Chicken Vs Mutton: దసరా స్పెషల్.. చికెన్ లేదా మటన్.. ఈ రెండింటిలో ఏది మంచిది?
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:36 AM
దసరా పండుగా సందర్భంగా అందరి ఇళ్లలోనూ చికెన్ లేదా మటన్ కంపల్‌సరీగా ఉండే ఉంటుంది. అయితే, ఈ వర్షాకాలంలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగానే చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. పైగా, మాంసాహారం తినడంలో మనదే రికార్డు అని ఇటీవల నేషనల్ శాంపిల్ సర్వే కూడా తేల్చింది. ఇక అలాంటిది, దసరా పెద్ద పండగ కావడంతో అందరి ఇళ్లలోనూ మాంసాహారం తప్పని సరిగా ఉంటుంది. కొంత మంది చికెన్ తినడానికి ఇష్టపడితే, మరికొంత మంది మటన్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ రెండింటిలో చికెన్ మంచిదా లేదా మటన్ మంచిదా? ఏది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ ప్రయోజనాలు
చికెన్.. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కణజాల మరమ్మత్తుకు, మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్‌లో సెలీనియం, నియాసిన్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు, B విటమిన్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు, శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా చికెన్ తోడ్పడుతుంది. అయితే, వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణంలో మాంసం కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున, చికెన్‌ను శుభ్రంగా, బాగా ఉడికించి, వెంటనే తినడం ముఖ్యం.
మటన్ ఆరోగ్య ప్రయోజనాలు
మటన్ తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, ఐరన్, విటమిన్ బి12, జింక్, సెలీనియం వంటి పోషకాలు అందుతాయి, ఇవి కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, వర్షాకాలంలో మటన్ తినడం విషయంలో కొంత జాగ్రత్త అవసరం, ఎందుకంటే ఈ సీజన్‌లో మాంసం సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి, మటన్‌ను బాగా ఉడికించడం చాలా ముఖ్యం, అప్పుడే అందులోని బ్యాక్టీరియా చనిపోయి, ఆహారం సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా, మటన్‌ను మితంగా తీసుకోవాలి, ఎందుకంటే అధికంగా తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.
చికెన్ వర్సెస్ మటన్
వర్షాకాలంలో ఆరోగ్యం దృష్ట్యా మటన్ కంటే చికెన్ ఆరోగ్యకరం, ఎందుకంటే చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది, జీర్ణం కావడం తేలికవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. మటన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, అందులో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ రెండింటినీ సరైన శుభ్రతతో, మితంగా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
దసరా స్పెషల్.. చికెన్ లేదా మటన్.. ఈ రెండింటిలో ఏది మంచిది?
భారత సినిమాలపై అక్కసు.. కెనడాలో థియేటర్ దహనం
For More Latest News