Share News

Fruits And Vegetables Storage Tips: ఇంట్లో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి.!

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:35 PM

చాలా మంది మార్కెట్ నుండి వారానికి సరిపడ పండ్లు, కూరగాయలను ఒకేసారి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అయితే, వీటిని ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Fruits And Vegetables Storage Tips: ఇంట్లో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి.!
Fruits And Vegetables Storage Tips

ఇంటర్నెట్ డెస్క్: పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టేస్తే చాలాకాలం తాజాగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి, ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కానీ, వాటి సహజ సువాసన, ఫ్రెష్‌నెస్ కొంత తగ్గిపోతుంది. కాబట్టి.. కూరగాయలు, పండ్లు సహజంగా తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.


వేర్వేరుగా ఉంచండి

పండ్లు, కూరగాయలను వేర్వేరుగా ఉంచడం ముఖ్యం. ఎందుకంటే కొన్ని పండ్లు (ఉదా: అరటిపండ్లు, జామపండ్లు, అవకాడో) విడుదల చేసే ఇథిలీన్ వాయువు (ethylene gas) ఇతర పండ్లు, కూరగాయలు త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది లేదా చెడిపోయేలా చేస్తుంది. పండ్లను, కూరగాయలను వాటి స్వభావానికి తగినట్లుగా, గాలి బాగా వచ్చే చోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సరైన ఉష్ణోగ్రతలో వాటిని పెట్టడం వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా చెడిపోకుండా ఉంటాయి.


కొన్న వెంటనే కడగకండి

పండ్లు, కూరగాయలను కొన్న వెంటనే కడగకూడదు, ఎందుకంటే కడిగిన తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి అవి త్వరగా పాడైపోతాయి. వాటిని తినడానికి లేదా ఉపయోగించడానికి సిద్ధం చేసే ముందు మాత్రమే కడగాలి, అప్పుడు వాటిపై ఉన్న ధూళి, రసాయనలు తొలగిపోతాయి.

చెక్ చేయండి

రోజుకు ఒకసారి పండ్లు, కూరగాయలను చెక్ చేయండి. ఎందుకంటే, ఒక పండు లేదా కూరగాయ చెడిపోతే, మిగతావి కూడా చెడిపోతాయి. కాబట్టి, చెడిపోయిన వాటిని వెంటనే తీసి బయట పారవేయండి. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.


Also Read:

లావు ఉన్న వారికి నిమ్మ తొక్కలు ఓ వరం.. ఎలా అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

For More Latest News

Updated Date - Nov 01 , 2025 | 04:37 PM