Share News

US tariffs: త్వరలో భారత్‌, చైనాపై పరస్పర సుంకాలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:53 AM

గతవారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా తాను చెప్పిన విషయాన్ని శుక్రవారం వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పునరుద్ఘాటించారు.

US tariffs: త్వరలో భారత్‌, చైనాపై పరస్పర సుంకాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటన

విదేశీ నేరస్థులను సాగనంపుతున్నామని వ్యాఖ్య

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 23: భారత్‌, చైనా వంటి దేశాలపై త్వరలో పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. గతవారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా తాను చెప్పిన విషయాన్ని శుక్రవారం వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పునరుద్ఘాటించారు. ఏ కంపెనీ అయినా, ఏ దేశమైనా అమెరికా వస్తువులపై ఎంతెంత సుంకాలు విధిస్తున్నాయో తాము కూడా అదే స్థాయిలో సుంకాలు విధించనన్నట్లు తెలిపారు. కొత్తగా పదవిలోకి వచ్చిన హోవార్డ్‌ దీనికి బాధ్యత వహించబోతున్నారని తెలిపారు. తాము న్యాయంగా ఉండాలని భావిస్తున్నామని, అందుకే ‘పరస్పరం’ అంటున్నామని చెప్పారు. మరోవైపు, అక్రమ వలసదారుల గురించి ట్రంప్‌ మాట్లాడుతూ... వారి వెళ్లగొట్టి దేశంలో పేరుకుపోయిన బురదను కడిగేయడానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

భారత్‌కు మరో 12 మంది వలసదారులు

తగిన అధికారిక పత్రాలు లేవన్న కారణంతో మరో 12 మంది భారతీయులను అమెరికా తిప్పి పంపించింది. వారు ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అక్రమ వలసదార్లు అన్న పేరుతో తొలుత అమెరికా ప్రభుత్వం 299 మంది భారతీయులను పనామా పంపించింది. అందులో 171 మంది తిరిగి వచ్చేందుకు అంగీకరించారు. వారిలో ప్రస్తుతం 12 మంది స్వదేశానికి వచ్చారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Feb 24 , 2025 | 04:53 AM