Sleep Talking : నిద్రలో మాట్లాడే అలవాటు.. కారణం ఇదేనా?
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:11 PM
చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు ఎందుకు ఉంటుంది? దీనికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: నిద్రలో మాట్లాడటం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ నిద్ర సంబంధిత అలవాటు. దీన్ని వైద్యపరంగా సోమ్నిలోక్వీ (Somniloquy) అని అంటారు. అయితే, నిద్రలో ఎందుకు మాట్లాడతారు? దీనికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలో మాట్లాడటం అనేది మానిషి పూర్తిగా అవగాహన కోల్పోయిన స్థితిలో ఉండగా జరిగే అస్పష్టమైన ప్రక్రియ. అర్థం లేనట్లుగా మాట్లాడతారు. కొన్నిసార్లు మనసులో ఉన్న ఆలోచనలు, కలల ద్వారా బయటకు రావచ్చు.
ఎందుకు ఇలా జరుగుతుంది?
నిద్రలో మాట్లాడటానికి స్పష్టమైన ఒక్కటే కారణం లేకపోయినా, ఈ క్రింది అంశాలు ప్రధానంగా ఉండవచ్చు.
మానసిక ఒత్తిడి (Stress): రోజు ఒత్తిడికి లోనయ్యే వారు చాలా వరకు నిద్రలో మాట్లాడటం సాధారణం.
నిద్ర లోపాలు (Sleep Deprivation): సరిగా నిద్రపోకపోవడం వల్ల నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం, మాట్లడటం.
కొన్నిసార్లు కలల కారణంగా భయంతో మాట్లాడటం.
జెనిటిక్స్ (Genetics): కుటుంబంలో ఎవరికైన నిద్రలో మాట్లాడే అలవాటు ఉండటం.
తినే మందులు లేదా మత్తు పదార్థాలు: కొన్ని మందుల ప్రభావం వల్ల నిద్రలో అసాధారణ ప్రవర్తన కనబడుతుంది.
మానసిక సమస్యలు: డిప్రెషన్, ఆంగ్జయటి వంటి సమస్యల వల్ల కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఎక్కువగా జరుగుతుంది?
చిన్న పిల్లలలో (5–12 సంవత్సరాలు మధ్య) ఇది ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందిలో ఇది వయస్సుతో తగ్గిపోతుంది, కానీ కొందరికి పెద్దవారైనా కొనసాగవచ్చు.
ఈ అలవాటు హానికరమా?
అందరూ మాట్లాడే స్థాయి భిన్నంగా ఉంటుంది. చాలామందిలో ఇది సాధారణంగా ఉంటుంది. కానీ, నిద్రలో మాటలతో పాటు అరుపులు ఉంటే, నిద్రలేమి కారణంగా మీ రోజువారీ జీవితం దెబ్బతింటుంటే, ఇతర నిద్ర సమస్యలతో (నిద్రలో నడవటం, ఊపిరి ఆగిపోవటం) ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
నిద్రలో మాట్లాడటం ఎక్కువగా హానికరం కాదు. కానీ అది తరచూ జరుగుతుంటే లేదా ఇతర సమస్యలతో కలిపి ఉంటే, దానిపై దృష్టి పెట్టడం మంచిది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ప్రముఖ యూనివర్సిటీ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
సీబీఐపై షర్మిల షాకింగ్ కామెంట్స్..
For More Latest News