Winter Special Soups: ఈ సూప్‌లు శీతాకాలంలో శరీరానికి అమృతం లాంటివి!
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:21 AM
శీతాకాలంలో ఈ సూప్‌లు శరీరానికి అమృతం లాంటివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ సూప్‌లను తీసుకోవడం వల్ల వ్యాధులు దూరంగా ఉంటాయాని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం చల్లని వాతావరణం, సూర్యరశ్మి తగ్గడం, ఇంటి లోపల ఎక్కువ సమయం గడపడం. దీని వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే, కొన్ని సూప్‌లను ఆయుర్వేదంలో శరీరానికి ఒక వరంగా భావిస్తారు. అవి రుచికరంగా ఉండటం మాత్రమే కాకుండా సహజ మందులుగా కూడా పనిచేస్తాయి. ఈ సూప్‌లు శీతాకాలంలో శరీరానికి అమృతం లాంటివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల వ్యాధులు దూరంగా ఉంటాయాని సూచిస్తున్నారు.
టమాటా సూప్
టమాటా సూప్ శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చలికాలంలో ఈ సూప్ తీసుకోవడం వల్ల చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. పైగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. జలుబు, దగ్గ ఉన్నప్పుడు తీసుకుంటే మెడిసిన్ లాగా పని చేస్తుంది.
పెసరపప్పు సూప్
పెసరపప్పు సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సూప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
క్యారెట్, బీట్‌రూట్ సూప్
మీరు రక్తహీనత, బలహీనతతో బాధపడుతుంటే లేదా మీ చర్మ కాంతిని పెంచుకోవాలనుకుంటే క్యారెట్, బీట్‌రూట్ సూప్ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సూప్ శీతాకాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్లం-వెల్లుల్లి సూప్
అల్లం-వెల్లుల్లి సూప్ శీతాకాలంలో ఔషధంగా పనిచేస్తుంది. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. శీతాకాలంలో శరీరాన్ని వేడి చేస్తుంది. చిటికెడు నల్ల మిరియాలు జోడించడం వల్ల దాని రుచి పెరుగుతుంది.
తులసి-అల్లం సూప్
జలుబు నుండి ఉపశమనం పొందాలనుకునేవారు తులసి-అల్లం సూప్ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
Also Read:
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
For More Latest News