Meal Maker: మీల్ మేకర్.. ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:05 PM
మీల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శాకాహారులకు ప్రోటీన్ అందించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ మీల్ మేకర్‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: మీల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శాకాహారులకు ప్రోటీన్ అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల బలానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే, ఈ మీల్ మేకర్‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? దీనిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
మీల్ మేకర్ ఎలా తయారు చేస్తారంటే?
సోయా చిక్కుడు గింజల నుంచి ముందుగా ఆయిల్‌ను వేరుచేస్తారు. అప్పుడు కేవలం సోయా పిండి మిగిలిపోతుంది. సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్‌గా మారుస్తారు. దీనిలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా, దీనిలో కొవ్వు అస్సలు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని కూడా అంటారు.
మీల్ మేకర్‌ను వివిధ రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు. ముందుగా, వాటిని వేడి నీటిలో 10-15 నానబెట్టండి. తర్వాత వాటిని నీటిలోంచి తీసి, గట్టిగా పిండి పక్కన పెట్టండి. ఆ తర్వాత వాటిని కూరలు, బిర్యానీలు, లేదా మీల్ మేకర్ 65 వంటి స్నాక్స్‌లో ఉపయోగించవచ్చు. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
Also Read:
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కారణాలు ఏంటో తెలుసుకోండి.!
శీతాకాలంలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.!
For More Lifestyle News