Malaika Arora Fitness Tips: మలైకా ఫిట్‌నెస్ రహస్యం.. ఈ చైనీస్ వ్యాయామాలు మీ జీవితాన్ని మార్చేస్తాయట!
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:21 PM
బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా తన ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతో మంది అభిమానులను ప్రేరేపిస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా తన ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతో మంది అభిమానులను ప్రేరేపిస్తుంటారు. యోగా, జిమ్, ఆరోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఆమె రోజువారీ జీవితంలో భాగం. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో మలైకా చైనీస్ వ్యాయామాలు చేశారు. వీటిని చేయడం వల్ల 10 ఏళ్లు చిన్నవారిలా, 5 కిలోలు బరువు తగ్గినట్లుగా అనిపిస్తుందని ఆమె చెప్పింది. ఈ వ్యాయామాలు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గిస్తాయని, శరీరాన్ని శక్తివంతంగా మార్చుతాయని, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని మలైకా వివరించారు.
మలైకా సూచించిన 7 చైనీస్ వ్యాయామాలు ఇవే:
నెక్ రోల్స్, షోల్డర్ ఓపెనర్లు: ఇవి శరీరంలోని ఉద్రిక్తతను తగ్గిస్తాయి. డెస్క్‌ల వద్ద ఎక్కువ గంటలు పనిచేసే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మెడ, భుజాలలో ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది.
వెన్నెముక ట్విస్ట్‌లు: ఈ వ్యాయామం అంతర్గత అవయవాలను మసాజ్ చేయడానికి సహాయపడుతుంది. వెన్నెముక కదలిక, భంగిమను కూడా మెరుగుపరుస్తుంది.
షోల్డర్ లిఫ్ట్‌లు: షోల్డర్ లిఫ్ట్‌లు (భుజాలు పైకి ఎత్తడం) అనేది కండరాల బలాన్ని, భుజాల కదలికను మెరుగుపరిచే వ్యాయామం. ఈ కదలికలు భుజాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
మొండెం వంపులు: ఇవి భుజాలను పొడవుగా చేయడానికి, భంగిమను మెరుగుపరచడానికి, ఫ్లెక్సిబిలిటీకి సహాయపడతాయి.
పెల్విక్ టిల్ట్స్: ఇవి బిగుతుగా ఉన్న తుంటిని ఫ్రీగా చేయడానికి, సమతుల్యతను మెరుగుపరచడానికి, దిగువ వీపును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
లెగ్ స్ట్రెచ్‌లు, కిక్స్: కాళ్లు, తొడ కండరాలను సాగదీయడానికి చేసే వ్యాయామాలు. వీటిలో హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెచ్, క్వాడ్రిస్ప్స్ స్ట్రెచ్, పిక్కల స్ట్రెచ్, కాళ్ళ కదిలిక కోసం చేసే వ్యాయామాలు ఉంటాయి. సాధారణంగా, వీటిని వ్యాయామం తర్వాత, లేదా కండరాల బిగుతును తగ్గించడానికి, కండరాలు ఫ్లెక్సిబిల్‌గా మారడానికి చేస్తారు.
ఈ కదలికలు మొదట చూస్తే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇవి మీ శరీరంలో దాగి ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. శక్తివంతమైన మార్గాల్లో శరీరాన్ని తెరుస్తాయి. ఈ 7 చైనీస్ వ్యాయామాలు మీ ఆరోగ్యం కోసం ఓ సులభమైన, ప్రభావవంతమైన మార్గం కావచ్చు. రోజూ కొద్దిసేపు అలానే చేస్తే, మీరు మీ శరీరంలో స్పష్టమైన మార్పులు గమనించగలుగుతారు. కేవలం తేలికగా అనిపించడమే కాదు, నిజంగా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు.!
(Note: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..
వైసీపీ అరాచకాలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
For More Latest News