Meat Consumption: స్త్రీల కన్నా పురుషులు మాంసం ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:25 PM
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే, పురుషులు ఎక్కువగా మాంసం తింటారా? లేదా మహిళలు ఎక్కువగా తింటారా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. ఇది తినే వారి సంఖ్య ఎలా ఉన్నప్పటికీ నాన్ వెజ్ టేస్టీగా ఉంటుందని, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మాంసప్రియులు అంటుంటారు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. ప్రతి రోజు నాన్ వెజ్ తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, పురుషులు ఎక్కువగా మాంసం తింటారా? మహిళలు ఎక్కువగా తింటారా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరు ఎక్కువగా మాంసం తింటారు?
ఒక అధ్యయనం ప్రకారం, ఎవరు ఎక్కువ మాంసం తింటారు అనే విషయంపై 23 దేశాల నుంచి 20,800 మందిపై పరిశోధన జరిగింది. దీనిలో పురుషులు మహిళల కంటే ఎక్కువ మాంసం తింటారని తేలింది. మరి ముఖ్యంగా, అభివృద్ధి చెందిన దేశాల్లో పురుషులు, మహిళలు సమాన హోదా, స్వేచ్ఛ కలిగినా, పురుషులు మాత్రం ఎక్కువగా మాంసం తీసుకుంటున్నారని పరిశోధన తెలిపింది. ప్రాసెస్ చేసిన మాంసంను ఎక్కువగా తింటారని తేలింది.
పురుషులు ఎక్కువగా మాంసం ఎందుకు తింటారు?
చాలా దేశాల్లో, మాంసం తినడం పురుషత్వానికి చిహ్నంగా భావిస్తారు. మాంసం తినేవారు బలంగా ఉంటారు అనే అభిప్రాయం ఉంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ ఆహారం తీసుకోవాలనే విషయంలో పురుషులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వారు ఎక్కువగా మాంసాన్ని ఎంచుకుంటారు.
వయస్సు పెరిగే కొద్దీ మాంసం వినియోగం తగ్గుతుంది. కానీ, యువకులు, మధ్య వయస్కులు ఎక్కువ మాంసం తింటారు.
చైనా, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాల్లో మాత్రం పురుషులు మహిళల మధ్య ఈ తేడా తక్కువగా ఉంది. మాంసం ఎవరు ఎక్కువగా తింటారనే విషయంలో పెద్ద తేడా లేదు.

మారుతున్న అలవాట్లు
ఇప్పుడిప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మాంసం వినియోగం తగ్గించి, మొక్కల ఆధారిత ఆహారం వైపు మళ్లుతున్నారు. ఆరోగ్యం, పర్యావరణం, జంతు సంక్షేమం పై అవగాహన పెరగడం వలన ఈ మార్పు వస్తోంది. మొత్తం మీద, పురుషులు మహిళల కంటే ఎక్కువ మాంసం తింటారు అనే విషయం స్పష్టంగా తేలింది. అయితే భవిష్యత్తులో ఈ తేడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
ఈ ఇంటి చిట్కాలు మీ కాలేయాన్ని శుభ్రపరుస్తాయి!
చాక్లెట్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
For More Lifestyle News