Share News

Morning Walking Tips: ఉదయం 30 నిమిషాలు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ABN , Publish Date - Sep 03 , 2025 | 07:24 AM

ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాలు వాకింగ్ చేస్తే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Morning Walking Tips: ఉదయం 30 నిమిషాలు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Walking

ఇంటర్నెట్ డెస్క్: నడక సాధారణ వ్యాయామం అయినా శరీరానికి, మనసుకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఉదయం నిద్రలేవగానే వాకింగ్‌కు వెళ్తారు. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేలరీలు బర్న్ చేయడం నుండి మానసిక ఆరోగ్యం వరకు, ఉదయం నిద్రలేచిన వెంటనే అరగంట పాటు నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


ఉదయం వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ఉదయం నిద్రలేచిన వెంటనే 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. రోజంతా చురుకుగా ఉంటారు. ఉదయం నడక రోజంతా అప్రమత్తంగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

  • ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. ఉద్రిక్తత, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా అలసట, నిరాశ సమస్యను తొలగిస్తుంది.

  • ఉదయం వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే, ఉదయం నడవడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

  • ఉదయం 30 నిమిషాల నడక నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదయం వాతావరణం ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల మెదడుకు మంచి ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది.


Also Read:

వర్షాల ఎఫెక్ట్..ఈ ప్రాంతాల్లో నేడు స్కూల్స్ బంద్..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Latest News

Updated Date - Sep 03 , 2025 | 07:25 AM