Clothes Stain Removal Tips: బట్టలపై మరకలను ఇలా తొలగించండి
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:05 PM
తెల్ల బట్టల మీద అప్పుడప్పుడు మరకలు పడడం సాధారణం. కానీ, ఈ మరకలను తొలగించడం చాలా కష్టం. అయితే, సింపుల్ చిట్కాతో బట్టల మీద మరకలను తొలగించుకోవచ్చు..
ఇంటర్నెట్ డెస్క్: బట్టలపై మరకలు పడటం సహజం, వాటిని తొలగించడానికి అనేక సులభమైన పద్ధతులు ఉన్నాయి. మొండి మరకలను తొలగించడానికి, మరక రకాన్ని బట్టి నిమ్మరసం, ఉప్పు, వెనిగర్, డిష్ సోప్, బేకింగ్ సోడా వంటివి ఉపయోగించవచ్చు. సరైన పద్ధతిని ఎంచుకొని, జాగ్రత్తగా ఉతకడం ద్వారా బట్టలపై మరకలను పోగొట్టవచ్చు.
అయితే, బాగా ఇష్టమైన తెల్ల బట్టలపై మరకలు పడితే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ మరకలు అంత ఈజీగా పోవు. కానీ, ఓ సింపుట్ చిట్కాతో పసుపు మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు. కాస్టిక్ సోడా చాలా చవక గానే దొరుకుతుంది. తెల్లని దుస్తులని నిమిషంలో మెరిసేలా ఈ సోడా సహాయపడుతుంది.
కాస్టిక్ సోడాతో బట్టలు తెల్లగా వచ్చేస్తాయి. పసుపు రంగు మరకలు అన్నీ పోతాయి. బకెట్ నీళ్లల్లో వాషింగ్ పౌడర్ అవసరమైనంత వేయండి. రెండు చెంచాల కాస్టిక్ సోడా వేసి బాగా కలపండి. దీనిలో బట్టలును ముంచేసి 3 గంటల పాటు అలానే వదిలేయండి. తర్వాత బట్టల్ని ఒకసారి జాడించండి. బట్టలు కొత్త వాటిలా మెరిసిపోతాయి. పసుపు రంగు మరకలు వంటివి పోతాయి. ఇలా ఈజీగా మీరు బట్టల్ని మళ్లీ తెల్లగా వచ్చేలా మార్చుకోవచ్చు.
Also Read:
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ నీరు తాగితే వెంటనే ఉపశమనం!
For More Latest News