Chanakya Niti For Women: మహిళలు వీలైనంత వరకు ఇలాంటి వారికి దూరంగా ఉండాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:07 PM
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే అనేక విషయాలను ప్రస్తావించాడు. అదేవిధంగా, ప్రతి అమ్మాయి వీలైనంత దూరం పాటించాల్సిన కొంతమంది వ్యక్తుల గురించి ఆయన తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే అనేక విషయాలను ప్రస్తావించాడు. అదేవిధంగా, ప్రతి అమ్మాయి వీలైనంత దూరం పాటించాల్సిన కొంతమంది వ్యక్తుల గురించి ఆయన తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు. అలాంటి వ్యక్తుల నుండి అమ్మాయిలు దూరం పాటించకపోతే వారి జీవితాలు నాశనం అవుతాయని ఆయన హెచ్చరించారు. కాబట్టి, ఎలాంటి వారికి మహిళలు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పేవారు:
ఏ సంబంధంలోనైనా సరే నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. అబద్ధం చెప్పే వారిని ఎప్పుడూ నమ్మకూడదు. ముఖ్యంగా మహిళలు ఏ కారణం చేతనైనా అబద్ధం చెప్పే వ్యక్తులతో స్నేహం లేదా సంబంధాన్ని పెంచుకోకూడదు. కొంతమంది మంచిగా మాట్లడుతూనే మీ జీవితాలను నాశనం చేస్తారు. అవకాశం వచ్చిన వెంటనే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి, నిజాయితీ లేని వారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నారు.
నియంత్రించాలనుకునే వారు:
చాలా మంది పురుషులు స్త్రీలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటారు. అందువల్ల, మిమ్మల్ని నియంత్రించి మీ స్వేచ్ఛను హరించాలనుకునే వ్యక్తితో మీరు ఉండకూడదు అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి వ్యక్తులు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోలేరు. అందువల్ల, మహిళలు తమ ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీ పడకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.
దురాశపరులు:
చాణక్యుడి ప్రకారం, స్త్రీలు దురాశపరులతో సంబంధాలు పెట్టుకోకూడదు. స్వార్థం కోసం జీవించే ఈ వ్యక్తులు కష్ట సమయాల్లో మిమ్మల్ని వదిలివేసే అవకాశం ఉంది. కాబట్టి, మిమ్మల్ని గౌరవించే వ్యక్తులతో ఉండండి.
ప్రతికూల వ్యక్తులు:
చాణక్యుడి ప్రకారం, మీ విజయాన్ని చూసి అసూయపడేవారు లేదా మీ గురించి ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు జీవితాన్ని నరకంలా చేస్తారు. మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Also Read:
పాట్నా హైకోర్టు ఆదేశం.. మోదీ తల్లి వీడియో తొలగించాలని కాంగ్రెస్‌కు ఆదేశం
మాతో కలిసి రండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు..
For More Latest News