Fermented Rice Benefits: వేడి అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా?
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:09 PM
చాలా మంది ఇంట్లో చద్దన్నం కన్నా ఎక్కువగా వేడి అన్నంను తినడానికి ఇష్టపడతారు. అయితే, వేడిగా ఉన్న అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు.!
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది మిగిలిపోయిన అన్నం లేదా చద్దన్నం తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే, వేడిగా ఉన్న అన్నంలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటారు. కానీ, ఇటీవలి జరిగిన ఓ అధ్యయనంలో పరిశోధకులు సంచలన విషయాలు గుర్తించారు. చద్దన్నమే ఆరోగ్యానికి ఉత్తమమని పేర్కొన్నారు. అయితే, చద్దన్నంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి అన్నం కంటే ఇది ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
చద్దన్నంలో విడుదలైన స్టార్చ్ మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వేడి అన్నం కంటే చద్దన్నం తినడం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుందని, ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు గుర్తించారు.

పరిశోధన ఏం చెబుతోంది?
పరిశోధకులు 15 మంది ఆరోగ్యవంతులైన పెద్దలను సర్వే చేసి, బియ్యాన్ని వండి 4°C వద్ద 24 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచారు. తరువాత, దానిని తినడానికి ముందు మళ్లీ వేడి చేసి అందరికీ వడ్డించారు. వండిన వెంటనే తిన్న బియ్యంతో పోలిస్తే, చద్దన్నం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని వారు కనుగొన్నారు. చద్దన్నం తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది ప్రీబయోటిక్‌గా పనిచేయడమే కాకుండా గట్ బాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీకి సంబంధించిన హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు, ఇది ఆకలిని తగ్గిస్తుంది. కడుపులో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి చద్దన్నం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(Note: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
పండ్లు తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదో తెలుసా?
ఒంటరిగా ఉన్నప్పుడు ఈ నాలుగు పనులు చేయడం మంచిది
For More Latest News