Samantha's Wedding Look Decoded: సమంత పెళ్లి లుక్ ఫొటోలు.. వస్త్రధారణపై డిజైనర్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:32 PM
సమంత - రాజ్.. ఎక్కడ చూసిన ప్రస్తుతం ఈ నవ వధూవరుల గురించే చర్చంతా. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వీరి గురించి రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక, వివాహ సమయంలో ఆమె ధరించిన వస్త్రధారణ గురించి డిజైనర్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: హీరోయిన్ సమంత(Samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఈనెల 1న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇప్పుడు సోషల్ మీడియాను దుమ్మురేపుతున్నారు. కోయంబత్తూరులో ఆమె వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత.. డిజైనర్ అర్పితా మెహతా సమంత ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. పెళ్లి సమయంలో సమంత ధరించిన కస్టమ్ మేడ్ బెనారస్ చీరను గురించి ప్రత్యేకంగా పొగిడారామె. ఈ సందర్భంగా.. ఆమె పెళ్లికి సహకరించిన కళాకారులందరికీ అర్పిత కృతజ్ఞతలు తెలిపారు.
'కస్టమ్ మేడ్ బెనారస్ చీరలో సమంత చక్కగా ఒదిగిపోయింది. ఆ సందర్భంలో తీసిన ఫొటోల్లో ఆమె.. కెమెరా వైపునకు కాస్త దూరంగా నిల్చుని అదో స్టైల్లో ఫోజులిచ్చింది. మరో పిక్‌లో నవ వధువు అలంకరణంలో తెగ మెరిసిపోతోంది. ఇలా వివిధ రకాల్లో ఆమె పెళ్లి ఫొటోల్లో కనిపించింది' అని సమంత పెళ్లి జరిగిన విధానాన్ని తన ఇన్‌స్టా వేదికంగా వివరించారు అర్పిత. వీటిలో సమంత ఎరుపు రంగు బెనారస్ చీరలో ఉన్న పిక్‌లో.. ఆమెలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందని చెప్పుకొచ్చారామె. ఆ చీరను ఒకే మాస్టర్ ఆర్టిస్ట్.. 2-3 వారాల సమయం తీసుకుని నేసినట్టు పేర్కొన్నారు.
ఇక ఆమె ధరించిన బ్లౌజ్ గురించి చెప్పబోతూ.. ప్రముఖ కళాకారిణి జయతి బోస్ దానిని రూపొందించిందన్నారు అర్పిత. అలా చక్కటి వస్త్రధారణలో వధువు అలంకరణలో సమంత చాలా చక్కగా అందంగా ఉందని వ్యాఖ్యానించారీ డిజైనర్.
ఇవీ చదవండి: