Share News

Montha Cyclone Safety Tips: తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ABN , Publish Date - Oct 29 , 2025 | 02:12 PM

ఏపీలో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Montha Cyclone Safety Tips: తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Montha Cyclone Safety Tips

ఇంటర్నెట్ డెస్క్: మొంథా తుపాన్ తీరం దాటడంతో కోనసీమ అతలాకుతలమవుతోంది. అంతేకాకుండా, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి, మొంథా తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • ముందుగా ప్రశాంతంగా ఉండండి. ఏం జరుగుతుందోననే భయం పెట్టుకోవద్దు.

  • ఇళ్లలో నుండి బయటకు రావద్దు.

  • ముందు జాగ్రత్తగా మీ సెల్ ఫోన్లకు ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టుకోండి.

  • రేడియో, టీవీల ద్వారా ఎప్పటికప్పుడు తుఫాన్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

  • ముఖ్యమైన డాక్యుమెంట్లు తడిచిపోకుండా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి.

  • పదునైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకండి.

  • ఎమర్జెన్సీ కిట్‌ను ముందే సిద్ధంగా ఉంచుకోండి.

  • నిల్వ ఉండే ఆహారాన్ని సిద్ధం చేసుకోండి.

  • బ్యాటరీలతో పని చేసే టార్చిలైట్లను దగ్గరగా పెట్టుకోండి.


తుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వేడి చేసిన నీటిని మాత్రమే తాగండి.

  • అధికారికంగా సమాచారం వచ్చేవరకూ ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాకండి.

  • పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు అధికారులు చెప్పే వరకూ ఇంటికి వెళ్లొద్దు.

  • సాధ్యమైనంత వరకూ షూ వేసుకోవడం మంచిది.

  • విరిగిన స్తంభాలు, విద్యుత్ తీగల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి.

  • తడిచిన గోడలు, దెబ్బతిన్న ఇళ్లు, భవనాల్లోకి అస్సలు వెళ్లొద్దు.

  • ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించే ముందు ఎలక్ట్రిషియన్ తో చెక్ చేయించడం చాలా మంచిది.

  • పొలాల్లోకి వెళ్లేటప్పుడు పాములు, ఇతర కీటకాల పట్ల అప్రమత్తంగా ఉండండి.

  • ఒరిగిన చెట్ల కిందికి అస్సలు వెళ్లకండి.


ఇవి కూడా చదవండి...

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 02:41 PM