Share News

Line dancing: లవ్లీ ‘లైన్ డ్యాన్స్’...ఆహ్లాదకరమైన వాతావరణంలో..

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:04 PM

ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా నలుగురితో కలిసి కాలు కదిపితే... మనసుతో పాటు శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగు తుంది. ఒక లయబద్ధంగా చేసే ‘లైన్‌ డ్యాన్స్‌’ మెదడులోని హిప్పోకాంపస్‌ను చురుగ్గా మారుస్తుంది. ఇది ఒక ఫిజికల్‌ యాక్టివిటీ.

Line dancing: లవ్లీ ‘లైన్ డ్యాన్స్’...ఆహ్లాదకరమైన వాతావరణంలో..

డ్యాన్స్‌ అనేది శారీరకంగా, మానసికంగా ఒక చక్కని వ్యాయామం. ఆ వ్యాయామానికి అదనంగా ఆనందం తోడైతే... అదే ‘లైన్‌ డ్యాన్స్‌’. ఈ తరహా డ్యాన్స్‌తో శరీరంపై పూర్తి నియంత్రణ వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఒక రిథమ్‌లో చేసే ఈ డ్యాన్స్‌కు ఇటీవల ఆదరణ పెరుగుతోంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా నలుగురితో కలిసి కాలు కదిపితే... మనసుతో పాటు శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగు తుంది. ఒక లయబద్ధంగా చేసే ‘లైన్‌ డ్యాన్స్‌’ మెదడులోని హిప్పోకాంపస్‌ను చురుగ్గా మారుస్తుంది. ఇది ఒక ఫిజికల్‌ యాక్టివిటీ. శరీర సమన్వయంతో పాటు బ్యాలెన్స్‌ను పెంచుతుంది. స్ట్రెస్‌ రిలీవింగ్‌ యాక్టివిటీగా ఈ డ్యాన్స్‌ ఉపయోగపడుతుంది.


క్లబ్‌లో చేరితే...

ఈ తరహా డ్యాన్స్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపే వారికోసం ‘లైన్‌ డ్యాన్సింగ్‌ క్లబ్స్‌’ ఉన్నాయి. ఈ డ్యాన్స్‌ పార్ట్‌నర్‌తో కలిసి, లేదంటే గ్రూప్‌తో కలిసి చేయవచ్చు. ఒంటరిగానూ ప్రాక్టీస్‌ చేయొచ్చు. ఎక్సర్‌సైజు ప్రోగ్రామ్‌గా చాలా క్లబ్‌లు లైన్‌ డ్యాన్సింగ్‌ క్లాసులను అందిస్తున్నాయి. వాతావరణంతో సంబంధం లేకుండా ఇండోర్‌లో ప్రాక్టీస్‌ చేయొచ్చు. సరైన శరీరాకృతి కోసం ప్రయత్నించేవారికి ఈ డ్యాన్స్‌ అద్భుతమైన ఆప్షన్‌. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి ఎఫెక్టివ్‌ ట్రీట్‌మెంట్‌గానూ ఉపకరిస్తుంది. లైన్‌ డ్యాన్స్‌లో బాల్లెట్‌, హిప్‌-హాప్‌, జాజ్‌, పోల్‌ డ్యాన్స్‌, బాల్‌రూమ్‌ డ్యాన్స్‌, ట్యాప్‌ డ్యాన్స్‌ వంటి రకాలున్నాయి.


book9.2.jpg

ప్రయోజనాలు అనేకం...

- కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. ఫ్లోర్‌పై చేసే కదలికలు పాదాలపై ప్రభావం చూపిస్తాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా కండరాల నొప్పి తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

- ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌కు ప్రతిరూపమే లైన్‌ డ్యాన్స్‌. లయబద్ధంగా చేసే కదలికలు హృదయ స్పందన రేటును పెంచుతాయి. లైన్‌ డ్యాన్స్‌ గుండెకు మేలు చేస్తుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది.

- శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. ఆస్టియోపోరోసిస్‌ రిస్క్‌ తగ్గిపోతుంది. వయసుతో సంబంధం లేదు. ఒక లైన్‌లో మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్స్‌ను రిపీట్‌గా చేస్తుండాలి.


- ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త స్టెప్స్‌ నేర్చుకున్నప్పుడల్లా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

- డ్యాన్స్‌ వల్ల ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి దూరమవుతుంది. లైన్‌ డ్యాన్స్‌ రోజూ సాధన చేసేవారు ప్రశాంతంగా ఉంటారు. కొవిడ్‌ తరువాత చాలామంది నిరాశనిస్పృహల బారినపడ్డారు. క్రమం తప్పకుండా లైన్‌ డ్యాన్స్‌ చేస్తున్న వారిలో డిప్రెషన్‌ తగ్గిపోయి సంతోషకరమైన జీవనం గడుపుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది.


- కండరాలు బలోపేతం అవుతాయి. పొట్టతో పాటు నడుం కింది భాగం బలోపేతం అవుతుంది. బరువు తగ్గుతారు.

- లైన్‌ డ్యాన్స్‌తో నరాల వ్యవస్థ, పనితీరు మెరుగుపడుతుంది. న్యూరాన్ల మధ్య సంబంధం బాగుంటుంది. ఒంటరితనం దూరమవుతుంది. లైన్‌ డ్యాన్స్‌ మెదడు కణాలను రక్షిస్తుంది. నెగెటివ్‌ ఆలోచనలు దూరమవుతాయి. మెదడు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి, స్టెప్స్‌ గుర్తుంచుకోవడం మాత్రమే కాదు... మ్యూజిక్‌కు అనుగుణంగా లయబద్ధంగా కదిలేలా చేస్తుంది.

- రోజూ చేసే సాధారణ వ్యాయామంతో పోలిస్తే లైన్‌ డ్యాన్సింగ్‌ చాలా రెట్లు మేలని అధ్యయనాల్లో తేలింది. బాడీ బ్యాలెన్స్‌తో పాటు క్రిటికల్‌ థింకింగ్‌ సామర్థ్యం పెరుగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పైన రోడ్డు... కింద హోటల్‌...

కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్, గుడ్డు రేట్లు అమాంతం పెరిగాయి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2025 | 12:04 PM