Lemon water benefits: ప్రతి రోజూ నిమ్మకాయ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
ABN , Publish Date - Sep 18 , 2025 | 10:23 AM
ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరగడంతో పాటు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
నిమ్మకాయ అత్యంత పోషకమైన పండ్లలో ఒకటి. మన పూర్వీకుల కాలం నుంచి నిమ్మకాయను రోగనిరోధకంగా ఉపాయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ ప్రయోజనాలు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మకాయలోని ఔషధ ప్రయోజనాలు పొందడానికి నిమ్మకాయం నీటిని తాగడం మంచిది. ఈ నిమ్మకాయం నీరు తాగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నెల పాటు ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో కలిగే అద్భుతమైన ప్రయోజనాలను స్వయంగా అనుభవించవచ్చు అని నిపుణులు అంటున్నారు.
జీర్ణక్రియను పెంచుతుంది...
ప్రతిరోజూ.. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి తగినంత నీటిని అందించడం మాత్రమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది రాత్రిపూట ఏం తినకుండా ఉండటం వల్ల ఉదయం మెరుగైనా జీర్ణవ్యవస్థను ప్రారంభించడానికి ఇది సహాయపడుతుంది. పరగడుపున తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. ఇది రోజంతా తీసుకునే ఆహారాన్ని జీర్ణ చేయడంలో సహాయపడుతుంది. ఇలా రోజూ నిమ్మకాయం నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగటంతో పాటు శరీరం హైడ్రేటెడ్ అవుతుంది. బరువు కూడా తగ్గడానికి అది సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయ పడుతుంది..
ప్రతిరోజూ.. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలలోని పెక్టిన్ ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలన్న ఆలోచిస్తారు. దానితో పాటు నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కొవ్వును కరిగిస్తుంది. బదులుగా నీటిని తాగేవారు బరువు తగ్గుతారు.
రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది..
నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ప్రతిరోజూ నిమ్మకాయ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరాల తీవ్రతను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. నిమ్మకాయ నీటితో మీ రోజును ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి అధికంగా మెరుగుపడుతుంది.
ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తోంది..
నిమ్మకాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. శారీరక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో ఇది మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
శరీరాన్ని క్షారపరుస్తుంది..
నిమ్మకాయలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, శరీరంపై క్షార ప్రభావాన్ని కలిగి ఉంటాయి. నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వాపును తగ్గించి.. మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నిమ్మకాయ నీటితో రోజును ప్రారంభించడం ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రారంభం నుంచి సమతుల్య అంతర్గత వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. మీ శరీరం రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..