Share News

Shark Vomits Human Arm: మనిషి చెయ్యిని బయటకు కక్కిన షార్క్.. మర్డర్ మిస్టరీ సాల్వ్..

ABN , Publish Date - Aug 28 , 2025 | 04:58 PM

హోమ్స్ అనే వ్యక్తితో కలిసి జిమ్మీ నేరాలకు పాల్పడేవాడు. ఇన్సురెన్స్ మోసం విషయంలో ఇద్దరికీ నష్టం వచ్చింది. ఇక అప్పటినుంచి జిమ్మీ, హోమ్స్‌ను భయపెడుతూ ఉండేవాడు. దీన్ని బ్రాడీ అవకాశంగా తీసుకున్నాడు.

Shark Vomits Human Arm: మనిషి చెయ్యిని బయటకు కక్కిన షార్క్.. మర్డర్ మిస్టరీ సాల్వ్..
Shark Vomits Human Arm

90 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మతిపోగొట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ షార్క్ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసింది. ఆ మర్డర్ కేసును చరిత్రలో మిగిలిపోయే కేసుగా మార్చేసింది. ఇంతకీ సంగతేంటంటే. 1920-30 మధ్య కాలంలో బెర్ట్ హోబ్సన్ అనే మత్స్యకారుడు కూగే బీచ్‌లో నాలుగు మీటర్ల పొడవైన టైగర్ షార్క్‌ను ప్రాణాలతో పట్టుకున్నాడు. దాన్ని బీచు దగ్గర ఉండే అక్వేరియంలో ఉంచాడు. ఆ షార్క్‌ను చూడ్డానికి పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. ఈ నేపథ్యంలో ఓ రోజు అది ఓ ఎలుకను బయటకు కక్కింది. కొద్దిసేపటి తర్వాత ఓ పక్షిని బయటకు కక్కింది.


ఆ తర్వాత మనిషి చెయ్యిని బయటకు కక్కింది. షార్క్ మనిషి చెయ్యిని బయటకు కక్కటం చూసి జనం షాక్ అయ్యారు. ఆ అక్వేరియంలో పని చేసే చార్లెస్ హోబ్సన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చి చెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. షార్క్ మనిషిపై దాడి చేసి ఉంటుందని, ఆ సమయంలోనే చెయ్యిని మింగేసి ఉంటుందని పోలీసులు భావించారు. ఆ చెయ్యి మణికట్టుకు తాడు కట్టి ఉంది. ముంచేయిపై ఓ ట్యాటూ ఉంది. ఇద్దరు బాక్సర్లు ఫైట్ చేసుకుంటున్న ట్యాటూ అది. సాధారణంగా అయితే, షార్క్ కడుపులోని యాసిడ్ల కారణంగా మనిషి చర్మం మొత్తం చాలా వరకు పాడవుతుంది.


ఆ చెయ్యి షార్క్ కడుపులో 8 నుంచి 18 రోజులు మాత్రమే ఉంది. దీంతో పెద్దగా అది పాడవ్వలేదు. ట్యాటూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ ట్యాటూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. అది జిమ్మీ స్మిత్ అనే నేరస్తుడిదని తెలిసింది. అతడు 8 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. పోలీసులు జిమ్మీ ఎలా చనిపోయాడో దర్యాప్తు మొదలెట్టారు. జిమ్మీ చివరి సారిగా తన మిత్రుడు పాట్రిక్ బ్రాడీతో మందు కొడుతూ జనాలకు కనిపించాడు. పోలీసులు బ్రాడీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.


హోమ్స్ అనే వ్యక్తితో కలిసి జిమ్మీ నేరాలకు పాల్పడేవాడు. ఇన్సురెన్స్ మోసం విషయంలో ఇద్దరికీ నష్టం వచ్చింది. ఇక అప్పటినుంచి జిమ్మీ, హోమ్స్‌ను భయపెడుతూ ఉండేవాడు. దీన్ని బ్రాడీ అవకాశంగా తీసుకున్నాడు. జిమ్మీని చంపేశాడు. ట్యాటూ ఉన్న చెయ్యిని మాత్రం తీసుకుని హోమ్స్ దగ్గరకు వెళ్లాడు. ‘నేను జిమ్మీని చంపేశాను. ఇది అతడి చెయ్యి. నువ్వు నాకు 500 డాలర్లు ఇస్తే వెళ్లిపోతా. లేదంటే మీ ఇద్దరి విషయం బయటపెడతా’ అని బెదిరించాడు. హోమ్స్ 500 డాలర్లు ఇచ్చి అతడ్ని పంపేశాడు. బ్రాడీ నేరుగా సముద్రం దగ్గరకు వెళ్లి చెయ్యిని సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడ్డ చెయ్యిని షార్క్ మింగేసింది. అక్వేరియమ్‌లో ఉన్నపుడు బయటకు కక్కింది. అలా బ్రాడీ అడ్డంగా దొరికిపోయాడు.


ఇవి కూడా చదవండి

గోధుమ లేదా జొన్న రోటీ.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

త్వరలో EPFO 3.0 ప్రారంభం.. దీని స్పెషల్ ఏంటంటే

Updated Date - Aug 28 , 2025 | 05:05 PM