Share News

World Food Day 2025: ప్రపంచ ఆహార దినోత్సవం..ఆకలితో అలమటిస్తున్న మిలియన్ల మంది

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:41 PM

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. దీన్ని ప్రాముఖ్యత ఏంటి?

World Food Day 2025: ప్రపంచ ఆహార దినోత్సవం..ఆకలితో అలమటిస్తున్న మిలియన్ల మంది
World Food Day

ఇంటర్నెట్ డెస్క్: ఆహారం మన ఆరోగ్యానికి, శరీరానికి చాలా అవసరం. భూమి మీద ఆహారం లేకుండా ఏ ప్రాణి బ్రతుకలేదు. అందుకే ఆహారాన్ని వృధా చేయకూడదని అంటారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది ఆహారాన్ని అలసత్వంగా తీసుకుంటున్నారు. వృథా చేస్తున్నారు.

Food.jpg


ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 1 బిలియన్ కంటే ఎక్కువ భోజనం వృధా అవుతోంది. అదేవిధంగా, ప్రపంచంలోని 1/3 వంతు మంది ప్రజలు తగినంత ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఒక నివేదిక ప్రకారం, దాదాపు 800 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆహార కొరత, పోషకాహార లోపం, ఆర్థిక ఇబ్బందులు వంటి అనేక కారణాలు ఉన్నాయి.

Food (1).jpg

1945లో ఐక్యరాజ్యసమితి.. ఆహార, వ్యవసాయ సంస్థను (FAO) స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపంపై ఈ సంస్థ పోరాడుతుంది. ఆహార సమస్య గురించి అవగాహన పెంచడానికి, ఆహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Food (2).jpg


ప్రాముఖ్యత ఏంటి?

  • ప్రపంచ ఆకలి సంక్షోభం గురించి అవగాహన పెంచడానికి, ఆహారం ప్రాథమిక మానవ హక్కు అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు.

  • ఆహారాన్ని వృధా చేయకూడదనే ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

  • పోషకాహార లోపం, ఊబకాయం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున అనేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.


Also Read:

ఇలాంటి స్నేహితులు శత్రువుల కంటే ప్రమాదం..

సాధారణ వెన్నునొప్పి వెన్నెముకకు ఎంత ప్రమాదకరమో తెలుసా?

For More Latest News

Updated Date - Oct 16 , 2025 | 01:09 PM