Share News

Trump Condemns: నేషనల్ గార్డ్స్‌పై కాల్పులను తీవ్రంగా పరిగణించిన ట్రంప్

ABN , Publish Date - Nov 27 , 2025 | 09:06 AM

వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కుట్రదారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దేవుడు, యావత్ అమెరికా ప్రజలు భద్రతా దళాల వెంట ఉన్నారని ట్రంప్ చెప్పారు.

Trump Condemns: నేషనల్ గార్డ్స్‌పై కాల్పులను తీవ్రంగా పరిగణించిన ట్రంప్
Washington DC Shooting

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ పోలీసులపై జరిపిన కాల్పులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దుష్టమూకలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 'దేవుడు మన గ్రేట్ నేషనల్ గార్డ్‌ను, మన మిలిటరీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆశీర్వదిస్తాడు. వాళ్లంతా గొప్ప వ్యక్తులు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నేను, ప్రెసిడెన్సీ కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మీతో ఉన్నారు.' అని ట్రంప్ అన్నారు.


కాగా, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఒక వ్యక్తి నేషనల్ గార్డ్స్ మీద కాల్పులు జరిపాడు. వైట్ హౌస్‌కు అతి సమీపంలో రద్దీగా ఉండే ఫారగుట్ స్క్వేర్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకన్వాల్‌గా అధికారులు గుర్తించారు. ఇతను 2021లో అమెరికాలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.


ఈ దాడికి కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాడి జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. వైట్ హౌస్‌ను వెంటనే లాక్‌డౌన్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఆ సమయంలో వైట్ హౌస్ లో లేరని అధికార వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 10:01 AM