Reasons for Tiredness: ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కారణాలు ఏంటో తెలుసుకోండి.!
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:26 PM
చాలా మంది రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా తరచుగా అలసిపోతారు. అయితే, ఇలా అలసిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవితంలో ఒత్తిడి, మానసిక అలసట ఎక్కువ కావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. బిజీ జీవనశైలి, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిళ్లు, సామాజిక అభద్రత ఇవన్నీ మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి. నిరంతర ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి అలసటకు దారితీస్తుంది. కొంతమందికి తగినంత నిద్రపోయిన తర్వాత అలసట తీరుతుంది. కానీ, మరికొందరూ ఎంత నిద్ర పోయినా ఎప్పుడూ అలసిపోయినట్లుగానే ఉంటారు. ఈ సమస్య అనేక ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇనుము లోపం
మన శరీరం ఇనుము లోపంతో ఉన్నప్పుడు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది అన్ని శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల మనం అలసిపోయినట్లు అనిపిస్తుంది.
డీహైడ్రేషన్
శరీరంలో శక్తి తగ్గిపోయినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుంది. డీహైడ్రేషన్ ఒక ప్రధాన కారణం. శరీరంలో రక్త ప్రసరణ, ఎలక్ట్రోలైట్ల కదలికకు నీరు చాలా అవసరం. నీరు లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి వస్తుంది. అందువల్ల, మనం తగినంత నీరు తాగాలి.
ఒత్తిడి
అలసట, చిరాకుకు ఒత్తిడి అతిపెద్ద కారణం. ఒత్తిడి పరోక్షంగా మీ మొత్తం శరీరం పనితీరును దెబ్బతీస్తుంది. దీని వలన శరీరం మాత్రమే కాకుండా మీ మనస్సు కూడా ఆందోళన, నిరాశకు గురవుతుంది.
మొబైల్ ఫోన్ వాడకం
ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ తమ ఆఫీసులో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో పని చేస్తారు. మొబైల్ ఫోన్ వాడకం కూడా చాలా సాధారణం. ఈ పరికరాల నుండి వెలువడే నీలి కాంతి మీ మెదడును కూడా విశ్రాంతి లేకుండా చేస్తుంది.
Also Read:
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
For More Latest News