Uses of lemon Peels: నిమ్మ తొక్కలను ఇలా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:28 PM
నిమ్మ తొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? నిమ్మరసాన్ని పిండిన తర్వాత దాని తొక్కను పారవేసే బదులు, ఈ విధంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: నిమ్మకాయ తొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రసం తీసిన తర్వాత తొక్కలను పారేసే బదులు, వాటిని వివిధ ఇంటి పనులకు పరిష్కారంగా ఉపయోగించవచ్చు. అయితే, వాటిని ఏ విథంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మ తొక్కలను ఎండబెట్టి వార్డ్‌రోబ్ లేదా షూ రాక్ మూలల్లో ఉంచడం వల్ల సువాసన వెదజల్లుతుంది.
మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంటే నిమ్మ తొక్కలను ముక్కలుగా కోసి లోపల ఉంచండి. వాటికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసనను దూరం చేస్తాయి.
నిమ్మ తొక్కలను వంటల్లో కూడా వాడుకోవచ్చు. వీటిని ఎండబెట్టి పొడి చేసి టీ, కూరలు, సలాడ్లలో కలిపితే రుచి రెట్టింపు అవుతుంది. డెజర్ట్‌లు, కేకుల్లో కూడా వేసుకోవచ్చు.
వంటగది సింక్‌లు, గాజు సామాగ్రిని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకుంటే కొత్తవిలా మెరుస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడం: నిమ్మకాయ నీటిలో తొక్కలను మరిగించి తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బ్లడ్ షుగర్: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
డిటాక్సిఫికేషన్: శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో తోడ్పడుతుంది.
ఆక్సీకరణ ఒత్తిడి: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News