Share News

Foot Spa: పెళ్లికి వెళితే... ‘ఫుట్ స్పా’

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:21 PM

వివాహ వేడుకలో ఎక్కువ సేపు నిలబడడం, నడవడం, డ్యాన్సు స్టెప్పులు వేయడం వల్ల అలసటకు గురైన అతిథులు, కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ‘ఫుట్‌ స్పా’ను అందిస్తున్నారు.

Foot Spa: పెళ్లికి వెళితే... ‘ఫుట్ స్పా’

పెళ్లికి వెళితే ఫొటోలు, భోజనాలు మాత్రమే కాదు... సరదాగా అతిథులకు ‘ఫుట్‌ స్పా’ కూడా చేస్తారు. డబ్బు ఖర్చు పెడితే... ఈవెంట్‌ మేనేజర్లు ఖరీదైన ‘స్పా’నే పెళ్లి వేదిక దగ్గరకు తీసుకువస్తున్నారు. ఒకవైపు డ్యాన్సులు చేస్తూనే, మరోవైపు ఫుట్‌ మసాజ్‌ చేయించుకుని రిలాక్స్‌ అవ్వొచ్చు. ఆర్భాటపు పెళ్లిళ్లలో ఇప్పుడిదో ట్రెండ్‌. అన్ని నగరాలకు విస్తరిస్తోన్న ఈ నయా ట్రెండ్‌పై లుక్కేద్దాం...

ఎందుకిది?

వివాహ వేడుకలో ఎక్కువ సేపు నిలబడడం, నడవడం, డ్యాన్సు స్టెప్పులు వేయడం వల్ల అలసటకు గురైన అతిథులు, కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ‘ఫుట్‌ స్పా’ను అందిస్తున్నారు.


ఆన్‌లైన్‌లో బోలెడు...

గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఫుట్‌ స్పా ఈవెంట్‌ సర్వీస్‌/ వెడ్డింగ్‌ ఫుట్‌ స్పా సెటప్‌ అని సెర్చ్‌ చేసి, వారికి డీఎమ్‌, కాల్‌ లేదా వాట్సాప్‌ చేయాలి. రివ్యూలు, రేటింగ్స్‌ చెక్‌ చేయడం మరిచిపోవద్దు. లేదంటే ఈవెంట్‌ ప్లానర్‌ను సంప్రదించి పెళ్లి వేడుక జరిగే చోట ఈ సర్వీస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసులు ముంబై, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, పుణే, జైపూర్‌, కొచ్చి లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.


book10.2.jpg

బుక్‌ చేసేముందు...

- మెహందీ/ సంగీత్‌/ రిసెప్షన్‌/ బారాత్‌.. ఇలా ఫంక్షన్‌ టైప్‌ని కచ్చితంగా తెలియజేయాలి.

- ఎంతమంది అతిథులు హాజరవుతారో చెప్పాలి. దానికి అనుగుణంగా స్పా స్టేషన్స్‌, థెరపిస్ట్‌లను ఏర్పాటు చేస్తారు.

- సమయం, ప్రదేశం, ఈవెంట్‌ ఎప్పుడు, ఏ వేళ (ఉదయం/ సాయంత్రం/ రాత్రి), వేదిక/ హోటల్‌ వంటివి తెలియజేయాలి.


book19.2.jpg

ఏవేవి తీసుకొస్తారు?

- మసాజ్‌ ఆయిల్స్‌

- స్పా చైర్స్‌

- ఫుట్‌ మసాజ్‌ స్టిక్స్‌

- డిస్పోజబుల్‌ వైప్స్‌,

శుభ్రమైన టవల్స్‌, శానిటైజర్స్‌

- ఫుట్‌ స్పా టబ్స్‌

- అరోమా థెరపీ డిఫ్యూజర్స్‌

- ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌లు (మేల్‌, ఫీమేల్‌) అందించే సర్వీసులు

- ఫుట్‌ మసాజ్‌/ ఫుట్‌ స్పా

- షోల్డర్‌, నెక్‌ మసాజ్‌

- అరోమా థెరపీ

- మెనిక్యూర్‌/ పెడిక్యూర్‌- స్టైల్‌ రిలాక్సేషన్‌ ఫ క్విక్‌ స్ట్రెస్‌ రిలీఫ్‌ సెషన్‌ (5- 10 నిమిషాలు)


ఎంత చార్జ్‌ చేస్తారు?

- బేసిక్‌ ప్యాకేజీ: రూ. 10 వేలు- 20 వేలు (స్మాల్‌ వెడ్డింగ్స్‌/ మెహందీ/ 30-50

మంది అతిథుల కోసం)

సమయం: 2-3 గంటలు

(ఒక్కొక్కరికి 5 నిమిషాలు)

- స్టాండర్డ్‌ ప్యాకేజీ: రూ. 25 వేలు- 45

వేలు (మీడియం సైజ్‌ వెడ్డింగ్స్‌/ సంగీత్‌/

హల్దీ/ 80-150 మంది అతిథుల కోసం)

సమయం: 3-5 గంటలు

(ఒక్కొక్కరికి 5-7 నిమిషాలు)

- ప్రీమియం ప్యాకేజీ: రూ.60 వేలు-

1 లక్షా 20 వేలు+ (రిసెప్షన్‌/

డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌/ 150-300

మంది అతిథుల కోసం)

సమయం: 4-6 గంటలు (ఒక్కొక్కరికి 7-10 నిమిషాలు ప్రయోజనాలు

- పెళ్లి అంటేనే హడావుడి. నిద్రాహారాలు మరిచి పనుల్లో నిమగ్నమైపోతుంటారు. అలా అలసిపోయిన వారికి ఈ సర్వీస్‌ ఉపశమనం కలిగిస్తుంది.

- భారీ లెహెంగాలు, చీరలు, నగలతో గంటల తరబడి నిలబడుతూ, ఫొటోలకు పోజులిచ్చే వధూవరులకు ఇది ఇన్‌స్టంట్‌ రిలాక్సేషన్‌ కార్నర్‌.

- సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చే అతిథులకు ‘వావ్‌’ ఫీలింగ్‌ కలిగిస్తుంది.

- పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తూ అలిసిపోయేవారికి రిలాక్సేషన్‌ ఇస్తుంది.

- కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్న పెద్దవారికి మర్దన మేలు చేస్తుంది. వారిని హుషారుగా ఉంచుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

చుక్కలు చూపిస్తున్న ఇండిగో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2025 | 01:59 PM