Share News

DeepSeek: డీప్‌ సీక్‌తో మేధో చౌర్యం ముప్పు !

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:24 AM

డీప్‌ సీక్‌ వల్ల మేధోసంపత్తి చౌర్యం జరిగే ముప్పు పొంచి ఉందని వైట్‌హౌస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సలహాదారు డేవిడ్‌ సాక్స్‌ అన్నారు. ఏఐలో ఉండే డిస్టిలేషేన్‌ అనే విధానం ద్వారా ఈ చౌర్యం సాధ్యమని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్స్‌ పేర్కొన్నారు.

DeepSeek: డీప్‌ సీక్‌తో మేధో చౌర్యం ముప్పు !

చైనా ఏఐపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌, జనవరి 30: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనాకు చెందిన ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. డీప్‌ సీక్‌ వల్ల మేధోసంపత్తి చౌర్యం జరిగే ముప్పు పొంచి ఉందని వైట్‌హౌస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సలహాదారు డేవిడ్‌ సాక్స్‌ అన్నారు. ఏఐలో ఉండే డిస్టిలేషేన్‌ అనే విధానం ద్వారా ఈ చౌర్యం సాధ్యమని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్స్‌ పేర్కొన్నారు. డిస్టిలేషన్‌ ముప్పును నివారించేందుకు దిగ్గజ సంస్థలు అతి త్వరలోనే చర్యలు తీసుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందిస్తూ భారతీయ సర్వర్ల నుంచే డీప్‌ సీక్‌ను హోస్ట్‌ చేస్తామని ప్రకటించారు. డేటా గోప్యతపై ఆందోళనలకుఇదే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. కాగా, కాపీ రైట్స్‌ ఉల్లంఘనకు సంబంధించి భారతీయ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ సహా పలు సంస్థలు ఓపెన్‌ ఏఐపై దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఓపెన్‌ ఏఈ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఫిబ్రవరి 5న భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 05:24 AM