Safety Tips: వర్షాకాలంలో తారాస్థాయికి రోడ్డు ప్రమాదాలు.. ఇలా చేస్తే వాహనదారులు సేఫ్..
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:56 PM
వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉండటం, బురద కారణంగా రోడ్లు జారుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉండటం, బురద కారణంగా రోడ్లు జారుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
చలికాలం, ఎండాకాలాల్లో కంటే వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షాకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతూ పోతోంది. వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉండటం, బురద కారణంగా రోడ్లు జారుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వర్షాకాలంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఈ 10 టిప్స్ పాటిస్తే చాలు మీరు సేఫ్ అయినట్లే..
సురక్షిత ప్రయాణం కోసం 10 టిప్స్..
1) వర్షం పడుతున్న సమయంలో మీరు బయటకు వెళ్లటం అంత ముఖ్యం కాకపోతే.. వర్షం తగ్గే వరకు ఆగటం మంచిది. అవసరం లేకపోతే బయటకు రాకపోవటం ఉత్తమం.
2) వర్షాకాలంలో వాహనాల ఆరోగ్యాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకోవటం మంచిది. టైర్లు, హెడ్‌లైట్స్, బ్రేకులను రోడ్డుపైకి అడుగుపెడుతున్నపుడే చెక్ చేసుకోవాలి. టైర్ల గ్రిప్పులు అరిగిపోయి ఉంటే కొత్త వాటిని రీప్లేస్ చేసుకోవటం మంచిది.
3) వర్షం పడుతున్నపుడు వాహనాలను నెమ్మదిగా నడపాలి. సాధారణం కంటే మరింత నెమ్మదిగా వాహనాలు నడపటం చాలా ముఖ్యం.
4) బైకులపై ప్రయాణం చేయాలనుకునే వారు వైపర్ ఉన్న హెల్మెట్ వాడటం మంచిది.
5) వాహనానికి, వాహనానికి మధ్య వీలైనంత ఎక్కువ దూరాన్ని పాటించండి.
6) హెడ్ లైట్స్ ఆన్ చేసి పెట్టుకోండి. వెలుతురు తక్కువగా ఉన్నపుడు హెడ్ లైట్స్ వెలుతురులో మార్గం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
7) వర్షం పడుతున్నపుడు రోడ్లపై చాలా జాగ్రత్తగా వాహనాలను నడపాలి. మరీ ముఖ్యంగా బ్రేకులు వేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా కాకుండా, స్లోగా బ్రేకులు వేయాలి.
8) రోడ్డుపై మీ కారు హైడ్రో ప్లేన్‌కు గురైతే వెంటనే యాగ్జిలరేటర్ మీదనుంచి కాలును పక్కకు తీసేయండి. వెంటనే కారు ఎటువైపు వెళ్లాలో అటు వైపు స్టీరింగ్‌ను మళ్లించాలి.
9) ఓ వైపు వాహనాన్ని నడుపుతూనే.. మరో వైపు రోడ్డుపై ఉన్న నీటిని కూడా ఓ కంట గమనిస్తూ ఉండాలి. రోడ్డు కనిపిస్తున్నట్లు ఉన్న వైపు మాత్రమే వాహనాన్ని నడపాలి.
10) ఎంత సేఫ్‌గా డ్రైవింగ్ చేసినా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే, సేఫ్ డ్రైవింగ్ కారణంగా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.
ఇవి కూడా చదవండి
మనిషి చెయ్యిని బయటకు కక్కిన షార్క్.. మర్డర్ మిస్టరీ సాల్వ్..
గోధుమ లేదా జొన్న రోటీ.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?