Effects of Skipping Breakfast: అల్పాహారం ఆలస్యంగా తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుందా..?
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:18 PM
అల్పాహారం ఆలస్యంగా తింటున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్.. మీరు అల్పాహారం తినడం ఆలస్యం చేసే ప్రతి గంటకు మీ మరణ ప్రమాదం 8-11% పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది పనికి వెళ్లాలనే తొందరలో ఉండటం వల్ల లేదా సమయం లేకపోవడం వల్ల అల్పాహారం దాటవేస్తారు. అయితే, ఈ అలవాటు మంచిది కాదని ఒక అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తినడం వల్ల అకాల మరణం వచ్చే ప్రమాదం ఉందని తేలింది.
అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇటీవల జరిగిన అధ్యాయనంలో పరిశోధకులు కనుగొన్నారు. అల్పాహారం ఆలస్యంగా తీసుకునే ప్రతి గంటకు, మరణ ప్రమాదం 8-11% పెరుగుతుందని చెబుతున్నారు. అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో సమయం చాలా ముఖ్యమైనదని అధ్యయన ఫలితాలు హైలైట్ చేస్తున్నాయి. వృద్ధులలో అకాల మరణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, అల్పాహారం సరైన సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం, అల్పాహార సమయం ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అల్పాహారం ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తుంది. నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం, అలసట వల్ల ఉదయం ఆహారం తయారు చేసుకోవడం ఆలస్యం అవుతుంది. కాబట్టి, రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేచి అల్పాహారం తయారుచేసుకుని క్రమం తప్పకుండా టైంకు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్
గ్రూప్-1 వివాదం మరో మలుపు..డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన TSPSC
For More Latest News